
సభలో మాట్లాడుతున్న వ్యవసాయశాఖ మంత్రి పోచారం
అంతర్జాతీయ నేలల దినోత్సవంలో మంత్రి పోచారం
సాక్షి, హైదరాబాద్: ‘రైతులు చేసినంత చాకిరీ మరెవరూ చేయట్లేదు. రోజంతా కష్టపడినా వారికి ప్రతిఫలం దక్కడం లేదు. ఆర్థికంగా చితికిపోతుండడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీరిలో అధికంగా వర్షాలపై ఆధారపడి సాగు చేసుకునే రైతులే ఉన్నారు’అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. సోమవారం ఇక్కడ జరిగిన అంతర్జాతీయ నేలల(సారుుల్) దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘నేలల స్వభావం, పంటలు వేయాల్సిన విధానాలపై రైతులకు మరింత అవగాహన రావాలి.
భూసార పరీక్షలు శాస్త్రీ యంగా నిర్వహిం చడం లేదు. ఒక ప్రాంతం లో పదిమంది రైతుల పొలాల నుంచి మట్టి నమూనాలు సేకరించి, వాటిని ఒకచోట మిశ్రమం చేస్తారు. అలా వచ్చిన ఫలితాల్ని రైతులకు ఇచ్చి పంటలు వేసుకోమని చెబుతారు. ఆస్పత్రిలో పది మందికి రక్త పరీక్షలు చేయాల్సి వస్తే... వారి నుంచి సేకరించిన రక్తాన్ని ఒక చోట కలిపి పరీక్ష నిర్వహించలేం కదా.’అంటూ భూసార పరీక్షల తీరును తప్పుబట్టారు. త్వరలో ప్రతి రైతు పొలానికి విడిగా భూసార పరీక్షలు చేస్తామని, రైతు సూచించిన చోటే మట్టి నమూనాలు సేకరిం చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
దిగుబడిలో వ్యత్యాసం ఎందుకు?
‘మన దేశంలో రైతులకు శాస్త్రీయ సాగుపై అవగాహన లేదు.ఇటీవల అమెరికా వెళ్లినప్పుడు అక్కడ రైతులతో మాట్లాడా... ఒక్కో రైతుకు కనిష్టంగా వెరుు్య ఏకరాల భూమి ఉంది. వారంతా పూర్తిగా శాస్త్రీయ పద్ధతులతో సాగు చేస్తున్నారు. అక్కడ ఒక హెక్టారుకు 83.45 క్వింటాళ్ల మొక్కజొన్న దిగుబడి వస్తే... ఇక్కడ మాత్రం సగటున 14 క్విం టాళ్లు మాత్రమే వస్తుంది. ఇంత వ్యత్యాసం ఎందుకు? ఈ అంశంపై శాస్త్రవేత్తలు, అధికారులు దృష్టి సారించాలి. దిగుబడిని పెంచి తేనే రైతు ఆర్థికంగా బలపడతాడు. దీంతో ఆత్మహత్యలు తగ్గుతారుు’అని పోచారం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయనుందన్నారు. అనంతరం వ్యవసాయ శాఖ కమిషనర్ ఎం.జగన్మోహన్ మాట్లాడుతూ సేంద్రియ ఎరువుల వాడకంపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు.