dummugudem project
-
దుమ్ముగూడెం టెండర్లలో భారీ కుంభకోణం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం, దుమ్ముగూడెం ప్రాజెక్టుల నిర్మాణ టెండర్లలో భారీ కుంభకోణం జరిగిం దని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఇటీవల పిలిచిన రూ.50 వేల కోట్ల టెండర్లకు గాను సీఎం కేసీఆర్, ఆయన బంధువులు 8 శాతం కమీషన్ తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ టెండర్లను రద్దు చేసి మళ్లీ ప్రపంచ స్థాయి టెండర్లను పిలవాలని డిమాండ్ చేశారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ సీనియర్ నాయకులతో ఆయన మాట్లాడారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస్ కృష్ణన్, ఎంపీ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీ ఎమ్మెల్యే లు పలువురు డీసీసీ అధ్యక్షులు, ముఖ్య నేతలు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఉత్తమ్ మాట్లాడుతూ.. ప్రపంచం మొత్తం కరోనా వైరస్ మీద పోరాడటంలో బిజీగా ఉంటే, కేసీఆర్, ఆయన బంధువులు మాత్రం నీటి పారుదల ప్రాజెక్టుల్లో కమీషన్లు తీసుకునే బిజీలో ఉన్నారని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో న్యాయం కోసం అన్ని చట్టపరమైన ఫోరమ్‌లను ఆశ్రయిస్తామని, ఏపీ సీఎం జగన్‌తో కేసీఆర్కున్న సంబంధాన్ని బహిర్గతం చేస్తామన్నారు. పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా బుధవారం దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి రంగారెడ్డి, పాలమూరు, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలోని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనున్నట్టు ఉత్తమ్ వెల్లడించారు. -
రుణాలతోనే ‘సీతమ్మసాగర్’!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని సత్వరమే పూర్తి చేసేందుకు వీలుగా రుణాల సేకరణ చేస్తున్న ప్రభుత్వం కొత్తగా చేపడుతున్న సీతమ్మ సాగర్ దుమ్ముగూడెం ప్రాజెక్టుకు రుణ సేకరణ చేయాలని నిర్ణయించింది. ఆర్థిక మాంద్యం, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల జాప్యం, రాష్ట్ర నిధులన్నీ అభివృధ్ధి, సంక్షేమ కార్యక్రమాలకే సరిపోతున్న నేపథ్యంలో సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు రెండేళ్లలో పూర్తి చేసేలా రూ.3,400 కోట్ల రుణాలు సేకరించేందుకు కసరత్తులు ఆరంభించింది. 37 టీఎంసీల నిల్వ సామ ర్థ్యంతో పాటు, 320 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు సమృద్ధిగా నిధులను అందుబాటులో ఉంచేలా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) నుంచి రుణాలు తీసుకునే అవకాశాలను పరిశీలిస్తోంది. ఈ ఏడాది జూన్, జులై నుంచే గోదావరి నీటిని ఎత్తిపోసేలా మోటార్లను సిద్ధం చేస్తోంది. -
‘సీతమ్మ సాగర్’ ప్రాజెక్టుగా దుమ్ముగూడెం
సాక్షి, హైదరాబాద్ : గోదావరి నీటి నిల్వతో పాటు జల విద్యుదుత్పత్తికి ఉపయోగపడేలా దుమ్ముగూడెం వద్ద నిర్మించ తలపెట్టిన బ్యారేజీకి సీతమ్మసాగర్‌గా నామకరణం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.ఈ మేరకు సాగునీటి శాఖ అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. 37 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా బ్యారేజీ, 320 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసేలా ప్లాంటు నిర్మించాలని ఇది వరకే నిర్ణయం తీసుకోగా, దాని పేరుమార్చుతూ జీవోలు విడుదల చేయాలని ఇంజనీర్లకు సూచించారు. దుమ్ముగూడెం ఆనకట్టకు ఎగువన భద్రాచలం సీతమ్మ వారి పర్ణశాలకు దగ్గరగా బ్యారేజీ నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో దీని పేరును సీతమ్మ సాగర్‌గా పెట్టాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే గోదావరిపై చేపట్టిన తుపాకులగూడెం పేరుకు సమ్మక్క పేరు పెట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. వీటికి సంబంధించి రెండుమూడు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. -
ఉభయతారకంగా ‘దుమ్ముగూడెం’
సాక్షి, హైదరాబాద్ : జల విద్యుదుత్పత్తికి, గోదావరి నీటినిల్వకు ఉపయోగపడేలా దుమ్ముగూడెం వద్ద బ్యారేజీ నిర్మించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. దుమ్ముగూడెం వద్ద గోదావరిలో 150 రోజులపాటు పుష్కలమైన ప్రవాహం ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ 37 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా బ్యారేజీ, 320 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసేలా ప్లాంటు నిర్మించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మిడ్‌మానేరుకు మూడో టీఎంసీ నీటిని లిఫ్టు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ పనులకు సంబంధించి అంచనాలు రూపొందించి నెలాఖరులోగా టెండర్లు పిలవాలని ఆదేశించారు. రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులపై ప్రగతి భవన్లో ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. నదిలోనే నీళ్లు ఆగేలా.. తక్కువ భూసేకరణతో దుమ్ముగూడెం బ్యారేజీకి డిజైన్ చేయాలని సూచించారు. మల్లన్నసాగర్‌కు రెండో టీఎంసీ నీటిని తరలించే పనులకు, సీతారామ ప్రాజెక్టులో మిగిలిన పనులకూ టెండర్లు పిలవాలన్నారు. కంతనపల్లి బ్యారేజీ పనులను మార్చి చివరికి పూర్తి చేయాలని స్పష్టంచేశారు. మేజర్, మీడియం తేడాలొద్దు... కాళేశ్వరం ద్వారా మిడ్‌మానేరుకు 2 టీఎంసీల నీటిని పంపు చేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని లిఫ్టు చేయాలని సీఎం నిర్ణయించారు. మిడ్‌మానేరుకు 3 టీఎంసీలు లిఫ్ట్ చేసి, అక్కడి నుంచి మల్లన్నసాగర్‌కు 2 టీఎంసీలు లిఫ్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దుమ్ముగూడెం బ్యారేజీ, మిడ్‌మానేరుకు 3 టీఎంసీల నీటి లిఫ్టు పనులకు రూ.13,500 కోట్ల నుంచి రూ. 14,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. తదుపరి మంత్రివర్గ సమావేశంలో ఈ రెండు పనులకు ఆమోదం తీసుకోవాలని సీఎం నిర్ణయించారు. మేజర్, మీడియం, మైనర్ అనే తేడా లేకుండా రాష్ట్రంలో నీటి పారుదలశాఖ అంతా ఒకటే విభాగంగా పనిచేయాలని ఆదేశించారు. రాష్ట్రాన్ని ఆరేడు ఇరిగేషన్ జోన్లుగా విభజించుకోవాలని, ఒక్కో జోన్‌కు ఒక్కో ఈఎన్సీ ఇన్చార్జిగా వ్యవహరించి, తన పరిధిలోని నీటి పారుదల వ్యవహారాలన్నింటినీ పర్యవేక్షించాలని అన్నారు. నీటి పారుదలశాఖ ముఖ్య అధికారులంతా త్వరలో రాష్ట్ర స్థాయి వర్క్ షాపు నిర్వహించుకుని, తెలంగాణ సమగ్ర నీటి పారుదల విధానాన్ని ఖరారు చేయాలన్నారు. అవసరమైన నిధులు బడ్జెట్లోనే.. సాగునీటి వ్యవస్థను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన నిధులను బడ్జెట్లోనే కేటాయించనున్నట్లు సీఎం వెల్లడించారు. దుమ్ముగూడెం వద్ద జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించడానికి, కాళేశ్వరం నుంచి మూడు టీఎంసీలు ఎత్తిపోయడానికి అనుగుణంగా విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చేయా లని విద్యుత్ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. నీటి పారుదల విధానం, ఇన్వెంటరీ, నిర్వహణ వ్యూహం ఖరారైన తర్వాత రాష్ట్ర స్థాయి నీటి పారుదల సదస్సు నిర్వహించనున్నట్లు చెప్పారు. కృష్ణా నదిలో నీటి ప్రవాహం లేని సమయంలో నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీరందించే ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే నీటితో బస్వాపూర్ రిజర్వాయర్ నింపి, అక్కడి నుంచి షామీర్ పేట వాగు, మూసీ నది, ఆసిఫ్ నహర్‌కు నీటిని తరలించాలని.. ఉదయ సముద్రాన్ని బైపాస్ చేసి పానగల్ వాగులో కలపాలని నిర్ణయించారు. అక్కడి నుంచి నేరుగా నాగార్జున సాగర్ ఆన్లైన్ రిజర్వాయర్ అయిన పెద్దదేవులపల్లి రిజర్వాయర్‌కు నీటిని చేర్చాలని సూచించారు. ఈ పనులపై సంపూర్ణ అవగాహన వచ్చేందుకు నీటి పారుదల అధికారులు, రిటైర్డు ఇంజనీర్లు త్వరలోనే ఆ ప్రాంతాలను పరిశీలించాలన్నారు. గోదావరి బేసిన్లో మల్లన్న సాగర్ వద్ద, కృష్ణా బేసిన్లో పాలమూరు ఎత్తిపోతల పథకం వద్ద నీటి పారుదల శాఖ అధికారులు సమావేశాలు నిర్వహించుకోవడానికి అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. ఇదిలావుండగా దుమ్ముగూడెం వద్ద గోదావరిపై 320 మెగావాట్ల సామర్థ్యంతో జల విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలంగాణ జెన్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు ‘సాక్షి’కి తెలిపారు. కాగా, 37 టీఎంసీల నిల్వతో చేపడుతున్న దుమ్ముగూడెం బ్యారేజీ నిర్మాణానికి రూ. 4,500 కోట్లు ఖర్చు కాగలదని ప్రాథమికంగా అంచనా వేసినట్లు నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, జెన్కో–ట్రాన్స్‌కో చైర్మన్ దేవులపల్లి ప్రభాకర్‌రావు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, కార్యదర్శి స్మితా సబర్వాల్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఈఎన్సీలు, జెన్కో, ట్రాన్స్‌కో డైరెక్టర్లు, నీటి పారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి, రిటైర్డ్ ఇంజనీర్లు, ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే పాల్గొన్నారు. -
ఇక శ్రీరామ సాగునీటి పథకం..
- పండ్లు, పూల తోటలు 10 లక్షల ఎకరాలపైగా సాగు పెంచాలి - దుమ్ముగూడెం ప్రాజెక్ట్ రీడిజైన్‌కు.. శ్రీరామ సాగునీటి పథకంగా నామకరణం - తెలంగాణ కేబినెట్, హార్టీ కల్చరల్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం - తెలంగాణ ఉద్యోగులకు 3.14 శాతం డీఏ పెంపునకు నిర్ణయం - వివిధ శాఖల్లో కొత్త పోస్టుల నియామకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్: తెలంగాణ హార్టికల్చర్ కార్పొరేషన్(ఉద్యానవన శాఖ) ఏర్పాటుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. పండ్లు, పూల తోటలు, 10 లక్షల ఎకరాలపైగా పెంచాలని నిర్ణయించింది. ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో పలు అంశాలపై తెలంగాణ కేబినెట్ చర్చించింది. దుమ్ముగూడెం ప్రాజెక్ట్ రీడిజైన్‌కు ఆమోదం తెలిపిన కేబినెట్.. శ్రీరామ సాగునీటి పథకంగా నామకరణం చేసింది. సినీ పరిశ్రమల సమస్యల పరిష్కారానికి మంత్రి తలసాని యాదవ్ నేతృత్వంలో ఉపసంఘం ఏర్పాటుకు తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. తెలంగాణ ఉద్యోగులకు 3.14 శాతం డీఏ పెంపునకు నిర్ణయం తీసుకుంది. వివిధ శాఖల్లో కొత్త పోస్టుల నియామకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఔట్సోర్సింగ్ సిబ్బంది వేతనాల పెంపుపై కేబినెట్ నిర్ణయాన్ని వెల్లడించింది. -
దుమ్ముగూడెంపై నీలినీడలు..!
కొత్త ప్రాజెక్టుతో జిల్లా భూములకు నీరివ్వాలని యోచన నల్లగొండ జిల్లాలో కొంత ఆయకట్టును చేర్చాలని నిర్ణయం..? ప్రాథమికంగా డిజైన్ చేస్తున్న అధికార యంత్రాంగం అధికారికంగా ప్రకటించని ప్రభుత్వం సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లాకే పరిమితం చేయూలనుకున్న దుమ్ముగూడెం ప్రాజెక్టుపై నీలినీడలు అలముకున్నాయి. ఇటీవల సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనలో భాగంగా మణుగూరులో దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్‌ను రద్దు చేసి.. దుమ్ముగూడెం ప్రాజెక్టు ను జిల్లాకే పరిమితం చేశామని ప్రకటించారు. అయితే జిల్లాలో ఈ ప్రకటన చేసి నెలరోజుల కావస్తున్నా.. ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుపై అధికారిక నిర్ణయం తీసుకోలేదు. టెయిల్‌పాండ్ పనులు రద్దు చేసిన విషయమై కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్లే యోచనలో ఉండటంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఏం చేయాలనే అంశంపై తర్జనభర్జన పడుతోంది. మరోవైపు సంబంధిత యంత్రాంగం దుమ్ముగూడెం ప్రాజెక్టు జిల్లా ఆయకట్టుతో పాటు నల్లగొండ జిల్లాలో కొంత ఆయకట్టును చేర్చేందు కు డిజైన్ చే స్తోంది. జిల్లాలోని బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు జలయజ్ఞలంలో ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్(దుమ్ముగూడెం)లతో పాటు దుమ్ముగూడెం-నాగార్జుసాగర్ టెయిల్‌పాండ్‌లను ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. గతంలో కిరణ్ ప్రభుత్వం, ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వ బడ్జెట్లోనూ ఈ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు లేదు. అంతేకాకుండా సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనలో టెయిల్‌పాండ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీని స్థానంలో ‘దుమ్ముగూడెం’ పేరుతో జిల్లాలోని బీడు భూములను సస్యశ్యామలం చేయాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు. నిధులు కేటాయించేనా..? కొత్తగా తైరపైకి తెస్తున్న ఈ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు ఎలా ఉంటుందన్నది ప్రశ్నార్థక మే. ‘తాను జిల్లాలో ఆరురోజుల్లోగా పర్యటన కు వస్తానని.. ఈ లోపు జిల్లా సంబంధించిన స మస్యలన్నింటిపై చర్చిస్తాను’అని సీఎం కేసీఆర్ మణుగూరులో ప్రకటించారు. సీఎం మళ్లీ పర్యటనకు జిల్లాకు వచ్చేలోపు పూర్తి స్థాయి నివేదిక తయారు చేసే పనిలో నిమగ్నమయ్యా రు. కాగా, సీఎం మలి పర్యటనలో ఈ ప్రాజెక్టు పై ఏం ప్రకటన చేస్తారో.. ఎన్ని నిధులు కే టాయిస్తారోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. టెయిల్‌పాండ్ స్వరూపం ఇదీ.. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసుందుకు జ్యోతిరావు ఫూలే దుమ్ముగూడెం- నాగార్జునసాగర్ సుజల స్రవంతి (లింక్ కెనాల్) ప్రాజెక్టును నిర్దేశించారు. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నది నుంచి 165 టీఎంసీల వరద నీటిని కృష్ణానదిపై ఉన్న నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టుకు పంపి జిల్లాలో సాగర్ ఆయకట్టును స్థీరీకరించాలన్నది అప్పటి ప్రభుత్వ లక్ష్యం. జిల్లాతో పాటు ఉమ్మడి రాష్ర్టంలోని కృష్ణా, నల్లగొండ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 22.13 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలని ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. మణుగూరు మండలం అనంతారం గ్రామం వద్ద గోదావరి నదిపై దీన్ని నిర్మించాలని భావించారు. జిల్లాలో ప్రధానంగా 2.64 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించాలని భావించారు. ఈ ప్రాజెక్టును రూ. 19,521.42 కోట్ల వ్యయం అంచనా వేశారు. 2013 -2014 నాటికి పూర్తి కావాల్సిన ఈ పనులకు ఇప్పటి సుమారు రూ.713 కోట్లు విడుదల చేశారు. రాష్ర్ట విభజనతో.. జలయజ్ఞంలో ఈ ప్రాజెక్టుకును చేపట్టినా రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాకే ఈ ప్రాజెక్టును పరిమితం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇప్పుడున్న రాజీవ్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులకు తోడు దీన్ని ద్వారా జిల్లాలో 2.64 లక్షల ఆయకట్టుకు నీరందించాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అప్పట్లో తెలంగాణలోని నల్లగొండ జిల్లా కూ డా ఈ ప్రాజెక్టులో ఉంది. అయితే ప్రస్తుతం జిల్లా వరకే ఈ ప్రాజెక్టును పరిమితం చేస్తుండడంతో సుమారు 3 లక్షల ఎకరాలకు రెండు లేదా మూడు పంపులు ఏర్పాటు చేసి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంది. దీంతో పాటు ఎస్సారెస్పీ పరిధిలో పాలేరు నియోజకవర్గం లో ఉన్న భూములకు కూడా దుమ్ముగూడెం ప్రాజెక్టు ఆయకట్టు కిందకు తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. గతంలో టెయిల్‌పాండ్‌లో నల్లగొండ జిల్లా కూడా ఉండడంతో అప్పటి ఆయకట్టును ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పరిధిలోకి తెచ్చేందుకు మరో డిజైన్ చేస్తున్నారు. -
'దుమ్ముగూడెం'ను జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించాలి: వైఎస్ జగన్
-
'దుమ్ముగూడెం'ను జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించాలి: వైఎస్ జగన్
హైదరాబాద్: దుమ్ముగూడెం - నాగార్జునసాగర్ టేల్పాండ్ ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి వైఎస్ జగన్ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తించాలని లేఖలో ప్రధాని మోడీని వైఎస్ జగన్ కోరారు. ఖమ్మం, వరంగల్ , పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 4 లక్షల ఎకరాలు ఈ ప్రాజెక్ట్‌తో సాగులోకి వస్తుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. -
దుమ్ముగూడెంతో మనకేం లాభం?
ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం నిరాసక్తత సాక్షి, హైదరాబాద్: గోదావరి వరద నీటి మళ్లింపుద్వారా నాగార్జునసాగార్ కుడి, ఎడమ కాల్వల కింద ఆయకట్టు స్థిరీకరణకోసం ఉద్దేశించిన దుమ్ముగూడెం- నాగార్జునసాగర్ టేల్పాండ్ ప్రాజెక్టు పనుల కొనసాగింపుపై తెలంగాణ ప్రభుత్వం సందిగ్ధంలో పడింది. ప్రాజెక్టుతో తెలంగాణకు వచ్చే ప్రయోజనాలు స్వల్పంగా, నిర్మాణానికి అయ్యే వ్యయం భారీగా ఉండటంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంపై ఊగిసలాటలో పడింది. తెలంగాణ ప్రయోజనాల వరకు ప్రాజెక్టును కుదించి నిర్మాణం కొనసాగించాలని గతంలో భావించిన ప్రభుత్వం, ప్రస్తుతం పూర్తిగా ప్రాజెక్టును నిలిపివేయాలనే దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ప్రాజెక్టు పనులకోసం సుమారు రూ.700 కోట్ల మేర ఖర్చు చేసినందున ప్రాజెక్టు రద్దు అంత సులభం కాదని భావిస్తున్న ప్రభుత్వం, దీని సాధ్యాసాధ్యాలు, ఇతరత్రా మార్గాలపై అన్వేషణ జరుపుతోంది. ప్రాజెక్టును పూర్తిస్థాయిలో రద్దు చేసే పరిస్థితుల్లో ఎదురయ్యే న్యాయపరమైన చిక్కులపై దృష్టిపెట్టిన ప్రభుత్వం, అన్ని అంశాలను క్రోడీకరించుకునే పనిలో పడింది. అంతిమ నిర్ణయం మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రిదేనని తెలుస్తోంది. ప్రాజెక్టుపై ఉన్నతస్థాయి సమీక్ష: ఈ ప్రాజెక్టును కొనసాగించాలా? లేక రద్దు చేయాలా? అన్న అంశంపై గురువారం జలసౌధలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. సుమారు నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమీక్షలో ప్రభుత్వ సలహాదారు విదాయసాగర్రావు, ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్, దుమ్ముగూడెం చీఫ్ ఇంజనీర్ శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టును రద్దు చేస్తే తలెత్తే సాంకేతిక, న్యాయపర చిక్కులపై చర్చించారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి వ్యక్తమయ్యే అభ్యంతరాలను ఎలా ఎదుర్కోవాలన్నదానిపైనా ఈ సమావేశంలో చర్చించారు. అయితే ప్రాజెక్టు కొనసాగింపు లేక రద్దుపై ఇంకా నిర్ణయానికి రాలేదని, దీనిపై ముఖ్యమంత్రిదే తుది నిర్ణయమని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. -
తెలంగాణ అవసరాలకే దుమ్ముగూడెం!
ప్రాజెక్టులో మార్పులు చేసే యోచనలో సర్కారు భూ సేకరణ, విద్యుత్ వినియోగం తగ్గించే వ్యూహం సాక్షి, హైదరాబాద్: తెలంగాణవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దుమ్ముగూడెం ప్రాజెక్టులో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా అందుబాటులోకి వచ్చే నీటిని తెలంగాణ రాష్ట్రానికే పరిమితం చేసే విధంగా నిర్ణయం తీసుకునే వీలుంది. ఈ మేరకు ప్రాజెక్టు డిజైన్‌లో మార్పులు చేయాలని రాష్ర్ట ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను పంపించాల్సిందిగా అధికారులను నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించినట్టు తెలిసింది. రెండు మూడు రోజుల్లో దీనిపై పూర్తి నివేదిక సిద్ధంకానుంది. గోదావరి నది నుంచి సుమారు 165 టీఎంసీల నీటిని కృష్ణా బేసిన్‌కు తరలించడానికి వీలుగా దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టును ఉమ్మడి రాష్ర్టంలో గత ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం వద్ద నుంచి నీటిని ఎత్తిపోసి నల్లగొండ మీదుగా నాగార్జునసాగర్ దిగువలోని టెయిల్ పాండ్‌లోకి తరలించే విధంగా ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఇందుకోసం సుమారు రూ. 19 వేల కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. దీనికి సంబంధించిన టెండర్లు కూడా ఖరార య్యాయి. అయితే ఈ ప్రాజెక్టును అప్పట్లోనే తెలంగాణ ప్రజాప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో భారీగా భూ సేకరణ చేయాల్సి ఉన్నందున రైతులు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం పక్కనబెట్టింది. సామర్థ్యం కొంత తగ్గిస్తే సరి! రాష్ర్ట విభజనతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై తాజాగా దృష్టి పెట్టింది. భూ సేకరణను వీలైనంత తగ్గించి రైతులు ఎక్కువ నష్టపోకుండా ప్రాజెక్టులో కొన్ని మార్పులు చేయాలని భావిస్తోంది. అవసరమైతే 165 టిఎంసీలు కాకుండా కొంత తక్కువ సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టాలన్న ఆలోచన చేస్తోంది. దీనివల్ల లిఫ్టులకు అవసరమయ్యే విద్యుత్ కూడా తగ్గుతుందని సర్కారు యోచిస్తోంది. తెలంగాణలో మూడు ప్రాజెక్టులు వరద నీటిపై ఆధారపడి ఉన్నాయి. నెట్టెంపాడు(22 టీఎంసీలు), కల్వకుర్తి(25 టీఎంసీలు), ఏఎమ్మార్పీ (30 టీఎంసీలు) ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేవు. అంటే ఈ మూడు ప్రాజెక్టులకు సుమారు 77 టిఎంసీల నీరు అవసరం. అంటే దుమ్ముగూడెం ప్రాజెక్టును 80 టిఎంసీలకు లేదా వంద టీఎంసీలకే పరిమితం చేస్తే ఖర్చు తగ్గడంతో పాటు భూ సేకరణ సమస్యను కూడా తగ్గించవచ్చని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ఈ నీటితో కృష్ణా బేసిన్‌లోని తెలంగాణ ప్రాజెక్టులకు అవసరమైన నీరు కూడా లభ్యమవుతుందని అంచనా వేస్తున్నారు. నాగార్జునసాగర్ పరిధిలో నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో(ఎడమ కాల్వ కింద) 6.58 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందుకోసం కృష్ణా జలాల్లో తెలంగాణకు 105 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి. దుమ్ముగూడెం నుంచి టెయిల్ పాండ్‌కు తీసుకువచ్చే గోదావరి నీటిని ఈ ఆయకట్టుకు ఉపయోగించుకుని కృష్ణా నదిలోని నికర కోటా జలాలను ఎగువ ప్రాంతంలోని నెట్టెంపాడు, కల్వకుర్తి, ఏఎమ్మార్పీ ప్రాజెక్టులకు వాడుకోవాలని రాష్ర్ట ప్రభుత్వం యోచిస్తోంది. -
అగమ్య గోచరం
బాబు డైరీ: దుమ్ముగూడెం-సాగర్ టెయిల్‌పాండ్‌ను పక్కన పెట్టడంతో కృష్ణా నదిపై ఆధారపడ్డ ప్రాజెక్టుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. వరద జలాలను ఆధారం చేసుకుని నిర్మిస్తున్న మహబూబ్‌నగర్‌లోని కల్వకుర్తి, నెట్టెంపాడు, నల్లగొండ జిల్లాలోని ఏఎమ్మార్పీతో పాటు రాయలసీమ, ప్రకాశం జిల్లాకు ఉపయోగపడే హంద్రీ-నీవా, గాలేరు- నగరి, వెలుగొండ వంటి ప్రాజెక్టుల పరిస్థితి అగమ్య గోచరమైంది. ముఖ్యంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సమయంలో వీటికి నీటి సరఫరా ఉండదు. పైగా ట్రిబ్యునల్ కొత్త తీర్పు వల్ల రాష్ట్రానికి వచ్చే నీటి వాటా భారీగా తగ్గనుంది. దుమ్ముగూడెం ప్రాజెక్టును నిర్మిస్తే.. పైన పేర్కొన్న ప్రాజెక్టులకు నీరు లభించే అవకాశం ఉంది. -
మళ్లీ తెరపైకి ‘దుమ్ముగూడెం’
మిర్యాలగూడ, న్యూస్‌లైన్:కృష్ణా-గోదావరి జలాల అనుసంధానం పేరుతో కృష్ణానది మిగులు జలాల్లో కోత విధించే ప్రయత్నం మొదలైంది. ఇప్పటికే బ్రిజేష్‌కుమార్ తీర్పు ప్రకారం నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల పరిధిలో 145 టీఎంసీల నీటిని వచ్చే ఏడాదికి నిల్వ చేసుకోవాలి. దీంతో మిగులు జలాల ఆధారంగా నల్లగొండ జిల్లాలోని ఎస్ఎల్బీసీకి చుక్కనీరు కూడా వచ్చే అవకాశాలు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో దుమ్ముగూడెం-టెయిల్‌పాండ్ ప్రాజెక్టు మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రాజెక్ట్ టెక్నికల్ కమిటీ నిర్ణయం మేరకు 2018 లోగా ప్రాజెక్ట్ పూర్తికి ప్రభుత్వం గడువు పొడిగించింది. దీంతో నల్లగొండ జిల్లా ప్రజల్లో మళ్లీ అలజడి మెదలైంది. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో అదనంగా ఒక్క ఎకరానికి నీరు రాక పోగా, భూసేకరణ కోసం పంట భూములు కోల్పోవలసి వస్తుంది. దుమ్ముగూడెం-టెయిల్పాంట్ ప్రాజెక్టు ద్వారా 165 టీఎంసీల గోదావరి జలాలను వినియోగించుకునే అవకాశం ఉందంటూ టెక్నికల్ కమిటీ పేర్కొనడం కృష్ణా జలాల్లో కోత విధించడానికే అని స్పష్టంగా తెలుస్తుంది. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం గతంలో రూ. 19,521 కోట్లకు అంచనా వేయగా, ప్రస్తుతం అది సుమారు రూ. 30 వేల కోట్లకు చేరింది. వాస్తవానికి 2009లోనే ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని భావించగా, నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. అప్పటి సీఎం రోశయ్యను కలిశారు. దీంతో పనులు నిలిచిపోయాయి. ఇదే సమయంలో 2014లోగా ప్రాజెక్టు పూర్తి చేయాలనే గడువు దగ్గరికి వచ్చింది. దీంతో టెక్నికల్ కమిటీ సూచనల మేరకు ఇటీవల ప్రాజెక్టు నిర్మాణ గడువు 2018 సంవత్సరానికి పెంచారు. ఎత్తిపోతలు సాధ్యమయ్యేనా? దుమ్ముగూడెం ప్రాజెక్టు భాగంగా ఖమ్మం జిల్లా బయ్యారం నుంచి నాగార్జునసాగర్ దిగువన నల్లగొండ జిల్లాలోని హాలియా సమీపంలో ఉన్న టెయిల్‌పాండ్ ప్రాజెక్టులోకి లింకు కాలువ ను ఏర్పాటు చేయాలి. దీని కోసం 244 కిలోమీటర్ల పొడువునా కాల్వ తవ్వకం పనులు చేపట్టాలి. అంతే కాకుండా మొత్తం 127 మీటర్ల ఎత్తులో ఎత్తిపోతల పథకాలు పనిచేయాల్సి ఉంది. అందుకు 1,136 మెగావాట్ల విద్యుత్ కూడా అవసరమవుతుంది. ఖమ్మం జిల్లాలోని మొద్దులగూడెం (19 మీటర్ల ఎత్తు), కళ్యాణపురం (16 మీటర్ల ఎత్తు), రేగల్ల (25 మీటర్ల ఎత్తు), ఒడ్డుగూడెం (12 మీటర్ల ఎత్తు), కోయగూడెం (19 మీటర్ల ఎత్తు), బయ్యారం వద్ద 35 మీటర్ల ఎత్తున ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారీగా నిర్మించే ఎత్తిపోతల పథకాలు పని చేసే పరిస్థితులు లేవు. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో భూసేకరణ ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా కాలువ తవ్వకానికి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో భూసేకరణ చేపట్టాల్సి ఉంది. ఖమ్మం, నల్లగొండ జిల్లాల పరిధిలో 3,701 ఎకరాల అటవీభూమి, 16,084 ఎకరాల ప్రైవేటు భూమిని రైతుల నుంచి సేకరించాల్సి ఉంది. ఈ పనులను 10 ప్యాకేజీలుగా విభజించారు. ఖమ్మం జిల్లాలో 1 నుంచి 6 ప్యాకేజీలు (159.80 కిలోమీటర్లు), నల్లగొండ జిల్లాలో 7 నుంచి 10వ ప్యాకేజీ వరకు 84 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. కాగా, ఖమ్మం జిల్లాలోని బయ్యారం నుంచి ప్రారంభమవుతున్న ఈ లింకు కాలువ బయ్యారం, గార్ల, తిమ్మాయిపాలెం మీదుగా నల్లగొండ జిల్లాలోని మోతె మండలానికి ప్రవేశించి అక్కడి నుంచి చివ్వెంల, మునగాల, పెన్‌పహాడ్, వేములపల్లి, త్రిపురారం, నిడమనూరు, అనుముల మీదుగా టెయిల్‌పాండ్ ప్రాజెక్టులో కలుస్తుంది. సాగర్ ఆయకట్టును దీని పరిధిలో చూపేందుకు ప్రయత్నం నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు దిగువభాగంలో ఉన్న టెయిల్‌పాండ్ ప్రాజెక్టులో ఈ లింకు కాలువను కలిపినా, దాని పరిధిలోని ఆయకట్టు పూర్తిగా దీని కిందనే ఉన్నట్లు టెక్నికల్ కమిటీ చూపేందుకు ప్రయత్నిస్తుందనే ఆరోపణలున్నాయి. టెయిల్‌పాండ్ వద్ద ఉన్న రివర్సబుల్ టర్బైన్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు ఆయకట్టుకు నీటిని వినియోగించుకోవచ్చని వారి లెక్కల్లో పేర్కొన్నారు. వరదల సమయంలోనే కేవలం 80రోజుల్లో మాత్రమే నీటిని మళ్లించే అవకాశముండే ఈ ప్రాజెక్టు పరిధిలోకి 14,12,870 ఎకరాల ఆయకట్టు చూపిస్తున్నారు. టెక్నికల్ కమిటీ సూచనల మేరకు తెలంగాణ ప్రాంతంలో 8,53,870 ఎకరాలు (ఖమ్మం జిల్లాలో 2,05,200 ఎకరాలు, కృష్ణా జిల్లాలో 3,68,070 ఎకరాలు (ఎడమకాల్వ పరిధి), నల్లగొండ జిల్లాలో 2,80600 ఎకరాలు), ఆంధ్రా ప్రాంతంలో 5,59,000 ఎకరాలు (గుంటూరు జిల్లాలో 3,40,000 ఎకరాలు, ప్రకాశం జిల్లాలో 2,19,000 ఎకరాలు ఆయకట్టును చూపుతున్నారు. కానీ వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు సాగుకు ఈ నీరు ఏ విధంగా ఉపయోగపడే అవకాశాలు లేవు. ప్రాజెక్టుపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి: జూలకంటి రంగారెడ్డి, ఎమెల్యే మిర్యాలగూడ దుమ్ముగూడెం-టెయిల్‌పాండ్ ప్రాజెక్టుతో నల్లగొండ జిల్లాకు ఎలాంటి ఉపయోగం లేదు. పనులు నిలిపివేయాలని గతంలోనే అప్పటి సీఎం రోశయ్యకు వినతిపత్రం ఇచ్చాం. ఇటీవల సీఎం కిరణ్‌ను కూడా కలిశాం. ఈ ప్రాజెక్ట్ నల్లగొండ జిల్లా ప్రజలకు ఎలా ఉపయోగపడుతుందో టెక్నికల్ కమిటీ చెప్పిన విషయాలను ప్రభుత్వం అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి వివరించాలి. ప్రజలు అడిగిన ప్రాజెక్టులను నిర్మించని ప్రభుత్వం అవసరం లేని దానిని నిర్మించే ప్రయత్నం విరమించుకోవాలి. -
కమీషన్ల కోసమే దుమ్ముగూడెం : వివేక్
ప్రాజెక్టు రద్దుకు వివేక్ డిమాండ్ సాక్షి, న్యూఢిల్లీ: కేబినెట్ ఆమోదం, కేంద్ర జల సంఘం అనుమతి లేకుండా, ప్రాజెక్టు వివరణాత్మక నివేదిక (డీపీఆర్) అందచేయకుండానే కాంట్రాక్టు కమీషన్ల కోసం దుమ్ముగూడెం ప్రాజెక్టును ప్రకటించారని, దానిని వెంటనే రద్దు చేయాలని పెద్దపల్లి ఎంపీ జి.వివేక్ డిమాండ్ చేశారు. తెలంగాణకు అన్యాయం చేస్తూ కమిషన్ల కోసమే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రకటించారని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో గురువారం ఆయన ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ వస్తుందని తెలిసి కూడా సీఎం కిరణ్ కాంట్రాక్టుల రూపంలో దండుకుంటున్నారని ఆరోపించారు. ప్రాజెక్టును తన సోదరుడికి కట్టబెట్టి, అడ్వాన్సు ఇచ్చి వాపసు తీసుకోవడానికి కిరణ్ చేస్తున్న ప్రయత్నాలను కేంద్రం గమనించాలన్నారు. సీమాంధ్ర ప్రజలను సీఎం కిరణ్, వైఎస్ఆర్సీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. తెలంగాణను అడ్డుకోవడం మాని సీమాంధ్రకు రాజధాని ఎక్కడ ఉండాలో? కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు ఎక్కడ ఉండాలో, ఇంకా ఏమేం కావాలో అఖిలపక్ష భేటీలో ప్రతిపాదనలు చేయాలని వారికి సూచించారు. మాజీ ఎంపీ వినోద్ మాట్లాడుతూ.. దేశంలో అత్యధిక చిన్నరాష్ట్రాలు ఇచ్చిన ప్రధాని ఇందిరాగాంధీయే అన్న విషయం సీఎం కిరణ్ తెలుసుకోవాలన్నారు. నాడు పంజాబ్ విభజనను వ్యతిరేకించిన ఆ రాష్ట్ర సీఎంను ఇందిర బర్తరఫ్ చేశారని, నేడు సీఎం కిరణ్‌ను కూడా బర్తరఫ్ చేయించి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ విభజన పూర్తి చేయాలన్నారు.