- పండ్లు, పూల తోటలు 10 లక్షల ఎకరాలపైగా సాగు పెంచాలి
- దుమ్ముగూడెం ప్రాజెక్ట్ రీడిజైన్‌కు.. శ్రీరామ సాగునీటి పథకంగా నామకరణం
- తెలంగాణ కేబినెట్, హార్టీ కల్చరల్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం
- తెలంగాణ ఉద్యోగులకు 3.14 శాతం డీఏ పెంపునకు నిర్ణయం
- వివిధ శాఖల్లో కొత్త పోస్టుల నియామకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: తెలంగాణ హార్టికల్చర్ కార్పొరేషన్(ఉద్యానవన శాఖ) ఏర్పాటుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. పండ్లు, పూల తోటలు, 10 లక్షల ఎకరాలపైగా పెంచాలని నిర్ణయించింది. ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో పలు అంశాలపై తెలంగాణ కేబినెట్ చర్చించింది. దుమ్ముగూడెం ప్రాజెక్ట్ రీడిజైన్‌కు ఆమోదం తెలిపిన కేబినెట్.. శ్రీరామ సాగునీటి పథకంగా నామకరణం చేసింది.
సినీ పరిశ్రమల సమస్యల పరిష్కారానికి మంత్రి తలసాని యాదవ్ నేతృత్వంలో ఉపసంఘం ఏర్పాటుకు తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. తెలంగాణ ఉద్యోగులకు 3.14 శాతం డీఏ పెంపునకు నిర్ణయం తీసుకుంది. వివిధ శాఖల్లో కొత్త పోస్టుల నియామకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వేతనాల పెంపుపై కేబినెట్ నిర్ణయాన్ని వెల్లడించింది.
ఇక శ్రీరామ సాగునీటి పథకం..
Published Sun, Feb 7 2016 6:44 PM | Last Updated on Sun, Sep 3 2017 5:08 PM
Advertisement