నావీ చీఫ్గా సునీల్ లంబా బాధ్యతలు
న్యూఢిల్లీ: భారత నావికాదళ నూతన ప్రధానాధికారిగా అడ్మిరల్ సునీల్ లంబా మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం నౌకాదళ అధిపతిగా ఉన్న ఆర్కే ధోవన్ ఇవాళ పదవీ విరమణ చేశారు. దీంతో ధోవన్ నుంచి సునీల్ లంబా బాధ్యతలు స్వీకరించారు. 58 ఏళ్ల లంబా ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగుతారు.
ఇప్పటివరకూ సునీల్ లంబా పశ్చిమ నావికాదళ కమాండర్‌గా విధులు నిర్వహించారు. భారత నావికాదళానికి ఆయన 23వ అధిపతి. 30 ఏళ్ల పాటు నావికదళానికి సేవలందించినందుకుగానూ ఆయన ఇటీవలే పరమ విశిష్ట సేవా పతకంతో కేంద్ర ప్రభుత్వం నుంచి సత్కారం అందుకున్నారు.