సాక్షి, అమరావతి: డిసెంబర్ 4వ తేదీన విశాఖలో జరిగే నావికా దినోత్సవంలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను తూర్పు నౌకాదళం ఆహ్వానించింది. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం నివాసంలో తూర్పు నౌకా దళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ ఇతర నౌకాదళ అధికారులతో పాటు సీఎంను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డిసెంబర్ 4న జరిగే నేవీ డే వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. తూర్పు నౌకాదళం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను సీఎంకు వివరించారు.
ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేరుతో ముంబయిలో నిర్మిస్తున్న యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్ విశాఖపట్నం’ను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. వచ్చే ఫిబ్రవరిలో జరిగే పీఎఫ్‌ఆర్ అండ్ మిలన్ 2022 నిర్వహణకు సంబంధించిన సన్నాహాల పురోగతి గురించి వివరించారు. ఈ సందర్భంగా ఈఎన్‌సీ ఫ్లాగ్ ఆఫీసర్ అజేంద్ర బహదూర్ సింగ్‌ను ముఖ్యమంత్రి.. వేంకటేశ్వరస్వామి ప్రతిమ అందజేసి సత్కరించారు. సీఎంను కలిసిన వారిలో కెప్టెన్ వీఎస్‌సీ రావు, కెప్టెన్ వికాస్ గుప్తా, సివిల్ మిలటరీ లైజన్ ఆఫీసర్ కమాండర్ సుజిత్ రెడ్డి, ఫ్లాగ్ లెఫ్టినెంట్ శివమ్ కందారి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment