
సాక్షి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలోలో విత్తనాలు, ఎరువులు, కరెంట్ కొరత లేదని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే కోటి ఎకరాలకు రెండు పంటలకు నీళ్లు ఇస్తామన్నారు. రైతు సంక్షేమంలో తెలంగాణ దేశానికి ఆదర్శం, దిక్చూచి అని తెలిపారు.
ఆగష్టు 15 నుంచి రైతు బంధు జీవిత భీమా పథకం అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ పథకం కింద 50 లక్షల మందికి ప్రభుత్వం 1100 కోట్ల ప్రీమియం చెల్లిస్తుందన్నారు. ఈ నెలాఖరులోగా రైతులకు ఇచ్చిన ఫారమ్‌లో నామిని పేరు రాసి వ్యవసాయ శాఖ అధికారులకు ఇవ్వాలని సూచించారు. కొందరు వాస్తవాలను గ్రహించకుండా రాజకీయ దుర్భుద్ధితో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment