సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్ర నిరాశ ఎదురైంది. ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి రాకపోవడంతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. దీంతో సీఎంతో పాటు మంత్రులు సచివాలయం నుంచి వెనుదిరిగి వెళ్లారు.
శనివారం మధ్యాహ్నం కేబినేట్ సమావేశం నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది. అయితే ఒక వైపు లోక్‌సభ ఎన్నికల కోడ్, మరో వైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో కేబినెట్ సమావేశానికి అనుమతించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఈసీని కోరింది. తెలంగాణ ప్రభుత్వ వినతిని సీఈవో వికాస్ రాజ్ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు.
ఈసీ నుంచి ఏ క్షణమైన అనుమతి వస్తుందని మంత్రులు అందరూ శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సచివాలయంలోనే వేచి ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అన్ని విభాగాల అధికారులు కేబినేట్ భేటీకి హాజరయ్యేందుకు ఆఫీసులకు చేరుకున్నారు. అయితే రాత్రి 7 గంటల వరకు ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాలేదు. ఈసీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఇవాళ సాయంత్రం జరగాల్సిన కేబినెట్ భేటీ నిలిచిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment