ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజ్యమేలుతున్న తరుణంలో చాలా కంపెనీలు ఈ టెక్నాలజీని విరివిగా ఉపయోగించుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఏఐను ఉద్యోగాలలో ఉపయోగించుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఉద్యోగులను ఎంపిక చేసే విషయంలో కూడా వినియోగించుకోవడం మొదలుపెట్టారు.
సాధారణంగా ఏదైనా సంస్థలో ఉద్యోగం కావాలంటే రెస్యూమ్స్ పంపిస్తారు. వీటిని ఆ కంపెనీ రిక్రూట్‌మెంట్ పరిశీలించి, అర్హత ఉన్నవారిని ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఆ తరువాత ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఇది అసలైన ప్రక్రియ. కానీ ఏఐ వాడకంలోకి వచ్చిన తరువాత ఇంటర్వ్యూల విషయంలో కూడా టెక్నాలజీని వాడేస్తున్నారు.
GenAI బాట్‌లు మేనేజర్‌లకు ఇంటర్వ్యూలు నిర్వహించడంలో సహాయపడుతున్నాయి. సరైన క్వాలిఫికేషన్స్ ఉన్న వారిని ఎంపిక చేయడంలో ఏఐ చాలా అద్భుతంగా ఉపయోగపడుతోంది హెచ్ఆర్ అధికారులు చెబుతున్నారు. దీంతో ఉద్యోగుల ఎంపిక కూడా చాలా వేగంగా జరుగుతుందని పేర్కొంటున్నారు.
కొత్త నియామకాలలో దాదాపు 40 శాతం అభ్యర్థులను ఏఐ ద్వారానే ఎంచుకున్నట్లు, దీంతో ఇంటర్వ్యూలు చాలా వేగంగా జరుగుతున్నాయని జెన్‌ఫ్యాక్ట్ గ్లోబల్ హైరింగ్ లీడర్ రీతు భాటియా పేర్కొన్నారు. ఒకేసారి నియమాలకు చేపట్టడానికి 63 రోజులు పట్టేది, అయితే ఏఐ సాయం వల్ల ఇది 43 రోజుల్లోనే ముగిసిందని కూడా భాటియా పేర్కొన్నారు.
రిక్రూట్‌మెంట్ సర్వీసెస్ ప్రొవైడర్ పీపుల్‌ఫై చీఫ్ ఎగ్జిక్యూటివ్ 'రాజేష్ భారతీయ' ప్రకారం.. జెన్ఏఐ ఉద్యోగులను ఇంటర్వ్యూలు చేసే సమయంలో చాలా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. మాన్యువల్‌గా రెస్యూమ్ పరిశీలన చేపడితే ఎక్కువ సమయం పడుతుంది. ఆ పనిని ఏఐ చాలా వేగంగా చేస్తుంది. తద్వారా ఇంటర్వ్యూ చాలా వేగంగా ముగుస్తుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment