![CM KCR Likely To Announce Jobs Recruitment And Job Calendar Assembly - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/9/kcr_0.jpg.webp?itok=tQfxI4hB)
సాక్షి, హైదారబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్ర బడ్జెట్ 2022-2023 రెండోరోజు సమావేశాల్లో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేయనున్నారు. జాబ్ క్యాలెండర్‌ను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేస్తానని సీఎం కేసీఆర్ మంగళవారం వనపర్తి జిల్లా పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పేర్కొన్న విషయం తెలిసిందే.
వేతన సవరణ సంఘం నివేదిక ప్రకారం 1,92,800 ఉద్యోగాల ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గడిచిన మూడేళ్ల కాలంలో ఎలాంటి నోటిఫికేషన్లు జారీ కాలేదు. కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం పోస్టుల పునర్విభజన పూర్తైన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 85 వేల వరకు ఖాళీలను గుర్తించినట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment