ఇండియన్ నేవీలో 155 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ పోస్టులు
ఇండియన్ నేవీ 2023 జనవరి(ఎస్‌టీ 23) కోర్సు.. వివిధ విభాగాల్లో షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ల భర్తీకి అవివాహితులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 155
» బ్రాంచ్‌ల వారీగా ఖాళీలు: ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్–93, ఎడ్యుకేషన్ బ్రాంచ్ (ఎడ్యుకేషన్)–17, టెక్నికల్ బ్రాంచ్–45.
» ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్: విభాగాలు:జనరల్ సర్వీస్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, అబ్జర్వర్, పైలట్, లాజిస్టిక్స్. అర్హత: కనీసం 60శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత టెక్నికల్ నైపుణ్యాలు ఉండాలి.
» ఎడ్యుకేషన్ బ్రాంచ్(ఎడ్యుకేషన్): అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎంఏ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
» టెక్నికల్ బ్రాంచ్: విభాగాలు: ఇంజనీరింగ్ బ్రాంచ్(జనరల్ సర్వీస్), ఎలక్ట్రికల్ బ్రాంచ్
(జనరల్ సర్వీస్). అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి.
» వయసు: 02.01.1998 నుంచి 01.07.2003 మధ్య జన్మించి ఉండాలి.
» ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలు, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 12.03.2022
» వెబ్‌సైట్: joinindiannavy.gov.in
బీఈ/బీటెక్ 60 శాతం మార్కులతో పాసయ్యారా? ఈ జాబ్‌కు అప్లై చేసుకోండి..
Published Wed, Mar 2 2022 6:03 PM | Last Updated on Wed, Mar 2 2022 7:09 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment