
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సోమవారం భేటీ అయింది. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సబ్ కమిటీ భేటీలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వర రావు హాజరయ్యారు. రైతులకు ఇచ్చే రూ. 8 వేల సాయంపై ఈ భేటీలో చర్చించారు.
ఈ నేపధ్యంలో పోచారం మాట్లాడుతూ మే 15 నుంచి డబ్బులు చెల్లిస్తామని తెలిపారు. దేశం మొత్తం తెలంగాణ వైపే చూస్తోందన్నారు. రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ వర్షాకాలం నుంచి వ్యవసాయానికి పెట్టుబడి మద్దతు పథకాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో పథకం అమలు కోసం మంత్రి పోచారం అధ్యక్షతన కేబినెట్ సబ్‌కమిటీని వేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment