Indian Navy officers
-
జలమార్గాన ప్రపంచయానం
భారత నౌకా దళానికి చెందిన ఇద్దరు మహిళా అధికారులు జలమార్గాన ప్రపంచాన్ని చుట్టబోతున్నారు. లెఫ్టినెంట్ కమాండర్లు ఎ.రూప, కె.దిల్నా అతి త్వరలో ఈ సాహసానికి పూనుకోనున్నట్టు నేవీ అధికార ప్రతినిధి కమాండర్ వివేక్ మాధ్వాల్ ఆదివారం వెల్లడించారు. నావికా దళానికి చెందిన ఐఎన్ఎస్వీ తరిణి నౌకలో వారు ప్రపంచాన్ని చుట్టి రానున్నట్టు తెలిపారు. వారిద్దరూ మూడేళ్లుగా ‘సాగర్ పరిక్రమ’ యాత్ర చేస్తున్నారు. ‘‘సాగర్ పరిక్రమ అత్యుత్తమ నైపుణ్య, శారీరక దృఢత్వం, మానసిక అప్రమత్తత అవసరమయ్యే అతి కఠిన ప్రయాణం. అందులో భాగంగా వారు కఠోర శిక్షణ పొందారు. వేల మైళ్ల ప్రయాణ అనుభవమూ సంపాదించారు’’ అని మాధ్వాల్ వెల్లడించారు. ‘గోల్డెన్ గ్లోబ్ రేస్’ విజేత కమాండర్ (రిటైర్డ్) అభిలాష్ టోమీ మార్గదర్శకత్వంలో వారిద్దరూ శిక్షణ పొందుతున్నారు. గతేడాది ఆరుగురు సభ్యుల బృందంలో భాగంగా గోవా నుంచి కేప్‌టౌన్ మీదుగా బ్రెజిల్‌లోని రియో డిజనీరో దాకా వాళ్లు సముద్ర యాత్ర చేశారు. తర్వాత గోవా నుంచి పోర్ట్‌బ్లెయిర్ దాకా సెయిలింగ్ చేపట్టి తిరిగి డబుల్ హ్యాండ్ పద్ధతిలో బయలుదేరారు. ఈ ఏడాది ఆరంభంలో గోవా నుంచి మారిషస్‌లోని పోర్ట్ లూయిస్ దాకా డ్యూయల్ హ్యాండ్ విధానంలో విజయవంతంగా సార్టీ నిర్వహించారు. నౌకాయాన సంప్రదాయాన్ని పునరుద్ధరించడానికి భారత నావికాదళం గణనీయమైన ప్రయత్నాలు చేసిందని, సముద్ర వారసత్వాన్ని పరిరక్షించడానికి ఇలాంటి యాత్రలను ప్రోత్సహిస్తోందని మాధ్వాల్ తెలిపారు. ఐఎన్ఎస్–తరంగిణి, ఐఎన్ఎస్–సుదర్శిని, ఐఎన్ఎస్వీ–మహదీ, తరిణి నౌకల్లో సముద్రయానం ద్వారా భారత నావికాదళం సాహసయాత్రలకు కేంద్ర బిందువుగా నిలిచిందన్నారు. 2017లో జరిగిన చరిత్రాత్మక తొలి ‘నావికా సాగర్ పరిక్రమ’లో భాగంగా మన మహిళా అధికారుల బృందం ప్రపంచాన్ని చుట్టొచి్చంది ఐఎన్ఎస్వీ తరిణిలోనే! 254 రోజుల ఆ సముద్రయానంలో బృందం ఏకంగా 21,600 మైళ్లు ప్రయాణించింది. – న్యూఢిల్లీ -
దౌత్య విజయం
అధికారిక, అనధికారిక మార్గాల ద్వారా సాగించిన వివిధ దౌత్యయత్నాలు ఫలప్రదమయ్యాయి. భారత ప్రధానికీ, ఖతార్ అమీర్‌కూ మధ్య నిరుడు సాగిన సమావేశం ఫలించింది. మరణశిక్ష పడ్డ 8 మంది నౌకాదళ సీనియర్ సిబ్బందిని ఖతార్ ఎట్టకేలకు విడుదల చేసింది. వారిలో ఏడుగురు సోమ \వారం స్వదేశానికి చేరుకోగా, ఎనిమిదో వ్యక్తిని సైతం సాధ్యమైనంత త్వరగా భారత్ రప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఏణ్ణర్ధం పైగా అక్కడి జైలులో మగ్గుతూ, మరణదండనతో మృత్యుముఖం దాకా వెళ్ళి, చివరకు అన్ని అభియోగాల నుంచి విముక్తమై వారు తిరిగి రావడం అసాధారణం. ఇది భారత దౌత్య విజయం. బుధవారం ఖతార్‌లో భారత ప్రధాని మోదీ పర్యటించనున్న వేళ వెలువడ్డ ఈ ప్రకటన విశేషమైనది. అంతర్జాతీయంగా మన దేశానికి పెరుగుతున్న ప్రాముఖ్యానికీ, అరబ్ దేశాలతో మనం నెరపుతున్న స్నేహసంబంధాల సాఫల్యానికీ ఇది ఓ మచ్చుతునక. జరిగిన కథలోకి వెళితే, విడుదలైన ఈ 8 మంది భారత నౌకాదళ మాజీ సిబ్బంది ఇజ్రాయెల్ పక్షాన గూఢచర్యం చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు వినవచ్చాయి. అందులో నిజం లేదంటూ, వారిని విడుదల చేయాలని భారత్ ప్రయత్నిస్తూ వచ్చింది. గత ఏడాది కాలంగా భారత విదేశాంగ శాఖ అజెండాలో ఓ ప్రధానాంశం – ఈ నౌకాదళ మాజీ అధికారుల విడుదల. అందుకు తగ్గట్టే మంత్రిత్వ శాఖలో సంబంధిత విభాగం, అలాగే ఖతార్‌లోని భారత దౌత్య కార్యాలయం నిర్విరా మంగా శ్రమించాయి. ప్రచారానికి దూరంగా తమ పని తాము చేస్తూ, చివరకు ఆశించిన ఫలితాన్ని సాధించాయి. విదేశాంగ శాఖ గల్ఫ్ డివిజన్‌కు మునుపు సారథ్యం వహించిన విపుల్ గత ఏడాది ఖతార్‌కు వెళ్ళి, ఆ దేశంలో భారత రాయబారిగా బాధ్యతలు చేపట్టడం సైతం కలిసొచ్చింది. ఆయన సంబంధిత వర్గాలన్నిటితో మాట్లాడి, ఒప్పించగలిగారు. అదే సమయంలో, జాతీయ భద్రతా సల హాదారైన అజిత్ దోవల్ సారథ్యంలోని జాతీయ భద్రతా మండలి సచివాలయం సైతం ఖతార్ రాజ ధాని దోహాలోని తన సన్నిహితులతో మంతనాలు సాగించింది. ఓర్పుగా, నేర్పుగా వ్యవహారం నడి పిస్తూ, మన మాజీ అధికారులు విడుదలై, తిరిగివచ్చేవరకు కథను గుట్టుగా నడిపించడం విశేషం. అసలు ఈ వివాదం ఏణ్ణర్ధం క్రితం మొదలైంది. 2022 ఆగస్ట్ 30న ఈ 8 మందిని అరెస్ట్ చేసి, ఏకాంతవాస శిక్ష విధించారు. ఖైదీలుగా ఉన్న మనవాళ్ళను ఆ ఏడాది అక్టోబర్ మొదట్లోనే భారత దౌత్య సిబ్బంది కలిశారు. నిజానికి, అరెస్టయినవారిలో అధికులు దహ్రా గ్లోబల్ అనే ఓ ప్రైవేట్ సంస్థకు పనిచేస్తూ వచ్చారు. ఖతారీ నౌకాదళంలో ఇటాలియన్ యూ212 రహస్య జలాంతర్గాముల్ని ప్రవేశపెట్టడంలో సాయపడేందుకు వారు ఖతార్‌కు వచ్చారన్నది కథనం. జైల్లో పడ్డ తమ సిబ్బందికి సాయం చేసేందుకు సదరు ప్రైవేట్ సంస్థ సీఈఓ సైతం ప్రయత్నించక పోలేదు. కానీ, ఆయనా జైల్లో పడి, రెండు నెలలు ఒంటరి చెరను అనుభవించి, అనంతరం జామీను మీద బయటపడాల్సి వచ్చింది. గడచిన 2023 మార్చి వచ్చేసరికి మన అధికారులు పెట్టుకున్న పలు జామీను అభ్యర్థనలు సైతం తిరస్కరణకు గురయ్యాయి. ఆ నెలాఖరున వారిపై ఖతార్ చట్టప్రకారం విచారణ మొదలైంది. చిత్రమేమంటే ఈ అధికారుల్లో ఒకరైన కెప్టెన్ నవ్‌తేజ్ గిల్ లాంటి వారు భారత నేవల్ అకాడెమీ నుంచి పట్టభద్రులైనప్పుడు తమ ప్రతిభా ప్రదర్శనకు ఏకంగా రాష్ట్రపతి స్వర్ణపతకం అందుకున్నారు. ప్రతిష్ఠాత్మక డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్‌లో బోధకుడిగా పనిచేశారు. మొదట్లో గత అక్టోబర్‌లో ఈ నౌకాదళ మాజీ అధికారులందరికీ మరణ దండన విధించారు. ఆపైన మన దౌత్య యత్నాలు, భారత ప్రభుత్వ జోక్యం కారణంగా దాన్ని నిరవధిక జైలు శిక్షగా మార్చారు. బందీలుగా ఉన్న అధికారుల క్షేమం కోసం మన దేశం ఖతార్ అమీర్ కార్యాలయంతో సంప్రతింపులు సాగిస్తూ వచ్చింది. గత ఏడాది దుబాయ్‌లో ‘కాప్–28’ సదస్సు వేళ భారత ప్రధాని మోదీ, ఖతార్ అమీర్‌ను ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఇరు ప్రభుత్వాధినేతల స్నేహబంధం చివరకు పరిష్కారం చూపింది. మరోపక్క వీరు పనిచేసిన దహ్రా గ్లోబల్ సంస్థ నిరుడు మేలోనే దోహాలో తన కార్యకలాపాలకు స్వస్తి చెప్పింది. ఆ సంస్థలో అత్యధికులు భారతీయులే. వారు అప్పుడే భారత్‌కు తిరిగొచ్చేశారు. లెక్కచూస్తే, ఒక్క ఖతార్‌లోనే 8 లక్షల మంది భారతీయులు, 6 వేల భారతీయ కంపెనీలున్నాయి. రెండేళ్ళ క్రితమే ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 15.03 బిలియన్ డాలర్లుంది. ఇక, భారత్ చేసుకొనే ద్రవీభూత సహజవాయు (ఎల్ఎన్జీ) దిగుమతుల్లో 40 శాతం ఖతార్ నుంచే! వచ్చే 2048 దాకా ఆ దిగుమతుల కోసం 78 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని గత వారమే ఖతార్‌తో భారత్ కుదుర్చుకుంది. ఇవన్నీ ఇప్పుడు కలిసొచ్చాయి. మొత్తం పశ్చిమాసియా సంగతికొస్తే 90 లక్షల మంది భారతీయులున్నారు. కొన్నేళ్ళుగా పశ్చి మాసియాలో, ప్రధానంగా సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్, కువైట్, ఖతార్‌ల వైపు భారత్ నిరంతరం స్నేహహస్తం చాస్తోంది. తాజా దౌత్య పరిష్కారం మన ఆ స్నేహానికి ఫలితం. పెరుగుతున్న భారత ప్రాబల్యానికి నిదర్శనం. ఈ ప్రాంత దేశాలన్నీ ఇంధన సరఫరాలో భారత్‌కు చిరకాలంగా సన్నిహితమైనా, విదేశాంగ విధానంలో పాకిస్తాన్ వైపు మొగ్గేవి. కొన్ని దశాబ్దాలుగా పాక్ అదృష్టం తలకిందులవడంతో, ఆర్థిక, భద్రతా అంశాల రీత్యా ఈ ప్రాంతంలో భారత్‌తో బలమైన సంబంధాలు అవసరమనే ఎరుక వాటికి కలిగింది. వ్యూహాత్మకంగా కీలకమైన ఈ ప్రాంతంలో సమష్టి దౌత్య, భద్రతా లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని, భారత్‌ను అవి ఇప్పుడు విశ్వసనీయ మిత్రదేశంగా భావిస్తున్నాయి. నౌకాదళ అధికారుల విడుదలకు అదీ ఓ కారణమే. ఏమైనా ఇదే అదనుగా పశ్చిమా సియా దేశాలతో భారత్ దోస్తీ బలపడితే, మరిన్ని దౌత్య, వ్యూహాత్మక ప్రయోజనాలు తథ్యం. -
ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన సుగుణాకర్ కుటుంబం
-
ఖతార్‌లో 8 మంది భారతీయులకు మరణ శిక్ష రద్దు
న్యూఢిల్లీ: ఖతార్‌లో గూఢచర్యం ఆరోపణలపై మరణ శిక్ష పడిన 8 మంది భారత నావికాదళం మాజీ అధికారులకు భారీ ఊరట లభించింది. వారికి విధించిన మరణ శిక్షను ఖతార్ అప్పిలేట్ కోర్టు రద్దు చేసింది. ఈ శిక్షను కేవలం జైలు శిక్షగా మారుస్తూ గురువారం కీలక తీర్పు వెలువరించింది. అయితే, వారు ఎంతకాలం జైలులో శిక్ష అనుభవించాలన్నది తెలియరాలేదు. దీనిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అల్–దాహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ కేసులో ఖతార్ కోర్టు 8 మందికి శిక్షను తగ్గించినట్లు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. గూఢచర్యం కేసులో 8 మంది నేవీ మాజీ అధికారులు 2022 ఆగస్టులో ఖతార్‌లో అరెస్టయ్యారు. అప్పిలేట్ కోర్టు తాజా తీర్పును భారత దౌత్య విజయంగా నిపుణులు అభివరి్ణస్తున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాప్–28 సదస్సు సందర్భంగా ఇటీవల దుబాయ్‌లో ఖతార్ పాలకుడు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్–థానీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఖతార్‌లో 8 మంది భారతీయులకు విధించిన మరణ శిక్ష గురించి ఈ భేటీలో మోదీ ప్రస్తావించినట్లు సమాచారం. శిక్ష నుంచి వారికి విముక్తి కలి్పంచాలంటూ మోదీ చేసిన విజ్ఞప్తి పట్ల ఖతార్ పాలకులు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఖతార్‌లో నివసిస్తున్న భారతీయుల సంక్షేమంపై అల్–థానీతో చర్చించినట్లు ఈ భేటీ తర్వాత మోదీ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే మరణ శిక్షను రద్దు చేసి, జైలు శిక్షగా కుదిస్తూ ఖతార్ కోర్టు తీర్పు ప్రకటించింది. బాధితులకు అండగా ఉంటాం ఖతార్ కోర్టు తాజా తీర్పునకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఎదురు చూస్తున్నామని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. తదుపరి చర్యల విషయంలో న్యాయ నిపుణులతో, బాధితుల కుటుంబ సభ్యులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని వెల్లడించింది. కోర్టులో గురువారం జరిగిన విచారణకు ఖతార్‌లోని భారత రాయబారి, ఇతర అధికారులు, బాధితుల కుటుంబ సభ్యులు కొందరు హాజరయ్యారని తెలియజేసింది. బాధితులకు అండగా ఉంటామని, అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టంచేసింది. ఏమిటీ కేసు? 8 మంది భారత మాజీ అధికారులు ఖతార్ రాజధాని దోహాకు చెందిన అల్–దాహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అనే ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నారు. ఈ సంస్థ ఖతార్ సైనిక దళాలకు, సెక్యూరిటీ ఏజెన్సీలకు శిక్షణ ఇస్తోంది. ఇతర సేవలు అందిస్తోంది. అల్–దాహ్రా సంస్థలో పని చేస్తున్న 8 మంది భారతీయులను గత ఏడాది ఆగస్టులో ఖతార్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తమ దేశ రహస్యాలను చోరీ చేస్తున్నట్లు వారిపై అభియోగాలు మోపారు. ఇతర దేశాలకు సమాచారం చేరవేస్తూ గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు ఆరోపించారు. అయితే, ఈ అభియోగాలను బహిరంగపర్చలేదు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఖతార్ కోర్టు 8 మందికి మరణ శిక్ష విధిస్తూ తీర్పునిచి్చంది. దీంతో భారత ప్రభుత్వం న్యాయ పోరాటం ప్రారంభించింది. శిక్షను వ్యతిరేకిస్తూ ఖతార్‌లోని కోర్టు ఆఫ్ అప్పీల్‌ను ఆశ్రయించింది. ఖతార్‌లో శిక్ష పడిన వారిలో నవతేజ్ గిల్, సౌరభ్ వశి‹Ù్ట, పూర్ణేందు తివారీ, అమిత్ నాగ్‌పాల్, ఎస్.కె.గుప్తా, బి.కె.వర్మ, సుగుణాకర్ పాకాల, సైలర్ రాగేశ్ ఉన్నారు. వీరిలో సుగుణాకర్ పాకాల ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందినవారు. -
ఖతార్‌లో ఉరిశిక్ష పడిన భారత నేవీ మాజీ అధికారులకు ఊరట..
ఖతార్‌లో ఉరిశిక్ష పడిన భారత నావికాదళానికి చెందిన మాజీ అధికారులకు ఊరట లభించింది. ఖతార్‌లో నిర్బంధంలో ఉన్న ఎనిమిది మందికి విధించిన మరణ శిక్షను ఖతార్ కోర్టు తగ్గించింది. దీనిని జైలు శిక్షగా మారుస్తున్నట్లు తీర్పునిచ్చింది. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) గురువారం ఈ విషయాన్ని తెలిపింది. అయితే ఖతార్ కోర్టు ఇచ్చిన తీర్పు పూర్తి వివరాలు బయటకు రాకపోవడంతో.. శిక్షను ఎంత తగ్గించారన్న విషయంపై కూడా స్పష్టత లేదు. తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునేందుకు న్యాయ బృందంతోపాటు బాధిత కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్రం పేర్కొంది. తాము మొదటి నుంచి భారతీయ మాజీ నేవీ అధికారులకు అండగా ఉన్నామని, రాయబార సంప్రదింపులతోపాటు చట్టపరమైన సహాయాన్ని కొనసాగిస్తామని వెల్లడించింది. దీనిపై ఖతార్ అధికారులతోనూ చర్చిస్తున్నట్లు తెలిపింది. చదవండి: నిజ్జర్ హత్య కేసులో ఇద్దరి అరెస్టుకు రంగం సిద్ధం?! కాగా భారత నావికాదళానికి చెందిన ఎనిమది మంది మాజీ అధికారులకు గూఢచర్యం కేసు మరణశిక్ష విధిస్తూ ఇటీవల ఖతార్ కోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, సంబంధిత సేవలను అందించే ప్రైవేటు భద్రతా సంస్థ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో పనిచేసిన భారత నావికాదళ మాజీ అధికారులు కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్, కమాండర్ అమిత్ నాగ్‌పాల్, కమాండర్ తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, సెయిలర్ రాగేశ్‌లపై ఇజ్రాయెల్ కోసం గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. వీరంతా ఇజ్రాయెల్ తరపున ఓ సబ్‌మెరైన్ ప్రోగ్రాం కోసం గూఢచర్యానికి పాల్పడ్డారని వీరిపై అభియోగాలపై సదరు అధికారులను ఖతార్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ 2022 ఆగస్టు 30న అదుపులోకి తీసుకుంది.ఈ ఏడాది అక్టోబర్‌లో వారికి మరణశిక్ష విధించింది. దీనిపై ఇటీవల కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. ఖతార్ కోర్టు తీర్పుతో దిగ్భ్రాంతికి గురయ్యాయమని తెలిపింది. ఈ సమస్యను ఖతార్ అధికారులతో తేల్చుకుంటామని తెలిపింది. బాధిత కుటుంబ సభ్యులు, న్యాయ బృందంతో సమన్వయం చేసుకుంటున్నామని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారత మాజీ నేవీ అధికారులకు విధించిన మరణ శిక్ష అపీల్‌పై ఖతార్ కోర్టు విచారణ జరిపి.. మరణ శిక్షను తగ్గించి జైలు శిక్షగా మార్పు చేసింది. -
నేవీ నారీ శక్తి ఘనత
న్యూఢిల్లీ: పూర్తిగా మహిళా అధికారులతో కూడిన నావికాదళ బృందం ఉత్తర అరేబియా సముద్రంపై నిఘా మిషన్‌ను సొంతంగా నిర్వహించిన అరుదైన ఘనత సాధించింది. పోర్బందర్లోని ‘ఐఎన్ఏఎస్ 314’కు చెందిన మహిళా అధికారుల ఫ్రంట్‌లైన్ నేవల్ ఎయిర్ స్క్వాడ్రన్ బుధవారం ఈ చరిత్ర సృష్టించిందని నేవీ తెలిపింది. లెఫ్టినెంట్ కమాండర్ ఆంచల్ శర్మ సారథ్యంలోని ఈ బృందంలో పైలెట్లు లెఫ్టినెంట్ శివాంగి, లెఫ్టినెంట్ అపూర్వ గీతె, టాక్టికల్, సెన్సార్ ఆఫీసర్లు లెఫ్టినెంట్ పూజా పాండా, సబ్ లెఫ్టినెంట్ పూజా షెకావత్ ఉన్నారని వెల్లడించింది. వీరంతా అత్యాధునిక డోర్నియర్ విమానం ద్వారా నిఘా విధులు నిర్వర్తించారని నేవీ ప్రతినిధి కమాండర్ వివేక్ మధ్వాల్ తెలిపారు. వీరు చేపట్టిన మొట్టమొదటి మిలిటరీ ఫ్లయింగ్ మిషన్ ప్రత్యేకమైందని, వైమానిక దళంలోని మహిళా అధికారులు మరిన్ని బాధ్యతలను స్వీకరించడానికి, మరిన్ని సవాళ్లతో కూడిన విధులను చేపట్టేందుకు మార్గం సుగమం చేస్తుందని కమాండర్ మధ్వాల్ అన్నారు. ‘ఈæ మిషన్ సాయుధ దళాలు సాధించిన ఒక ప్రత్యేక విజయానికి సూచిక’అని ఆయన అన్నారు. ఈ మిషన్ నారీ శక్తిలో నిజమైన స్ఫూర్తిని నింపుతుందని ఆయన పేర్కొన్నారు. -
బీఈ/బీటెక్ 60 శాతం మార్కులతో పాసయ్యారా? ఈ జాబ్‌కు అప్లై చేశారా?
ఇండియన్ నేవీలో 155 ఎస్ఎస్సీ ఆఫీసర్ పోస్టులు ఇండియన్ నేవీ 2023 జనవరి(ఎస్టీ 23) కోర్సు.. వివిధ విభాగాల్లో షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ల భర్తీకి అవివాహితులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం పోస్టుల సంఖ్య: 155 » బ్రాంచ్‌ల వారీగా ఖాళీలు: ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్–93, ఎడ్యుకేషన్ బ్రాంచ్ (ఎడ్యుకేషన్)–17, టెక్నికల్ బ్రాంచ్–45. » ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్: విభాగాలు:జనరల్ సర్వీస్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, అబ్జర్వర్, పైలట్, లాజిస్టిక్స్. అర్హత: కనీసం 60శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత టెక్నికల్ నైపుణ్యాలు ఉండాలి. » ఎడ్యుకేషన్ బ్రాంచ్(ఎడ్యుకేషన్): అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎంఏ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి. » టెక్నికల్ బ్రాంచ్: విభాగాలు: ఇంజనీరింగ్ బ్రాంచ్(జనరల్ సర్వీస్), ఎలక్ట్రికల్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్). అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. » వయసు: 02.01.1998 నుంచి 01.07.2003 మధ్య జన్మించి ఉండాలి. » ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూలు, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. » దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. » ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 12.03.2022 » వెబ్సైట్: joinindiannavy.gov.in -
నేవీ డే వేడుకలకు రండి
సాక్షి, అమరావతి: డిసెంబర్ 4వ తేదీన విశాఖలో జరిగే నావికా దినోత్సవంలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను తూర్పు నౌకాదళం ఆహ్వానించింది. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం నివాసంలో తూర్పు నౌకా దళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ ఇతర నౌకాదళ అధికారులతో పాటు సీఎంను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డిసెంబర్ 4న జరిగే నేవీ డే వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. తూర్పు నౌకాదళం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను సీఎంకు వివరించారు. ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేరుతో ముంబయిలో నిర్మిస్తున్న యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ విశాఖపట్నం’ను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. వచ్చే ఫిబ్రవరిలో జరిగే పీఎఫ్ఆర్ అండ్ మిలన్ 2022 నిర్వహణకు సంబంధించిన సన్నాహాల పురోగతి గురించి వివరించారు. ఈ సందర్భంగా ఈఎన్సీ ఫ్లాగ్ ఆఫీసర్ అజేంద్ర బహదూర్ సింగ్‌ను ముఖ్యమంత్రి.. వేంకటేశ్వరస్వామి ప్రతిమ అందజేసి సత్కరించారు. సీఎంను కలిసిన వారిలో కెప్టెన్ వీఎస్సీ రావు, కెప్టెన్ వికాస్ గుప్తా, సివిల్ మిలటరీ లైజన్ ఆఫీసర్ కమాండర్ సుజిత్ రెడ్డి, ఫ్లాగ్ లెఫ్టినెంట్ శివమ్ కందారి ఉన్నారు. చదవండి: (నెల్లూరు జిల్లాలో టీడీపీకి భారీ షాక్..) -
విదేశీ నౌకలకు ఘనంగా వీడ్కోలు
♦ రెండు బృందాలుగా అంతర్జాతీయ జలాలకు‘సెయిల్ ఇన్ కంపెనీ’కి ఫ్లాగ్ ఆఫ్ చేసిన వైస్ అడ్మిరల్ సతీష్ సోనీ ♦ భారత నేవీ హెడ్ క్వార్టర్‌గా విశాఖ ఎదగాలని ఆకాంక్ష ♦ ముగిసిన ‘ఐఎఫ్ఆర్’ వేడుకలు సాక్షి, విశాఖపట్నం: ‘యునెటైడ్ త్రూ ఓషన్స్’ అంటూ ప్రపంచ దేశాల నావికా లోకం ఖండాంతరాలు దాటి విశాఖ తీరానికి చేరింది. నీటిలో, నింగిలో, నేలపై భారత నేవీతో కలిసి సందడి చేసింది. ఐఎఫ్ఆర్ విలేజ్, మారిటైమ్ ఎగ్జిబిషన్లో మన సంస్కృతి, శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని కళ్లారా చూసింది. మధుర స్మృతులను నెమరువేసుకుంటూ స్వదేశానికి పయనమైంది. అంతర్జాతీయ నేవీ సహచరులకు భారత నేవీ అధికారులు మంగళవారం సముద్రంలో అంతర్జాతీయ సరిహద్దు వరకూ తోడ్కొని వెళ్లి వీడ్కోలు ఇచ్చారు. రెండు బృందాలుగా.. ఐఎఫ్ఆర్-2016లో పాల్గొన్న 20 భారత, 14 విదేశీ నౌకలకు మంగళవారం వీడ్కోలు పలికారు. వాటిని రెండు బృందాలుగా విడదీసి సాగనంపారు. మొదటి బృందానికి రియర్ అడ్మిరల్ రణ్వీర్ సింగ్ నేతృత్వంలో ఐఎన్ఎస్ విక్రమాదిత్య, రెండో బృందానికి రియర్ అడ్మిరల్ ఎస్వి భోకరే నేతృత్వంలోని ఐఎన్ఎస్ విరాట్ వీడ్కోలు పలికాయి. ఈ సందర్భంగా పాసెక్స్, ఎయిర్ క్రాఫ్ట్ విన్యాసాలు నిర్వహించారు. మరోవైపు ‘సెయిల్ ఇన్ కంపెనీ’ కార్యక్రమాన్ని ఐఎన్ఎస్ సుమిత్ర నుంచి తూర్పు నౌకాదళం చీఫ్ వైస్ అడ్మిరల్ సతీష్ సోనీ నిర్వహించారు. భారత నైకాదళానికి చెందిన మూడు నౌకలు ఎన్ఎన్ఎస్ తరంగిణి, సుదర్శిని, మదేయిలను విశాఖ నుంచి కోచికి జెండా ఊపి సాగనంపారు. అంతర్జాతీయ సంబంధాలు బలపడ్డాయి ఐఎఫ్ఆర్కు వివిధ దేశాల నేవీ అధికారులు, సిబ్బంది భారత్‌కు రావడంతో అంతర్జాతీయ నేవీ సంబంధాలు మెరుగుపడ్డాయని తూర్పు నౌకాదళం చీఫ్ వైస్ అడ్మిరల్ సతీష్ సోనీ అన్నారు. మంగళవారం ‘సెయిల్ ఇన్ కంపెనీ’ ఫ్లాగ్ ఆఫ్ అనంతరం ఆయన ఐఎన్ఎస్ సుమిత్ర నౌకలో విలేకరులతో మాట్లాడారు. ఐఎఫ్ఆర్-2016 విజయవంతంగా ముగిసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. అత్యంత క్లిష్టమనుకున్న ఆపరేషనల్ డెమో, ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్‌లను ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించడానికి జిల్లా అధికార యంత్రాంగం అందించిన సహకారం మరువలేనిదన్నారు. రక్షణ మంత్రి చెప్పినట్లుగా భారత నేవీ హెడ్ క్వార్టర్‌గా విశాఖ ఎదగాలని తాను కూడా కోరుకుంటున్నానని సోనీ చెప్పారు. భారత్‌లోనే అత్యంత అందమైన నగరం విశాఖ అని అభివర్ణించారు. ఐఎన్ఎస్ విరాట్‌ను ఈ ఏడాది డీ కమిషన్ చేస్తామని, విక్రాంత్‌ను 2018లో డీకమిషన్ చేయాలనుకుంటున్నామని ఆయన వెల్లడించారు. విరాట్‌ను విశాఖకు ఇస్తే సంతోషమన్నారు.