naval staff
-
హౌతీ అటాక్స్.. ఆఫ్రికా చుట్టూ తిరుగుతున్న నౌకలు!
అంతర్జాతీయ వాణిజ్యానికి జీవనాడి లాంటి సూయెజ్ కాలువలో 2021లో అతిపెద్ద కంటైనర్ నౌకల్లో ఒకటైన ఎవర్ గివెన్ చిక్కుకున్న విషయం తెలిసిందే. జపాన్‌కు చెందిన షూయీ కిసెన్ కేకే సంస్థకు చెందిన ఈ నౌకను అష్టకష్టాలతో ఎలాగోలా బయటకు తీసుకొచ్చిన ఉదంతం ఉంది. ఈ ఘటన వల్ల ప్రపంచ వాణిజ్యంపై చాలా ప్రభావం పడింది. వేల టన్నుల్లోని సరకు రవాణా నిలిచిపోయింది. దాంతో ప్రపంచ వాణిజ్యానికి వేలకోట్లల్లో నష్టం వాటిల్లినట్లు అంచనా. తాజాగా ఎర్ర సముద్రంలో నెలకొన్న సంక్షోభంతో షిప్పింగ్ ధరలు 60 శాతం వరకు పెరిగే అవకాశం కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఇన్సూరెన్స్ ప్రీమియం మరో 20 శాతం పెరగొచ్చని జీటీఆర్ఐ నివేదిక వెల్లడించింది. ఎర్ర సముద్రం, మెడిటేరియన్ సముద్రం, హిందూ మహాసముద్రానికి కలిపే కీలక జలసంధి బాబ్ ఎల్ మండెబ్ వద్ద ఉద్రిక్తతలు పెరిగాయి. యెమెన్ హౌతీ మిలిటెంట్లు దూకుడు పెంచడంతో ఈ రూట్లో రవాణా కష్టంగా మారినట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది. దాంతో నౌకా సంస్థలు కేప్ ఆఫ్ గుడ్ హోప్ గుండా ఆఫ్రికా చుట్టూ తిరిగి వచ్చేలా ప్రయాణం మొదలుపెట్టాయి. ఫలితంగా భారత్‌కు సరుకు రవాణా కావాలంటే అదనంగా 20 రోజుల వరకు సమయం పడుతుందని జీటీఆర్ఐ తెలిపింది. హౌతీ దాడులతో మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, యూరప్‌తో ఇండియాకు జరుగుతున్న వ్యాపారంపై ప్రభావం పడుతోందని పేర్కొంది. క్రూడాయిల్, ఎల్ఎన్జీ దిగుమతుల కోసం ఇండియా ఎక్కువగా బాబ్ ఎల్ మండెబ్ జలసంధిపై ఆధారపడుతోంది. ఎర్ర సముద్రం మీదుగా సుదీర్ఘకాలం సరుకు రవాణాకు అంతరాయం కలిగితే ఐరోపాలో ధరలు పెరుగుతాయి. సూయెజ్ కాలువ ద్వారా జరిగే రవాణాలో చమురు ఐదో వంతు ఉంటుంది. రెండు వైపులా రోజుకు దాదాపు 9 కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా అవుతుంది. దీనికి ఆటంకం కలిగితే 2024లో చమురు ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూరప్, ఉత్తర అమెరికాతో భారత్‌కు జరుగుతున్న సరుకు రవాణాలో ఏటా 50 శాతానికి పైగా దిగుమతులు, 60 శాతం ఎగుమతులు ఉన్నాయి. దాంతో మొత్తం 113 బిలియన్ డాలర్(దాదాపు రూ.9 లక్షల కోట్లు)ల వ్యాపారానికి ఈ రూట్ చాలా కీలకమని జీటీఆర్ఐ వెల్లడించింది. ఫలితంగా భారత్ ఇతర మార్గాల వైపు చూడాల్సి వస్తోందని తెలిపింది. ఎర్ర సముద్రంలోని షిప్‌ల కోసం ఇండియా సేఫ్టీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ, వీటి రవాణాను ముఖ్యంగా గ్లోబల్ షిప్పింగ్ కంపెనీలు చేపడుతున్నాయని ఈ రిపోర్ట్ వెల్లడించింది. ఇదీ చదవండి: డే ట్రేడింగ్ చేయకూడదు.. సెబీ కీలక నిర్ణయం! హౌతీ తెగకు చెందిన వారి హక్కుల పరిరక్షణ పేరుతో జైదీ షియాలు హౌతీ గ్రూపును ఏర్పాటు చేశారు. పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్ పెత్తనాన్ని ఈ గ్రూపు వ్యతిరేకిస్తుంటుంది. పశ్చిమ యెమెన్‌ను కేంద్రంగా చేసుకుని ఈ గ్రూప్ తన కార్యకలాపాలు సాగిస్తోంది. ఇరాన్‌తోపాటు ఈ ప్రాంతంలోని ఇస్లామిక్ గ్రూపులు హౌతీ రెబల్స్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. ఎర్ర సముద్ర ముఖద్వారంగా ఉన్న బాబ్ ఎల్-మండెబ్పై హౌతీ రెబల్స్‌కు ఆధిపత్యం ఉంది. ప్రస్తుతం ఈ గ్రూపునకు అబ్దుల్-మాలిక్ అల్ హౌతీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. -
బీఈ/బీటెక్ 60 శాతం మార్కులతో పాసయ్యారా? ఈ జాబ్‌కు అప్లై చేశారా?
ఇండియన్ నేవీలో 155 ఎస్ఎస్సీ ఆఫీసర్ పోస్టులు ఇండియన్ నేవీ 2023 జనవరి(ఎస్టీ 23) కోర్సు.. వివిధ విభాగాల్లో షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ల భర్తీకి అవివాహితులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం పోస్టుల సంఖ్య: 155 » బ్రాంచ్‌ల వారీగా ఖాళీలు: ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్–93, ఎడ్యుకేషన్ బ్రాంచ్ (ఎడ్యుకేషన్)–17, టెక్నికల్ బ్రాంచ్–45. » ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్: విభాగాలు:జనరల్ సర్వీస్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, అబ్జర్వర్, పైలట్, లాజిస్టిక్స్. అర్హత: కనీసం 60శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత టెక్నికల్ నైపుణ్యాలు ఉండాలి. » ఎడ్యుకేషన్ బ్రాంచ్(ఎడ్యుకేషన్): అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎంఏ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి. » టెక్నికల్ బ్రాంచ్: విభాగాలు: ఇంజనీరింగ్ బ్రాంచ్(జనరల్ సర్వీస్), ఎలక్ట్రికల్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్). అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. » వయసు: 02.01.1998 నుంచి 01.07.2003 మధ్య జన్మించి ఉండాలి. » ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూలు, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. » దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. » ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 12.03.2022 » వెబ్సైట్: joinindiannavy.gov.in -
తూర్పు నౌకాదళ కేంద్రంలో రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూ
సాక్షి విశాఖపట్నం: విశాఖలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూ ఘనంగా జరిగింది. నావికా దళాలు త్రివిధ దళాల అధిపతి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు ఘనంగా గౌరవ వందనం చేశాయి. PFR-22లో భాగంగా నౌకాదళానికి చెందిన రెండు నౌకాదళాలను, యుద్ధనౌకలు, కోస్ట్ గార్డ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్‌తో కూడిన 60 నౌకలు, 10 వేల మంది సిబ్బందితో కూడిన జలాంతర్గాములకు సంబంధించిన నౌకాదళ శక్తిసామర్ధ్యాలను రివ్యూ చేశారు. భారత దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న దశలో జరిగిన ఈ 12వ ఫ్లీట్ రివ్యూ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మాట్లాడుతూ... "కోవిడ్-19" మహమ్మారి సమయంలో నేవీ పాత్ర శ్లాఘనీయం. స్నేహపూర్వక దేశాలకు వైద్య సహాయం అందించారు. అలాగే ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో చిక్కుకుపోయిన భారతీయ పౌరులు, విదేశీ పౌరులను తరలించారు" అని పేర్కొన్నారు. అంతేకాదు భారత నౌకాదళం నిరంతర నిఘా, సంఘటనలపై సత్వర ప్రతిస్పందన, అలుపెరగని ప్రయత్నాలు సముద్రాల భద్రతను కాపాడుకోవడంలో అత్యంత విజయవంతమైందని రాష్ట్రపతి చెప్పారు. ఈ మేరకు సాయుధ దళాల సుప్రీం కమాండర్ మాట్లాడుతూ.. "నౌకలు, విమానాలు, జలాంతర్గాముల అద్భుతమైన కవాతు ప్రదర్శించింది. ఎలాంటి ఆకస్మిక పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత నౌకాదళం సన్నద్ధతను కూడా ఈ కవాతు ప్రదర్శించింది" అని చెప్పారు. ప్రపంచ వాణిజ్యంలో ఎక్కువ భాగం హిందూ మహాసముద్ర ప్రాంతంలోనే జరుగుతోందని మన వాణిజ్యం, ఇంధన అవసరాలలో గణనీయమై భాగం మహాసముద్రాల ద్వారానే తీరుతుందని కోవింద్ స్పష్టం చేశారు. భారత నావికాదళ నౌకలు, జలాంతర్గాములు, విమానాలు, మన సముద్ర శక్తికి సంబంధించిన ఇతర అంశాల సంసిద్ధతను సమీక్షిస్తున్నందుకు తాను చాలా సంతోషిస్తున్నాని చెప్పారు. భారత నావికాదళం మరింత స్వావలంబనగా మారుతోందని అన్నారు. 'మేక్ ఇన్ ఇండియా' చొరవలో ముందంజలో ఉందని కూడా ఆయన వెల్లడించారు. భారతదేశం అణు జలాంతర్గాములను నిర్మించడం చాలా గర్వించదగ్గ విషయంగా రాష్ట్రపతి కోవింద్ పేర్కొన్నారు. అంతేగాక 1971 యుద్ధ సమయంలో విశాఖపట్నం నగరం అద్భుతమైన సహకారం అందించిందని చెప్పారు. (చదవండి: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు స్వాగతం పలికిన సీఎం జగన్) -
మేడ పైనుంచి జారిపడి నేవల్ కమాండర్ మృతి
సాక్షి, మల్కాపురం (విశాఖ పశ్చిమ): ఐదు అంతస్తుల మేడ పైనుంచి జారిపడి ఓ నేవల్ కమాండర్ శనివారం మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఎన్పీ దర్శిన్ (38) నేవల్ కమాండర్ హోదాలో పనిచేస్తున్నారు. సింథియా సమీపాన గల నేవల్ పార్కు క్వార్టర్స్‌లో ఉంటున్న ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. శనివారం వర్షం కురుస్తుండటంతో తాను ఉంటున్న భవనం ఐదో అంతస్తు నుంచి బాల్కనీ వద్దకొచ్చి చేతిని బయటకు చాచారు. దీంతో ఒక్కసారిగా జారి కిందికి పడిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే దర్శిన్ మృతిచెందినట్టు వైద్యులు చెప్పారు. సీఐ దుర్గాప్రసాద్ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నావీ చీఫ్‌గా సునీల్ లంబా బాధ్యతలు
న్యూఢిల్లీ: భారత నావికాదళ నూతన ప్రధానాధికారిగా అడ్మిరల్ సునీల్ లంబా మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం నౌకాదళ అధిపతిగా ఉన్న ఆర్కే ధోవన్ ఇవాళ పదవీ విరమణ చేశారు. దీంతో ధోవన్ నుంచి సునీల్ లంబా బాధ్యతలు స్వీకరించారు. 58 ఏళ్ల లంబా ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగుతారు. ఇప్పటివరకూ సునీల్ లంబా పశ్చిమ నావికాదళ కమాండర్‌గా విధులు నిర్వహించారు. భారత నావికాదళానికి ఆయన 23వ అధిపతి. 30 ఏళ్ల పాటు నావికదళానికి సేవలందించినందుకుగానూ ఆయన ఇటీవలే పరమ విశిష్ట సేవా పతకంతో కేంద్ర ప్రభుత్వం నుంచి సత్కారం అందుకున్నారు.