సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని సత్వరమే పూర్తి చేసేందుకు వీలుగా రుణాల సేకరణ చేస్తున్న ప్రభుత్వం కొత్తగా చేపడుతున్న సీతమ్మ సాగర్ దుమ్ముగూడెం ప్రాజెక్టుకు రుణ సేకరణ చేయాలని నిర్ణయించింది. ఆర్థిక మాంద్యం, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల జాప్యం, రాష్ట్ర నిధులన్నీ అభివృధ్ధి, సంక్షేమ కార్యక్రమాలకే సరిపోతున్న నేపథ్యంలో సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు రెండేళ్లలో పూర్తి చేసేలా రూ.3,400 కోట్ల రుణాలు సేకరించేందుకు కసరత్తులు ఆరంభించింది. 37 టీఎంసీల నిల్వ సామ ర్థ్యంతో పాటు, 320 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు సమృద్ధిగా నిధులను అందుబాటులో ఉంచేలా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్‌ఈసీ) నుంచి రుణాలు తీసుకునే అవకాశాలను పరిశీలిస్తోంది. ఈ ఏడాది జూన్, జులై నుంచే గోదావరి నీటిని ఎత్తిపోసేలా మోటార్లను సిద్ధం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment