
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం(సెప్టెంబర్20) సెక్రటేరియట్‌లో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయించింది. హైడ్రాకు విస్తృత అధికారాలు ఇస్తూ చట్టబద్ధత కల్పించే ఆర్డినెన్స్‌పై కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
హైదరాబాద్ నగరంలో చెరువులు, నాలాలు ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మించిన వారు ఎంతటి వారైనా వదిలేది లేదని, హైడ్రా వాటిని నేలమట్టం చేస్తుందని ఇటీవల ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హైడ్రాకు కేబినెట్‌లో విస్తృత అధికారాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఇదీ చదవండి.. ఒక హైడ్రా.. ఆరు చట్టాలు
Comments
Please login to add a commentAdd a comment