powers
-
యుద్ధం వస్తే.. ఏ దేశం ‘పవర్’ ఎంత?
పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి.ఇరాన్ మిసైల్ దాడులపై ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తుందనేది ఉత్కంఠగా మారింది.మిసైల్ దాడుల తర్వాత ఇరాన్‌పై ఇజ్రాయెల్ ఇప్పటివరకైతే నేరుగా దాడి చేయలేదు.ఇరాన్ మిత్రదేశమైన లెబనాన్‌పై మాత్రం దాడుల తీవ్రతను ఇజ్రాయెల్ పెంచింది.వేల మంది హెజ్బొల్లా గ్రూపు మిలిటెంట్లతో పాటు లెబనాన్‌లోని సామాన్యులు ఇజ్రాయెల్ దాడుల్లో మరణిస్తున్నారు.అయితే ఇరాన్‌పై ఇజ్రాయెల్ నేరుగా దాడిచేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. ఈ దాడులు ఇరాన్ చమురు స్థావరాలపై ఉంటాయని కొందరు అణుస్థావరాలపై ఉండొచ్చని మరికొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఈ రెండింటిలో ఏది జరిగినా ఇరాన్ కూడా తీవ్రంగా స్పందించే ఛాన్సుంది. ఇజ్రాయెల్ తమపై దాడి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తాజాగా రాజధాని టెహ్రాన్‌లో జరిగిన నమాజ్ సభలో ఇరాన్ సుప్రీం లీడర్ కమేనీ కూడా హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్,ఇజ్రాయెల్ యుద్ధం తీవ్ర రూపం దాల్చనుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఒకవేళ ఇదే జరిగితే ఈ రెండు దేశాలకు మద్దతుగా అమెరికా,బ్రిటన్,రష్యా లాంటి అగ్ర దేశాలు కూడా యుద్ధంలో పాల్గొని మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు లేకపోలేదన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో మధ్య ప్రాచ్యం(మిడిల్ ఈస్ట్)లో ఏ దేశం సైన్యం బలం ఎంతో ఒకసారి తెలుసుకుందాం.మిడిల్ ఈస్ట్‌లో ఏ దేశ ఆర్మీ బలమెంత..?టర్కీ..మిడిల్‌ఈస్ట్‌లోని దేశాల్లోకెల్లా టర్కీ ఆర్మీ అత్యంత శక్తివంతమైనదని పవర్ ఇండెక్స్ స్కోరు చెబుతోంది. ఇండెక్స్‌లో 0.16971 స్కోరుతో టర్కీ నెంబర్‌వన్ స్థానంలో ఉంది. అత్యాధునిక ఆయుధాలు, వీటిని వాడే నైపుణ్యమున్న బలగాలతో టర్కీ ఆర్మీని పూర్తిగా ఆధునీకరించారు.ఇరాన్..పవర్ ఇండెక్స్ స్కోరులో టర్కీ తర్వాత మిడిల్ఈస్ట్లో ఇరాన్ రెండవ స్థానంలో ఉంది. అత్యంత ఎక్కువ సంఖ్యలో ఉన్న బలగాలు,దేశ అమ్ములపొదిలో ఉన్న మిసైల్లు ఇరాన్ బలం. ఇరాన్ పవర్ ఇండెక్స్ స్కోరు 0.22691గా ఉంది.ఈజిప్టు..పది లక్షలకుపైగా ఉన్న బలగాలతో ఈజిప్టు మిలిటరీ శక్తివంతంగా ఉంది. 0.22831 స్కోరుతో పవర్ ఇండెక్స్‌లో ఈ దేశం మూడో స్థానంలో ఉంది.ఇజ్రాయెల్..ప్రస్తుతం వార్తల్లో ఉన్న ఇజ్రాయెల్ 0.25961 స్కోరుతో పవర్ ఇండెక్స్‌లో నాలుగో స్థానంలో ఉండడం గమనార్హం. దేశంలో అమల్లో ఉన్న తప్పనిసరి మిలిటరీ సర్వీసు కారణంగా ఇజ్రాయెల్‌కు ఎక్కువ మంది సైనికులు రిజర్వులో అందుబాటులో ఉన్నారు. డిఫెన్స్ రంగంలో అత్యాధునిక టెక్నాలజీ ఈ దేశం సొంతం.సౌదీఅరేబియా..బలమైన ఆర్థిక వనరులు,అత్యాధునిక డిఫెన్స్ పరికరాలతో సౌదీ అరేబియా పవర్ ఇండెక్స్‌లో ఐదో స్థానంలో ఉంది. ఇండెక్స్‌లో ఈ దేశ స్కోరు 0.32351గా ఉంది.ఇరాక్..పవర్ ఇండెక్స్‌లో ఆరో స్థానంలో ఉన్న ఇరాక్ స్కోరు 0.74411.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)..సైనికులకు అత్యాధునిక శిక్షణతో పాటు అత్యాధునిక టెక్నాలజీతో యూఏఈ పవర్ ఇండెక్స్‌లో ఏడో స్థానంలో ఉంది. ఇండెక్స్‌లో ఈ దేశం స్కోరు0.80831గా ఉంది.సిరియా..పవర్ ఇండెక్స్‌లో ఎనిమిదో స్థానంలో ఉన్న సిరియా స్కోరు 1.00261.ఖతార్..ఖతార్ 1.07891 స్కోరుతో ఖతార్ పవర్ ఇండెక్స్‌లో తొమ్మిదో స్థానంలో ఉంది.కువైట్..మిడిల్ ఈస్ట్ దేశాల పవర్ ఇండెక్స్‌లో కువైట్ పదవ ప్లేస్‌లో ఉంది.ఇండెక్స్‌లో ఈ దేశం స్కోరు 1.42611.అసలు ‘పవర్’ ఇండెక్స్ స్కోరు ఏంటి.. ఎలా లెక్కిస్తారు..ఒక దేశం మిలిటరీ సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు పవర్ ఇండెక్స్‌ను కొలమానంగా వాడతారు. దేశాల సైన్యాలకు ఉన్న వివిధ రకాల సామర్థ్యాల ఆధారంగా పవర్ ఇండెక్స్ స్కోరును నిర్ణయిస్తారు.ఒక దేశం సైన్యంలో మొత్తం బలగాల సంఖ్య, పదాతి దళం, నేవీ, ఎయిర్‌ఫోర్స్, రవాణా సదుపాయాలు, చమురు వంటి సహజ వనరుల లభ్యత, ఆర్థిక బలం, ప్రపంచపటంలో భద్రతా పరంగా వ్యూహాత్మక ప్రదేశంలో ఉందా లేదా అనే అంశాలన్నింటినీ పవర్ ఇండెక్స్ స్కోరు లెక్కించడానికి పరిగణలోకి తీసుకుంటారు.స్కోరు విషయంలో చిన్న ట్విస్టు..ఒక దేశ సైన్యం పవర్ ఇండెక్స్ స్కోరు లెక్కింపులో పైన పేర్కొన్న అంశాలన్నింటికీ సమాన వెయిటేజీ ఇస్తారు. ఉదాహరణకు ఒక దేశ ఆర్మీ అన్ని హంగులూ కలిగిన ఎయిర్‌ఫోర్స్ సామర్థ్యం కలిగి ఉందనుకుందాం. కానీ ఇదే దేశానికి నేవీ బలం అంతగా లేకపోతే పవర్ ఇండెక్స్ స్కోరు విషయంలో ఈ దేశం వెనుకబడుతుంది. పవర్ ఇండెక్స్ స్కోరును ఒక దేశ సైన్యానికి సంబంధించిన అన్ని సామర్థ్యాల మేళవింపుగా భావించొచ్చు. అయితే పవర్ ఇండెక్స్ స్కోరు విషయంలో చిన్న ట్విస్టుంది. ఈ స్కోరు ఎంత తక్కువగా ఉంటే దేశాల సైన్యాలు అంత బలంగా ఉన్నాయని అర్థం.ఇదీ చదవండి: నస్రల్లా వారసుడూ మృతి -
‘హైడ్రా’కు ఫుల్ పవర్స్..కేబినెట్ కీలక నిర్ణయం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం(సెప్టెంబర్20) సెక్రటేరియట్లో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయించింది. హైడ్రాకు విస్తృత అధికారాలు ఇస్తూ చట్టబద్ధత కల్పించే ఆర్డినెన్స్‌పై కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.హైదరాబాద్ నగరంలో చెరువులు, నాలాలు ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మించిన వారు ఎంతటి వారైనా వదిలేది లేదని, హైడ్రా వాటిని నేలమట్టం చేస్తుందని ఇటీవల ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హైడ్రాకు కేబినెట్లో విస్తృత అధికారాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇదీ చదవండి.. ఒక హైడ్రా.. ఆరు చట్టాలు -
కనీసం ఇప్పటికైనా...
దేన్నయినా పదే పదే చెప్పవలసిరావటం ఎవరికైనా ఇబ్బందే. అందునా రాజ్యాంగ పదవుల్లో వున్నవారికి పదే పదే రాజ్యాంగ నిబంధనలు గుర్తుచేయటం మరింత ఇబ్బందికరమైన వ్యవహారం. కానీ మన సర్వోన్నత న్యాయస్థానానికి ఇది తప్పడం లేదు. తమ శాసనసభ ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేయకపోవటాన్ని సవాలు చేస్తూ పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పునిస్తూ గవర్నర్ల అధికారాలకుండే పరిధులు, పరిమితుల గురించి సుప్రీంకోర్టు మరోసారి చెప్పక తప్పలేదు. తన ఆమోదముద్ర కోసం వచ్చిన బిల్లుపై ‘సాధ్యమైనంత త్వరగా’ గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని, పునఃపరిశీలన అవసరమని భావిస్తే ఆ సంగతి తెలియజేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది. ఈనెల 10న వెలువడిన ఆ తీర్పు పూర్తి పాఠం గురువారం సుప్రీంకోర్టు వెబ్సైట్లో వెలువడింది. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లును నిలిపి వుంచేందుకు, వెనక్కి పంపేందుకు రాజ్యాంగంలోని 200వ అధికరణ గవర్నర్‌కు అధికారమిస్తోంది. బిల్లు సక్రమంగా లేదని, స్పష్టత కొరవడిందని లేదా రాజ్యాంగ నిబంధనలను అతిక్రమిస్తోందని గవర్నర్ భావించినప్పుడు దాన్ని తిప్పిపంపొచ్చు. అయితే ఆ సందర్భంగా గవర్నర్ ఏం చేయాల్సివుంటుందో కూడా అదే అధికరణ వివరిస్తోంది. గవర్నర్ ఇచ్చిన సలహాను అంగీకరించి బిల్లుకు సవరణలు చేయటమా లేక యధాతథంగా దాన్నే మరోసారి ఆమోదించి పంపటమా అనేది శాసనసభ ఇష్టమని కూడా అదే అధికరణ తేటతెల్లం చేస్తోంది. రెండోసారి వచ్చిన బిల్లును గవర్నర్ ఆమోదించి తీరాలని ఆ అధికరణ వివరిస్తోంది. నిబంధనలు ఇంత స్పష్టంగా వున్నప్పుడు రోజుల తరబడి, నెలల తరబడి నిర్ణయం చెప్పకుండా బిల్లుల్ని పెండింగ్‌లో వుంచటం అసమంజసం, రాజ్యాంగ విరుద్ధం. కానీ మన దేశంలో పదే పదే ఇలాగే జరుగుతోంది. ఇతరేతర వ్యవస్థలు కాలానుగుణంగా ఎంతోకొంత మార్పులు చెందుతూ వచ్చాయి. గవర్నర్ల వ్యవస్థ మాత్రం అన్నింటికీ అతీతంగా వుండిపోయింది. అంతక్రితం సర్కారియా కమిషనైనా, ఆ తర్వాత వీరప్ప మొయిలీ నేతృత్వంలోని పాలనా సంస్కరణల కమిషనైనా రాజకీయ నేతలకు ఆ పదవులు ఇవ్వొద్దని సూచించాయి. గవర్నర్ పదవిని రాజకీయ పునరావాసంగా మార్చొద్దని 1994లో ఎస్ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు కూడా హితవు చెప్పింది. రాజకీయాలకు అతీతంగా వుండే వ్యక్తులు లేదా ఏదో ఒక రంగంలో నిష్ణాతులైనవారు ఆ పదవిలో వుంటే మంచిదని సర్కారియా కమిషన్ సూచించింది. కానీ కేంద్రంలోని ఏ ప్రభుత్వమూ ఆ సూచన శిరోధార్యమని భావించలేదు. ఇటీవల గవర్నర్లకూ, రాష్ట్ర ప్రభుత్వాలకూ మధ్య తరచు వివాదాలు తలెత్తు తున్నాయి. పంజాబ్‌తోపాటు తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రాల్లో ప్రభుత్వా లకూ, గవర్నర్లకూ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పంజాబ్‌లో మరీ విపరీతం. అక్కడ ఏకంగా 12 బిల్లుల విషయంలో గవర్నర్ ఎటూ తేల్చకుండా ఆపేశారు. గవర్నర్లు ఇలా వ్యవహరించటం వల్ల ప్రజల దృష్టిలో ప్రభుత్వాలు చులకనవుతాయి. సమస్య అపరిష్కృతంగా వుండిపోవటా నికి కారణం తెలియక అధికార పక్షంపై సామాన్యులు విరుచుకుపడతారు. బహుశా అలా జరగాలని గవర్నర్లు కోరుకుంటున్నారేమో తెలియదు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలపట్ల ఇలా చిన్నచూపుతో వ్యవహరించటం తమ పదవిని తామే చిన్నబుచ్చుకోవటమని గవర్నర్లు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. సమస్యేమంటే తమ ఏలుబడిలోని ప్రభుత్వాలకు గవర్నర్లు ఇబ్బందిగా మారినప్పుడు కొత్తగా మొదటిసారి ఇలా జరుగుతున్నట్టు మాట్లాడే పార్టీలు, గతంలో తాము అధికారంలో వుండగా వ్యవహరించిన తీరును పూర్తిగా మరిచిపోతాయి. దేశంలో ఏ మూలైనా గవర్నర్‌కూ, ఒక ప్రభు త్వానికీ మధ్య వివాదం తలెత్తినప్పుడల్లా కేంద్రంలోని జనతాపార్టీ ప్రభుత్వం గుర్తుకు రాకమానదు. 1977లో జనతాపార్టీ అధికారంలోకి రాగానే ఒకే వేటుతో పది రాష్ట్ర ప్రభుత్వాలను రాజ్యాంగంలోని 356వ అధికరణ కింద బర్తరఫ్ చేసింది. 1980లో కేంద్రంలో మళ్లీ అధికారం వచ్చాక కాంగ్రెస్ ఇదే పని చేసింది. ప్రజల ఆమోదంతో అధికారంలోకొచ్చిన ప్రభుత్వాలను ఇలా ఇష్టానుసారంగా, కక్ష పూరితంగా రద్దు చేయటం దారుణమని ఆ రెండు పార్టీల ప్రభుత్వాలూ అనుకోలేదు. ఆ తర్వాత కాలంలో కూడా ఇదే ధోరణి కొనసాగాక బొమ్మై కేసులో సుప్రీంకోర్టు విస్పష్టమైన తీర్పునిచ్చింది. అలాంటి చర్యకు పార్లమెంటు ఉభయసభల ఆమోదం వుండితీరాలన్న నిబంధన విధించింది. అటు తర్వాత ఈ నిరంకుశ విధానానికి ఏదోమేరకు బ్రేకు పడిందనే చెప్పాలి. ఇప్పుడు పంజాబ్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల కేరళ, తమిళనాడు ప్రభుత్వాలకు కూడా ఊరట వచ్చినట్టే. ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తమ బిల్లులు పెండింగ్‌లో వుంచటాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఫెడరల్ వ్యవస్థలో గవర్నర్ల పాత్రేమిటన్న అంశంలో మన రాజ్యాంగ నిర్మాతలకు తగిన అవగాహన లేకపోవచ్చు. కానీ ‘సాధ్యమైనంత త్వరగా’ బిల్లులపై నిర్ణయం తీసుకోవాలనటం ద్వారా గవర్నర్ల బాధ్యతేమిటో స్పష్టంగా చెప్పినట్టయింది. చట్టాల రూపకల్పనలో శాసనసభల పాత్ర వమ్ము అయ్యేలా అధికారాలను వినియోగించటం సరికాదని తాజా తీర్పులో సుప్రీంకోర్టు చెప్పటం హర్షించదగింది. మరోసారి ఇలా చెప్పించుకోవాల్సిన అవసరం రాకుంటే తమకే గౌరవప్రదమని గవర్నర్లు గుర్తించటం మంచిది. -
గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులకు డీడీవో అధికారాలు
సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయాల్లో పనిచేసే గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్ 1–4 కేటగిరీల పంచాయతీ కార్యదర్శుల తరహాలోనే గ్రామ పంచాయతీల బిల్లుల తయారీ తదితర అన్ని రకాల డీడీవో అధికారాలను అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులు ప్రస్తుతం పనిచేస్తున్న చోట ఆయా గ్రామ పంచాయతీ బాధ్యతల్లోనూ కీలకం కానున్నారు. ఈ ప్రతిపాదనల ఫైలుకు సీఎం జగన్ ఆమోదించారు. గ్రామ సచివాలయాల వ్యవస్థ ఏర్పాటుకు ముందుకు ఏపీలోని గ్రామ పంచాయతీల్లో గ్రేడ్ 1, 2, 3, 4 కేటగిరీ పంచాయతీ కార్యదర్శులు మాత్రమే పనిచేస్తుండేవారు. అప్పట్లో కొన్ని చోట్ల..మూడు నాలుగు పంచాయతీలకు కలిపి ఒకే పంచాయతీ కార్యదర్శి విధులు నిర్వహించేవారు. గ్రామ సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు సమయంలో ప్రతి 2,000 జనాభాకు ఒక గ్రామ సచివాలయాలం చొప్పున ఏర్పాటు చేసి, గ్రేడ్ –5 పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం నియమించింది. వీరికి మిగిలిన 4 కేటగిరి పంచాయతీ కార్యదర్శుల తరహా జాబ్‌చార్ట్ నిర్థారణ జరిగినప్పటికీ..అప్పట్లో సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు కాలేదన్న కారణాలతో వీరికి డీడీవో అధికారాలను పూర్తిస్థాయిలో అప్పగించ లేదు. సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో గ్రేడ్ –5 పంచాయతీ కార్యదర్శులకు డీడీవో అధికారాలను కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ పూర్తి విధివిధానాలతో త్వరలో ఉత్తర్వులు వెలువరించనుంది. 1. చాలా కాలంగా కోరుతున్న సమస్య గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులకు వారి జాబ్ చార్ట్ ప్రకారం చిన్న పంచాయతీల బాధ్యతలు అప్పగించాలని చాలా కాలంగా కోరుతున్నాం. మా విజ్ఞప్తిని మన్నించి వారికి న్యాయం చేసిన సీఎం జగన్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు, పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ బుడితి రాజశేఖర్‌కు కృతజ్ఞతలు. – కాకర్ల వెంకట రామిరెడ్డి, గౌరవాధ్యక్షుడు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం 2. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు డీడీవో బాధ్యతలు అప్పగించడం ద్వారా గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులకు న్యాయం చేసిన సీఎం జగన్‌కి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. – బత్తుల అంకమ్మరావు, విప్పర్తి నిఖిల్ కష్ణ, డాక్టర్ బీఆర్ కిషోర్ (గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం) 3. ధన్యవాదాలు సీఎం సార్.. ఒకేసారి 1.34 లక్షల కొత్త సచివాలయాల ఉద్యోగాల నియమాకం చేపట్టడంతో పాటు.. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రతి సమస్యపై అత్యంత సానుకూలంగా స్పందిస్తున్న సీఎం జగన్‌కు ఎప్పటికీ కృతజ్ఞులమై ఉంటాం. – ఎండీ జానిపాషా, గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ -
దశాబ్దాల దందాలకు కళ్లెం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వివిధ రకాల స్మగ్లింగ్లు, దందాలను నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో రంగంలోకి దిగింది. ఉదాశీన చట్టాలను అవకాశంగా చేసుకుని దశాబ్దాలుగా వ్యవస్థీకృతమైన ఇసుక, అక్రమ మద్యం, గంజాయి, ఎర్రచందనం, ఆన్లైన్ గేమింగ్ తదితర దందాలపై కఠిన చర్యలకు సమాయత్తమైంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)కు సర్వాధికారాలు కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది. ఐపీసీ, సీఆర్పీసీ తదితర సెక్షన్ల కింద కేసులు నమోదుచేసి దర్యాప్తు చేసేందుకు ‘సెబ్’కు అధికారాలు అప్పగించింది. ఏళ్ల తరబడి సాగుతున్న దోపిడీ చట్టంలో లొసుగులను అవకాశంగా చేసుకుని రాష్ట్రంలో ఇసుక, అక్రమ మద్యం, గంజాయి, ఎర్రచందనం, ఆన్లైన్ గేమింగ్ దందా దశాబ్దాలుగా వ్యవస్థీకృతమైంది. ఇంతవరకు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై రాష్ట్ర మైనింగ్, మినరల్స్ నియంత్రణ చట్టం ప్రకారమే కేసులు నమోదు చేసేందుకు అవకాశం ఉంది. ఎవరైనా వరుసగా 2సార్లు పట్టుబడితే ఆ చట్టం ప్రకారం జరిమానా విధించి విడిచిపెట్టేవారు. మూడోసారి దొరికితే కేసు పెట్టేందుకు అవకాశం ఉంది. అది కూడా స్థానిక పోలీసులకు అప్పగించాలి. అంతేగానీ రెవెన్యూ అధికారులకు ఎలాంటి అధికారం ఉండదు. అదే ప్రాతిపదికన వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2020లో ఏర్పాటుచేసిన ‘సెబ్’కు కూడా కేసులు పెట్టేందుకు సాంకేతికంగా అడ్డంకులు తలెత్తాయి. మద్యం అక్రమ రవాణా విషయంలోనూ ఎక్సైజ్ చట్టం ప్రకారం నమోదుచేసే కేసులు ఎలాంటి ప్రభావం చూపించడంలేదు. ఇక మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి జీవితాలను ఆర్థికంగా దెబ్బతీస్తున్న ఆన్లైన్ జూదం దందాపై కూడా కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదుకూ అవకాశంలేదు. రాయలసీమలో ఎర్రచందనం స్మగ్లింగ్‌పై కూడా అటవీ చట్టాల కింద పెట్టే కేసులు స్మగ్లర్ల ఆట కట్టించేందుకు సరిపోవడంలేదు. ఇటువంటి వ్యవస్థీకృత లోపాలతో రాష్ట్రంలో ఇసుక, అక్రమ మద్యం, గంజాయి, ఎర్రచందనం, ఆన్లైన్ గేమింగ్ దందాలు యథేచ్ఛగా సాగుతూ అటు ప్రజాధనాన్ని కొల్లగొట్టడంతోపాటు ఇటు సామాన్యుల జీవితాలను దెబ్బతీస్తున్నాయి. గత ప్రభుత్వాలు ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం కూడా స్మగ్లర్లకు ఊతమిచ్చింది. కొరఢా ఝళిపించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో అన్ని రకాల స్మగ్లింగ్ దందాలను నిర్మూలించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్యుక్తమైంది. అందుకోసం ‘సెబ్’కు విశిష్ట అధికారాలు కల్పించాల్సిన అవసరం ఉందని గుర్తించింది. అందుకే ఆయా దందాల్లోని పాత్రధారులు, సూత్రధారులపై ఐపీసీ, సీఆర్పీసీ తదితర సెక్షన్ల కింద కఠిన శిక్షలు విధించేలా చేసేందుకు ‘సెబ్’కు అధికారాలు కల్పిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం.. ►రాష్ట్రం ఒక యూనిట్‌గా ‘సెబ్’ కమిషనరేట్‌ను గుర్తించడంతోపాటు రాష్ట్రంలో ఉన్న ‘సెబ్’ స్టేషన్లను పోలీస్స్టేషన్లుగా గుర్తిస్తూ హోంశాఖ ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. ఆ ప్రకారం ‘సెబ్’కు ఐపీసీ, సీఆర్పీసీ సెక్షన్ల కింద కేసులు నమోదుచేసేందుకు అవకాశం కల్పిస్తూ మైనింగ్, ఎక్సైజ్, అటవీ శాఖలు విడివిడిగా కూడా నోటిఫికేషన్లు జారీచేయాల్సి ఉంది. ►ఇప్పటికే గనుల శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. దాంతో ఇక నుంచి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై ‘సెబ్’ దాడులు నిర్వహించి నేరుగా ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తుంది. ఆ కేసులను స్థానిక పోలీసులకు అప్పగించాల్సిన అవసరంలేదు. జరిమానాలతో కేసులను సరిపెట్టరు. దీంతో.. ప్రజాధనం లూటీ, సహజ వనరుల దోపిడీ కింద ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేందుకు ‘సెబ్’కు అధికారాలు సంక్రమించాయి. ► హోం, ఎక్సైజ్ శాఖలు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేయడంతో అక్రమ మద్యం, గంజాయి దందాలకు పాల్పడే వారిపై కూడా ‘సెబ్’ నేరుగా ఐపీసీ, సీఆర్పీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేందుకు మార్గం సుగమమైంది. ►ఇక ఎర్రచందనం స్మగ్లర్లపై ‘సెబ్’ నేరుగా ఐపీసీ, సీఆర్పీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేందుకు అవకాశం కల్పిస్తూ అటవీ శాఖ కూడా ఉత్తర్వులు జారీచేయనుంది. ► అలాగే, ఆన్లైన్ జూదాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసేందుకు వీలుగా ఐటీ శాఖ త్వరలో నోటిఫికేషన్‌ను జారీచేయనుంది. ►గుట్కా దందాపై కఠిన చర్యలకు వీలుగా వైద్య–ఆరోగ్య శాఖ ఇటీవల ఉత్తర్వులిచ్చింది. తదనుగుణంగా త్వరలో నోటిఫికేషన్ జారీ కానుంది. -
భారం మోపి బురద!
సాక్షి, అమరావతి: గత సర్కారు అనాలోచిత నిర్ణయాలు, అసంబద్ధ విధానాలతో విద్యుత్ రంగం కుదేలైంది. బకాయిలు చెల్లించకపోవడంతో డిస్కంలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. అప్పుడు చేసిన తప్పిదాలే ట్రూ అప్ చార్జీల భారానికి కారణమయ్యాయని విద్యుత్తు రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి చౌక విద్యుత్తు కొనుగోళ్లు, పొదుపు చర్యలతో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేస్తూ పంపిణీ సంస్థలను ఆదుకుంటోంది. విద్యుత్తు రంగంలో ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ అనవసర వ్యయాన్ని నియంత్రిస్తోంది. మరోవైపు ప్రజలపై పెనుభారం పడకుండా భారీగా రాయితీలను భరిస్తోంది. రైతులతో పాటు ఇతర వర్గాలకు ఉచిత, రాయితీ విద్యుత్‌ను అందిస్తూనే కొనుగోళ్లు, పంపిణీలో నష్టాలను తగ్గించుకునేందుకు చర్యలు చేపడుతోంది. అయితే టీడీపీ నేతలు వాస్తవాలను మభ్యపుచ్చి తమ కారణంగా ప్రజలపై పడిన ట్రూ అప్ చార్జీలపై వారే ఆందోళనకు దిగడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఆ ఐదేళ్లూ అప్పుల కొండ ఆర్ధిక భారం నుంచి తప్పించుకునేందుకు గత సర్కారు తప్పుడు నివేదికలతో డిస్కంలను అప్పుల ఊబిలోకి గెంటేసింది. ఫలితంగా 2014 నుంచి 2019 వరకూ విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాలు రూ.4,110 కోట్ల నుంచి ఏకంగా రూ.27,240 కోట్లకు చేరాయి. గత రెండున్నరేళ్లలో నష్టాలు రూ.311 కోట్లు మాత్రమే పెరిగాయి. ప్రస్తుతం నష్టాలు రూ.27,551 కోట్లుగా ఉన్నాయి. టీడీపీ హయాంలో వార్షిక సరఫరా ఖర్చు రూ.24,211 కోట్ల నుంచి రూ.46,404 కోట్లకు చేరుకుంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పొదుపు చర్యలతో ఇది తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రూ.39,324 కోట్లుగా ఉంది. ఇక 2014 నుంచి 2019 వరకూ విద్యుత్ రంగం అప్పులు రూ.31,648 కోట్ల నుంచి రెట్టింపై రూ.62,463 కోట్లకి ఎగబాకాయి. 2014 జూన్ 2 నాటికి విద్యుత్తు కొనుగోళ్ల బకాయిలు, నిర్వహణ ఖర్చులు రూ.12,500 కోట్లు ఉండగా 2019 ఏప్రిల్ 1 నాటికి రూ.32,000 కోట్లకు చేరాయి. భారమైనా భరిస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా గృహ విద్యుత్ వినియోగానికి సంబంధించి రూ.1,707.07 కోట్ల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. రాయితీలు, ప్రోత్సాహకాలు, గృహ విద్యుత్ వినియోగదారులతో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, రైతులు, పౌల్ట్రీ వర్గాల భారాన్ని ప్రభుత్వమే మోస్తోంది. వ్యవసాయ ఉచిత విద్యుత్‌కు సంబంధించి రూ.7297.08 కోట్ల ఆర్ధిక భారం ప్రభుత్వంపై పడింది. తొలిసారిగా ఉచిత విద్యుత్ వర్గాలన్నీ సెక్షన్–65 కింద ప్రత్యక్ష రాయితీ పొందేలా ఒకే గొడుగు కిందకు ఏపీఈఆర్సీ తెచ్చింది. దీనివల్ల పడిన రూ.1,657.56 భారాన్ని కూడా భరించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అంగీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు పంపిణీ సంస్థల పరిధిలోనూ ఒకే విధంగా ధరలు అమలుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీనివల్ల ప్రభుత్వంపై రూ.136.72 కోట్ల భారం పడింది. అప్పటిలా కనీస చార్జీలు లేవు గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి రూ.50 చొప్పున కనీస చార్జీలు వసూలు చేసే విధానం గత సర్కారు హయాంలో అమలైంది. దీనివల్ల నెలంతా విద్యుత్ వినియోగించకపోయినా కనీస చార్జీ రూ.50 చెల్లించాల్సి వచ్చేది. దీన్ని తొలగించి కిలోవాట్‌కు రూ.10 వసూలు చేసే విధానాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. అంటే నెలంతా విద్యుత్ వినియోగించకపోతే కనీస చార్జీ చెల్లించనవసరం లేదు. ఇక సగటు యూనిట్ సేవా వ్యయం రూ.7.17 నుంచి రూ.6.37కి తగ్గించింది. విద్యుత్ వినియోగాన్ని బట్టి శ్లాబులను మార్చి అధికభారం మోపే విధానాన్ని టీడీపీ సర్కారు ఐదేళ్లూ అమలు చేసింది. దాని నుంచి కాపాడటానికి ఏ నెలలో ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారో టారిఫ్ ప్రకారం ఆ నెలలోనే బిల్లు వేసే విధంగా కంటిన్యూ బిల్లింగ్ విధానాన్ని ఇప్పుడు ప్రభుత్వం తెచ్చింది. విద్యుత్ సంక్షేమ రంగంవైపు అడుగులు.. విద్యుత్తు రంగాన్ని ప్రగతిశీల, ప్రజా సంక్షేమ రంగంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 200 యూనిట్లు, ఎంబీసీలు, చేనేత కార్మికులకు 100 యూనిట్లు, దోబీఘాట్లు, లాండ్రీలకు 150 యూనిట్లు, స్వర్ణకారులకు 100 యూనిట్లు, సెలూన్లు, రోల్డ్ గోల్డ్ పనివారికి 100 యూనిట్లు ఉచితంగా అందజేస్తోంది. విద్యుత్తు సరఫరాలో అంతరాయాలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోంది. 2019–20లో 3 లక్షలుగా ఉన్న అంతరాయాలను 2020–21 నాటికి 1.77 లక్షలకు తగ్గించింది. 2019–20లో యూనిట్‌కు రూ.7.23 చొప్పున ఉన్న సగటు సర్వీసు వ్యయాన్ని 2020–21 నాటికి రూ.6.37కి తగ్గించగలిగింది. ఇటు డిస్కంలను ఆదుకుంటున్న ప్రభుత్వం.. విద్యుత్తు సంస్థలు 2019–21 మధ్య కొనుగోళ్ల కోసం విద్యుదుత్పత్తి సంస్థలకు రూ.64,007 కోట్లు చెల్లించాయి. దీనిని తట్టుకోవాలంటే ప్రభుత్వం నుంచి సబ్సిడీలు సకాలంలో అందాలి. ఈ నేపథ్యంలో 2019 మార్చి 31 నాటికి విద్యుత్తు సబ్సిడీ బకాయిలు రూ.13,388 కోట్లు ఉండగా ప్రభుత్వం రూ.11,442 కోట్లు ఇచ్చింది. 2019–21 సంవత్సరానికి విద్యుత్తు సబ్సిడీ, ఇతర ఛార్జీల కింద మరో రూ.16,724 కోట్లు విడుదల చేసింది. ఇలా విద్యుత్తు సంస్థలను ఆదుకునేందుకు రూ.28,166 కోట్లు విడుదల చేసింది. వాస్తవ సర్దుబాటు వ్యయం రూ.20,572 కోట్లు విద్యుత్ పంపిణీ సంస్థలు 2014–19 కాలానికి దాదాపుగా రూ.20,572 కోట్ల వాస్తవ అదనపు వ్యయం సర్దుబాటు కోసం విద్యుత్ నియంత్రణ మండలికి 2019 చివరిలో విన్నవించాయి. ఇదే కాకుండా 2014–15 నుంచి 2018–19 వరకు సంస్థల నెట్వర్క్ (పంపిణీ వ్యవస్థ) నిర్వహణ, ఆదాయ అవసరాల వాస్తవ ఖర్చుల ఆధారంగా జరిపిన అదనపు వ్యయం సర్దుబాటు రూపంలో మరో రూ.7,224 కోట్లు అనుమతించాలని విద్యుత్ నియంత్రణ మండలిని కోరాయి. ఇందులో రూ.3,555 కోట్ల వసూలును ఏపీఈఆర్సీ తిరస్కరించింది. రూ.3,669 కోట్ల ట్రూ–అప్ చార్జీల వసూలు మాత్రం అనివార్యమైంది. నిజానికి ఇది కూడా ఆమోదించకపోతే విద్యుత్ పంపిణీ సంస్థల మనుగడ కష్టంగా మారే ప్రమాదం ఉంది. అది మంచిది కాదని విద్యుత్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. గత ప్రభుత్వ హయాం నాటివే ‘ప్రస్తుతం అమలవుతున్న ట్రూ అప్–సర్దుబాటు చార్జీలు గత ప్రభుత్వ హయాం నాటి విద్యుత్ పంపిణీ నెట్వర్క్ చార్జీలకు సంబంధించినవి. విద్యుత్ పంపిణీ సంస్థల వార్షిక ఖర్చులు, ఆదాయ అవసరాలకు అనుగుణంగా గత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడం, విద్యుత్ నియంత్రణ మండలి నిర్దేశించిన సబ్సిడీని భరించని కారణంగా పంపిణీ సంస్థల అప్పులు పెరిగిపోయాయి. ఏపీఈఆర్సీకి సమర్పించే వార్షిక ఆదాయ అవసరాల నివేదికలలో వాస్తవాలను వెల్లడించకుండా పరోక్షంగా భారాన్ని తగ్గించుకుని తప్పుల తడకలు నివేదికలతో సమయాన్ని వెళ్లదీశారు. అప్పుడు జరిగిన నష్టమంతా సర్దుబాటు చార్జీల రూపంలో వినియోగదారులపై పడింది. 2014–15 నుంచి 2018–19 వరకు నెట్వర్క్ (పంపిణీ వ్యవస్థ) నిర్వహణకు అనుమతించిన వ్యయం కన్నా వాస్తవ ఖర్చు అధికమవడం వల్లే ఈ సవరింపు చార్జీలు విధించాల్సి వచ్చిందనే విషయాన్ని గమనించాలి’ –నాగులాపల్లి శ్రీకాంత్, ఇంధన శాఖ కార్యదర్శి -
హైదరాబాద్ మేయర్ పవర్స్ ఎంటో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: గత కొన్ని రోజులుగా జీహెచ్ఎంసీ మేయర్ ఎవరా అన్న చర్చలు చోటు చేసుకోగా, ప్రస్తుతం మేయర్కున్న పవరేమిటి? అనేది ఆసక్తికరంగా మారింది. మేయర్ పదవి కోసం ఎందరెందరో పోటీపడటం.. తీవ్ర స్థాయిలో పైరవీలు చేయడం.. అధికార టీఆర్ఎస్ పార్టీ సైతం మేయర్ అభ్యర్థిని ప్రకటించేందుకు ఆచితూచి వ్యవహరించడం.. చివరి నిమిషం వరకు అభ్యర్థిని వెల్లడించకుండా తీవ్ర ఉత్కంఠ రేపడం.. సీల్డు కవరుకు మొగ్గు చూపడం తదితర కారణాలతో మేయర్ అధికారాలపై ప్రజల్లో తీవ్ర ఆసక్తి ఏర్పడింది. జీహెచ్ఎంసీలో ఉన్నతాధికారి కమిషనర్ కాగా, కమిషనర్ అధికారాలేమిటి..మేయర్ అధికారాలేమిటి..అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జీహెచ్ఎంసీ చట్టం, నిబంధనల మేరకు అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం ఎవరేం చేయవచ్చునంటే.. మేయర్ పవర్ ఇలా.. జీహెచ్ఎంసీ పాలకమండలి సర్వసభ్యసమావేశాలను ఏర్పాటు చేయడం. సదరు సమావేశాలకు మినిట్స్ రూపొందించడం. సర్వసభ్య సమావేశానికి అధ్యక్ష వహించి సభ నిర్వహించడం. సర్వసభ్య సమావేశాల్లో రూ. 6 కోట్ల వరకు పనులకు ఆమోదం తెలపడం. వారం వారం జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశానికీ అధ్యక్షత వహించడం. జీహెచ్ఎంసీకి సంబంధించి ఏ కొత్త పాలసీని అమలు చేయాలన్నా స్టాండింగ్ కమిటీ ఆమోదం అవసరం. రూ.3 కోట్ల వరకు పనులకు ఆమోదం తెలిపే అధికారం స్టాండింగ్ కమిటీకి ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో అధికారులు, ఉద్యోగుల అంతర్గత బదిలీలు చేసే సమయాల్లో కమిషనర్ మేయర్‌ను సంప్రదించాలి. ప్రమాద ఘటనల్లో మృతుల కుటుంబాలకు లక్ష రూపాయల వరకు నష్టపరిహారంగా చెల్లించేందుకు పవర్ ఉంటుంది. కమిషనర్ అధికారాలిలా.. జీహెచ్ఎంసీకి సంబంధించినంత వరకు కమిషనర్ సర్వోన్నతాధికారి. పనులు చేసేందుకు రూ.2 కోట్ల వరకు నిధులు మంజూరు చేసే అధికారం. అధికారులు, ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం. ఆస్తిపన్ను విధింపు, వసూళ్లు..ఇతరత్రా ఫీజుల వసూళ్లు. అవసరాన్ని బట్టి రూ.5 లక్షల వరకు పనుల్ని నామినేషన్లపై ఇవ్వవచ్చు. ప్రభుత్వంతో సంప్రదింపులు..ప్రభుత్వ నిర్ణయాల అమలు బాధ్యత. పాలకమండలి నిర్ణయాలు ప్రభుత్వానికి తెలియజేయడం. పాలకమండలిలో ఆమోదించిన బడ్జెట్‌ను ప్రభుత్వానికి నివేదించడం. నిర్ణయాలు తీసుకునే అధికారం మేయర్, పాలకమండలిది కాగా, వాటిని అమలు చేసే బాధ్యత కమిషనర్, అధికారులది. చదవండి: మేయర్ ప్రేమ కథ: ఒప్పించాం.. ఒక్కటయ్యాం -
పంచాయతీ పాలనకు బాబు సర్కార్ వెన్నుపోటు
ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు, ఎంపీలను అన్నిచోట్లా సగౌరవంగా ప్రజా ప్రతినిధులుగా గుర్తిస్తున్నారు. కానీ అదే ప్రజలు ఎన్నుకున్న సర్పంచులు మాత్రం అసలు ప్రజా ప్రతినిధులే కాదన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం జన్మభూమి కమిటీల ద్వారా పోటీ పాలన సాగిస్తూ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మాదిరిగా 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకు కల్పించిన అధికారాలను తన అధికార గర్వంతో అణచివేస్తోంది. బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి తూట్లు పొడుస్తోంది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక ప్రభుత్వాల పాలన çనాలుగేళ్లుగా గాడి తప్పింది. ప్రజలెన్నుకున్న సర్పంచులకు కల్పించిన అధికారాలను జన్మభూమి కమిటీ సభ్యులు అనుభవిస్తున్నారు. గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వకపోగా కేంద్రం నేరుగా ఇచ్చే వాటిని కూడా ఖర్చు పెట్టుకోవడానికి వీల్లేకుండా ట్రెజరీల్లో ఆంక్షలు అమలు చేస్తోంది. జిల్లా, మండల పరిషత్‌లైతే నిధులు లేక కొట్టుమిట్టాడుతున్నాయి. స్థానిక ప్రభుత్వాల పాలనకు జవసత్వాలు కల్పించే రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిన ఏప్రిల్ 24వ తేదీని జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా తూర్పు గోదావరి జిల్లాలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల పరిస్థితి ఎలా దిగజారిందో పరిశీలిద్దాం. సగం ఊర్లకు కార్యదర్శులే లేరు..: రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో పాలన సజావుగా జరగడానికి వీలుగా ఊరికొక గ్రామ కార్యదర్శి కూడా లేరు. రాష్ట్రంలో 12,918 గ్రామ పంచాయతీలుండగా కేవలం 6,014 మంది కార్యదర్శులే పనిచేస్తున్నారు. ఒక్కో కార్యదర్శి నాలుగైదు గ్రామాలకు ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నిన్న మొన్నటిదాకా జిల్లా పంచాయతీ అధికారుల పోస్టులన్నీ ఖాళీగా ఉండగా వారం క్రితం పలువురిని డీపీవోలుగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటికీ రెండు జిల్లాలకు పూర్తిస్థాయి డీపీలు లేరు. మూడు జిల్లాలకు పూర్తిస్థాయి జెడ్పీ సీఈవోలు లేరు. అన్ని జిల్లాల్లో డిప్యూటీ సీఈవో పోస్టులు, ఏవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నిధులు, విధులు కాగితాల్లోనే..: రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్ ఆర్టికల్ 243(జి) ప్రకారం 29 అంశాలకు సంబంధించి నిధులు, విధులు, సిబ్బందిని పంచాయతీరాజ్ వ్యవస్థకు బదలాయించాల్సి ఉన్నా ఉత్తర్వులకే పరిమితమయ్యాయి. ఉదాహరణకు అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ తీసుకుంటే మదర్స్ కమిటీలు పంచాయతీల పర్యవేక్షణలో పనిచేయాలి. నిధులు, సిబ్బంది పంచాయతీల ఆధీనంలోనే ఉండాలి. అయితే ప్రభుత్వం అంగన్వాడీల నిర్వహణకు నిధులు విడుదల చేయలేదు, సిబ్బంది కూడా శిశుసంక్షేమ శాఖ ఆధీనంలోనే పనిచేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఫ్యాన్లు, ఇతర సామాగ్రి కొనుగోలు కోసం పంచాయతీలు ఇంటిపన్ను రూపంలో వసూలు చేసిన నిధులను ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కేరళలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో 40–50 శాతం పంచాయతీరాజ్ వ్యవస్థలకే బదలాయిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. మన రాష్ట్రంలో మాత్రం పంచాయతీ ఉద్యోగులకు చెల్లిస్తున్న జీతాలను లెక్క చూపిస్తూ 10–15 శాతం నిధులను పంచాయతీలకు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. కేంద్ర నిధుల విడుదలపై ఆంక్షలు..: కేంద్రం నేరుగా పంచాయతీలకు విడుదల చేసిన 14 ఆర్థిక సంఘం నిధులతోపాటు స్థానికంగా వసూలయ్యే ఇంటి పన్ను తదితరాలు కలిపి ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ పంచాయతీల పేరుతో రూ.1,400 కోట్లున్నా వీటితో సర్పంచులు అభివృద్ధి పనులు చేపట్టడానికి వీలులేకుండా రాష్ట్ర ప్రభుత్వం ట్రెజరీల్లో అనధికారిక ఆంక్షలు అమలు చేస్తోంది. ఈ ఏడాది జనవరి 25 నుంచి నిధులు విడుదల చేయకుండా సర్పంచులు ఇచ్చే చెక్‌లను వెనక్కి పంపిస్తోంది. గుంటూరు జిల్లా నరసరావుపేట రూరల్ మండలంలో ఒక్క చోటే 56 చెక్కులను అధికారులు ఎలాంటి కారణం చూపకుండా ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారంలో వెనక్కి పంపారు. మూడేళ్లుగా జెడ్పీ, ఎంపీపీలకు నిధుల్లేవ్: జిల్లా, మండల పరిషత్‌లకు మూడేళ్లుగా నిధులు విడుదల కావటం లేదు. గతంలో కేంద్ర ప్రభుత్వం పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్‌లకు వాటాలవారీగా నిధులు ఇచ్చేది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులతో మండల, జిల్లా పరిషత్‌లకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు విడుదల చేయాలని సూచించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా నిధులు విడుదల చేయకపోవటంతో జిల్లా పరిషత్, మండల పరిషత్‌లలో పాలన పూర్తిగా స్తంభించింది. గ్రామాలకు కరెంట్ షాకులు: మైనర్ పంచాయతీల్లో వీధి దీపాల కరెంట్ బిల్లును గతంలో రాష్ట్ర ప్రభుత్వాలే భరించాయి. 2013–14 వరకు ఇదే కొనసాగింది. అయితే చంద్రబాబు అధికారంలోకి రాగానే గ్రామాల్లో వీధి దీపాల కరెంటు బిల్లులు రూ.1,800 కోట్లు పేరుకుపోయాయని, దీన్ని సంబంధిత పంచాయతీలే విద్యుత్ శాఖకు చెల్లించాలని ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది. వెయ్యికే దొరికే ఎల్ఈడీ లైట్‌కు రూ.4,500: నారా లోకేశ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక గ్రామాల్లో వీధి దీపాల సరఫరా, నిర్వహణను బడా ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించారు. ప్రభుత్వ పెద్దలే కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు తీసుకుంటూ మార్కెట్లో ప్రస్తుతం ఒక్కొక్కటి రూ.వెయ్యిలోపు ధరలోనే దొరుకుతున్న ఎల్ఈడీ వీధి దీపానికి పంచాయతీలు ఏటా రూ.450 చొప్పున పదేళ్ల పాటు రూ.4,500 చెల్లించాలని ఆదేశించారు. దీంతో 200 స్తంభాలున్న పంచాయతీలు పదేళ్ల పాటు ప్రతి ఏటా రూ. 90 వేల చొప్పున ప్రైవేట్ కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి వస్తోంది. తాజాగా గ్రామాల్లో మురుగు కాల్వలను శుభ్రం చేసే పనులను కూడా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు అప్పగించాలని కూడా లోకేశ్ యోచిస్తున్నారు. జన్మభూమి కమిటీలదే పెత్తనం: 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక అందరికీ తెలిసేలా సర్పంచుల అధ్యక్షతన గ్రామసభల ద్వారా జరగాలి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక దీన్ని జన్మభూమి కమిటీల ద్వారా చేపడుతున్నారు. స్థానిక సంస్థల తీర్మానాల ద్వారా గుర్తించాల్సిన అభివృద్ధి పనుల్లోనూ జన్మభూమి కమిటీలదే పెత్తనం. -
సీజేఐ అధికారాలపై స్పష్టత ఇవ్వండి
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో జడ్జీలకు కేసుల కేటాయింపు విషయంలో భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)కున్న నిర్వహణ అధికారాలపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ న్యాయవాది శాంతిభూషణ్ సుప్రీంకోర్టులో శుక్రవారం ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలుచేశారు. మాస్టర్ ఆఫ్ రోస్టర్‌గా ఉన్న సీజేఐ ఇతర జడ్జీలకు కేసుల కేటాయింపులో అనుసరిస్తున్న నిబంధనలు, విధివిధానాలపైనా స్పష్టత ఇవ్వాలని కోరారు. శాంతిభూషణ్ తరఫున ఆయన కొడుకు సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ సుప్రీంలో పిల్ వేశారు. సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌కు లేఖ రాసిన ప్రశాంత్.. సీజేఐ నేతృత్వంలోని బెంచ్ ముందుకు ఈ పిల్ విచారణకు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయంగా సున్నితమైన, అధికార/ప్రతిపక్ష పార్టీలకు చెందిన కేసుల్ని నచ్చినవారికి కేటాయిస్తూ సీజేఐ, రిజిస్ట్రార్లు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. పిటిషన్లో సీజేఐ జస్టిస్ మిశ్రాను ప్రతివాదిగా చేర్చారు. సుప్రీంకోర్టులో అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయనీ, సీజేఐ జస్టిస్ దీపక్‌మిశ్రా కేసుల కేటాయింపులో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ నలుగురు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లు జనవరి 12న మీడియా ముందుకొచ్చిన నేపథ్యంలో తాజాగా అదే అంశంపై పిల్ దాఖలుకావడం గమనార్హం. బహుభార్యత్వం కంటే అయోధ్య కేసే ముఖ్యం అయోధ్య–బాబ్రీ మసీదు కేసులో దాఖలైన అన్ని పిటిషన్లను విచారించిన తర్వాతే కేసును విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ సందర్భంగా కోర్టులో ముస్లిం ప్రతినిధుల తరఫున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ వాదనలు విన్పిస్తూ.. ‘ముస్లింలలో ఉన్న బహుభార్యత్వం సమస్య విచారణ కంటే అయోధ్య–బాబ్రీ మసీదు కేసు విచారణ ముఖ్యమైనది. ఈ సమస్య పరిష్కారమవ్వాలని దేశం కోరుకుంటోంది’ అని అన్నారు. తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 27కు వాయిదా వేసింది. -
జలవివాదాలపై కేంద్రం అనూహ్య నిర్ణయం
-
అన్ని జల జగడాలకు ఒకే ట్రిబ్యునల్
శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటుకు కసరత్తు - ప్రత్యేక బెంచ్‌ల(డీఆర్సీ) ఏర్పాటు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం - అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం 1956లో త్వరలో సవరణలు న్యూఢిల్లీ: అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారం తలనొప్పిగా మారడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరితంగా జల జగడాల పరిష్కార లక్ష్యంతో ఒకే శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది. ప్రభుత్వ ఆలోచన అమల్లోకి వస్తే ప్రస్తుత ట్రిబ్యునల్స్ అన్నీ రద్దవుతాయి. శాశ్వత ట్రిబ్యునల్‌తో పాటు అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం, 1956లో సవరణలు చేసి ప్రత్యేక ధర్మాసనాలు(డీఆర్సీ) ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపైనా కేంద్రం సమాలోచనలు చేస్తోంది. రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి అవసరమున్నప్పుడల్లా ఈ బెంచ్‌ల్ని ఏర్పాటు చేస్తారు. వివాదం ముగిశాక బెంచ్ దానంతటదే రద్దవుతుంది. జల వివాదాల చట్టంలో సవరణలు చేయాలన్న ప్రతిపాదనలను గత వారం కేంద్ర కేబినెట్ ఆమోదించింది. పార్లమెంట్ తదుపరి సమావేశాల్లో సవరణల బిల్లును తెచ్చే అవకాశముంది. తలనొప్పిగా మారిన జలవివాదాలు ఇటీవల కావేరి నదీ జలాల కోసం తమిళనాడు, కర్ణాటకలు, మహదాయి నదీ జలాల కోసం గోవా–కర్ణాటక–మహారాష్ట్రలు పోట్లాడుకున్నాయి. కావేరి జగడంతో వందల కోట్ల ఆస్తులకు నష్టం వాటిల్లింది. ఇక కృష్ణా జలాల కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకల మధ్య, మహానది నీటి కోసం ఒడిశా, చత్తీస్‌గఢ్‌ల మధ్య తగువులాట కొనసాగుతుంది. వీటికి పరిష్కారం కనుగొనేందుకు శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటు సముచితమని కేంద్రం భావిస్తోంది. మూడేళ్లలో తుది తీర్పు.. ‘వివాదాల పరిష్కారం కోసం సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి చైర్‌పర్సన్‌గా శాశ్వత ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తారు. అవసరమున్నప్పుడు ప్రత్యేక ధర్మాసనాలను నియమిస్తారు. ఒకసారి వివాదం పరిష్కారమైతే బెంచ్ కాలపరిమితి ముగుస్తుంది’ అని కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి శశిశేఖర్ తెలిపారు. జల జగడాలపై తుది తీర్పు ఇచ్చేందుకు నదీ జలాల ట్రిబ్యునల్స్‌కు ఏళ్ల సమయం పడుతుందని, ప్రతిపాదిత ట్రిబ్యునల్ మూడేళ్లలో తీర్పును వెలువరించగలదని అన్నారు. ట్రిబ్యునల్ ఏర్పాటుతో పాటు వివాద పరిష్కార కమిటీ(డీఆర్సీ) ఏర్పాటు కోసం చట్టంలో సవరణలు చేస్తారన్నారు. డీఆర్సీలో నిపుణులు, విధాన రూపకర్తలు సభ్యులుగా ఉంటారని, ట్రిబ్యునల్ ముందుకు వచ్చిన వివాదాల పరిష్కారం కోసం వీటిని ఏర్పాటు చేస్తారని తెలిపారు. ‘ఎప్పుడైనా ఏదైనా రాష్ట్రం విజ్ఞప్తి మేరకు డీఆర్సీని ఏర్పాటు చేస్తారు. చాలా వివాదాలు డీఆర్సీ స్థాయిలోనే పరిష్కారం అవుతాయని ఆశాభావంతో ఉన్నాం. ఒకవేళ తీర్పు పట్ల రాష్ట్రం సంతృప్తి చెందకపోతే శాశ్వత ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చు’ అని శేఖర్ వెల్లడించారు. ఒకసారి తీర్పు ఇస్తే వెంటనే అమల్లోకి.. ట్రిబ్యునల్‌కు మరిన్ని అధికారాలు కట్టబెట్టేందుకు.. ఏదైనా వివాదంపై ఆదేశాలు ఇచ్చిన వెంటనే తీర్పు అధికారికంగా అమలయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంతవరకూ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుల్ని ప్రభుత్వం ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సి వచ్చేది. దీంతో అమలులో జాప్యం జరుగుతోంది. ప్రస్తుత చట్ట ప్రకారం జల వివాదంపై కేంద్రాన్ని రాష్ట్రం ఆశ్రయిస్తే... ట్రిబ్యునల్ ఏర్పాటు అవసరముందని సంతృప్తి చెందితేనే కేంద్రం ఆ దిశగా చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం దేశంలో అంతరాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి 8 ట్రిబ్యునల్స్ ఉన్నాయి. కృష్ణా, గోదావరి, కావేరి, బియాస్ తదితర నదుల జల జగడాల పరిష్కారం కోసం వీటిని ఏర్పాటు చేశారు. జలవివాదాలపై కేంద్రానికే అధికారాలు రాజ్యాంగం 7వ షెడ్యూల్ (ఆర్టికల్ 246), రాష్ట్రాల జాబితా–2, ఎంట్రీ నంబర్ 17 ప్రకారం నీటి సరఫరా, కాలువలు, డ్రైనేజీలు, నీటి నిల్వ, నీటిగట్టులు, జలవిద్యుత్‌పై అధికారాలు రాష్ట్రాలదే.. అంతరాష్ట్ర జల వివాదాల సమయంలో అధికారం ఆర్టికల్ 262 మేరకు కేంద్రానికి అధికారాలు ఇచ్చారు. రాష్ట్రాల పునర్విభజనలో భాగంగా ఆర్టికల్ 262 ప్రకారం అంతరాష్ట్ర జల వివాదాల చట్టం 1956ను పార్లమెంటు రూపొందించింది. -
ఫిరాయింపులపై చర్యల అధికారం ఈసీకే ఇవ్వాలి
►ఆ విధంగా తక్షణమే రాజ్యాంగ సవరణ చేయాలి ►న్యాయ నిపుణులు, రాజకీయ, సామాజికవేత్తల సూచన ►ఫిరాయించిన వారిని స్పీకర్లు కాపాడుతున్నారు ►పార్టీల ఫిరాయింపులు-స్పీకర్ పాత్ర అనే అంశంపై చర్చ హైదరాబాద్: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎంపీలపై అనర్హత వేటు వేసే అధికారాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు అప్పగించాలని న్యాయ నిపుణులు, రాజకీయ, సామాజికవేత్తలు ముక్తకంఠంతో కోరారు. దేశ రాజకీయాల్లో పెట్రేగిపోతున్న పార్టీ ఫిరాయింపులు అత్యంత ఆందోళన కలిగిస్తున్నాయని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని మంటగలుపుతున్నాయన్నారు. అధికారంలోని పార్టీలు విపక్ష పార్టీల సభ్యులను గంపగుత్తగా కొనుగోలు చేస్తున్నాయని ..విపక్షాలు లేని చట్ట సభ ఫాసిస్టు వ్యవస్థతో సమానమని అభిప్రాయపడ్డారు. ఏ రాజకీయపార్టీతో సంబంధం లేకుండా స్వతంత్ర వ్యక్తులుగా ఉండాల్సిన స్పీకర్లు అధికార పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్షాల నుంచి అధికార పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎంపీలపై అనర్హత వేటు వేయకుండా కాపాడుతున్నారన్నారు. ‘పార్టీల ఫిరాయింపులు-స్పీకర్ పాత్ర’ అనే అంశంపై ఆదివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానభవన్‌లో నిర్వహించిన సదస్సులో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ బీపీ జీవన్‌రెడ్డి, జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి, హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి, జస్టిస్ బి.శేషశయనా రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్‌రెడ్డి, లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ, సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడారు. ఫిరాయిస్తేనే అనర్హులు కావాలి ఓ పార్టీ తరఫున గెలిచి మరో పార్టీలోకి ఫిరాయిస్తే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆటోమెటిక్‌గా అనర్హులు కావాలి. ఆ మేరకు రాజ్యాంగ సవరణచేపట్టాలి. - జస్టిస్ బి.శేషశయనారెడ్డి స్పీకర్‌కు అసాధారణ అధికారాలతో సమస్యలు అసాధారణ నిర్ణయాధికారాలను స్పీకర్‌కు కట్టబెట్టడం వల్ల వారి నిర్ణయాలు రాజకీయ సంక్షోభాలు, వివాదాలను రేకెత్తిస్తున్నాయి. భవిష్యత్తులో 300 మంది స్వతంత్ర సభ్యులు లోక్‌సభకు ఎన్నికైతే పరిస్థితి ఏమిటి? ఒక వేళ 10 కన్నా తక్కువ సీట్లను 50 పార్టీలు గెలుచుకుంటే దేశంలో చెలరేగే అల్లకల్లోలం గురించి ఆలోచించాలి. ఇలాంటి సందర్భాల్లో స్పీకర్లు తీసుకునే నిర్ణయాలు సమస్యను మరింత జఠిలం చేస్తాయి. స్పీకర్లు పక్షపాతంతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల కమిషన్ సిఫారసుతో ఫిరాయించిన సభ్యులపై అనర్హత వేటు వేసే అధికారాన్ని రాష్ట్రపతి, గవర్నర్లకు కల్పించడమే పరిష్కార మార్గం. - జస్టిస్ జీవన్ రెడ్డి ఫిరాయింపుల భూతం పట్టుకుంది ప్రజాస్వామ్యానికి పార్టీ ఫిరాయింపుల భూతం పట్టుకుంది. ఫిరాయింపులతో ప్రజాస్వామ్య పునాదులు బలహీనంగా మారుతున్నాయి. ఈ గందరగోళానికి రాజ్యాంగ పరిధిలోనే పరిష్కారాన్ని కనుగొనాలి. ఎన్నికల కమిషన్ సిఫారసు మేరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎంపీలపై అనర్హత వేటు వేసే అధికారం రాష్ట్రపతి, గవర్నర్లకు కట్టబెట్టే విధంగా రాజ్యాంగ సవరణ జరపాలి. స్పీకర్లు అధికార పార్టీలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణీత గడువులోగా చర్యలు తీసుకోవాలని, లేకుంటే తామే నిర్ణయం తీసుకుంటామని కోర్టులు ఆదేశించే విధంగా చట్ట సవరణ జరగాలి. - జస్టిస్ సుదర్శన్‌రెడ్డి రాజీనామాలు ఆమోదించడం లేదు ఈ మధ్య కాలంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎక్కడా స్పీకర్లు అనర్హత వేటు వేసిన దాఖలాలు లేవు. ఒక వేళ ఫిరాయింపుదారులు రాజీనామా చేసినా స్పీకర్లు ఆమోదించడం లేదు. ఫిరాయింపుదాలరుపై అనర్హత వేటు వేసే అధికారం ఎన్నికల సంఘానికి ఇవ్వాలి. అవిశ్వాస, విశ్వాస తీర్మానాలు, బడ్జెట్ ఆమోదం సమయంలోనే విప్‌ను పరిమితం చేయాలి. సీఎంలను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలి. అప్పుడే రాజకీయాల్లో కొత్త ఒరవడి వస్తుంది. -జేపీ చర్యలెవరు తీసుకోవాలి? టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌కు తీసుకెళితే.. మంత్రిగా తలసానితో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ విషయంలో తప్పు సీఎందా? గవర్నర్‌దా?. తలసాని ఈ రోజు కూడా టీడీపీ ఎమ్మెల్యేనే. ఈ విషయంలో ఎవరిపై ఎవరు చర్యలు తీసుకోవాలి? - కె.రామచంద్రమూర్తి లా కమిషన్ సిఫారసులు అమలు చేయాలి ఈసీ సిఫారసు మేరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎంపీలపై అనర్హత వేటు వేసే అధికారాన్ని రాష్ట్రపతి, గవర్నర్‌కు అప్పగించాలని లా కమిషన్ చేసిన సిఫారసులను అమలు చేయాలి. ఇందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 102(3) సైతం అనుకూలంగా ఉంది. - జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి అప్పట్లోనే వ్యతిరేకించాను పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని 1985 లో మురార్జీ దేశాయ్ ప్రభుత్వం తీసుకొస్తే ప్రతిపక్షంలో ఉండి కూడా నేను సమర్థించాను. అనర్హత వేటు వేసే అధికారాన్ని స్పీకర్‌కు కట్టబెట్టడం పెద్ద లొసుగుగా మారుతుందని అప్పట్లోనే నేను వ్యతిరేకించాను. - జైపాల్‌రెడ్డి -
వైద్య శాఖ ఆర్డీల అధికారాలకు కత్తెర!
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్యశాఖ ప్రాంతీయ సంచాలకుల (ఆర్డీ) అధికారాలను కత్తిరించాలని ఆ శాఖ యోచిస్తోంది. అందులో భాగంగా వరంగల్, హైదరాబాద్ ఆర్డీ కార్యాలయాలను పూర్తిగా ఎత్తివేయాలని భావిస్తున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. ఈ రెండు ఆర్డీ కార్యాలయాలు అవినీతి, అక్రమాలకు కేంద్ర బిందువులుగా ఉన్నాయన్న విమర్శలు... బదిలీలు, నియామకాలు, పదోన్నతుల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో వైద్యశాఖ ఈ ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. ఆర్డీ కార్యాలయాల ఎత్తివేత, ఆర్డీల అధికారాల కత్తిరింపునకు సంబంధించి ప్రతిపాదనలు కూడా సిద్ధమైనట్లు తెలిసింది. దీనిపై వీలైనంత త్వరలో తుది నిర్ణయం తీసుకుని కార్యాలయాలను ఎత్తివేయనున్నారని సమాచారం. ఆర్డీ కార్యాలయాలను హైదరాబాద్ కోఠిలోని ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయంలో కలిపేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆర్డీలను ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో అదనపు సంచాలకులుగా నియమించి వారి సేవలను ఉపయోగించుకుంటారు. ఇక ఆర్డీ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందిని అవసరాన్ని బట్టి స్థానికంగా సర్దుబాటు చేయడంతోపాటు... అందులో కొందరిని హైదరాబాద్ ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయంలోకి తీసుకొస్తారని అంటున్నారు. ఆరోగ్య ఉప జిల్లాలపై యోచన .. ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు రాష్ట్రవ్యాప్తంగా ఐదు ఆర్డీ కార్యాలయాలు ఉండగా, రాష్ట్రం విడిపోయాక మూడు ఆంధ్రకు, రెండు తెలంగాణకు ఉండిపోయాయి. గతంలో అధికార వికేంద్రీకరణ కోసం వీటిని ఏర్పాటు చేశారు. కొన్ని జిల్లాలతో కలిపి ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేసి, ఆర్డీలకు పూర్తిస్థాయి అధికారాలు కల్పించారు. దీని ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. పీహెచ్‌సీలు మొదలు జిల్లా ఆసుపత్రుల వరకు అన్నీ ఆర్డీ పరిధిలో ఉన్నాయి. నియామకాలు, పదోన్నతులు, డిప్యూటేషన్లు చేసే అధికారాలు కూడా ఆర్డీలకున్నాయి. అపరిమితమైన అధికారాలు ఉండడంతో ఆర్డీ కార్యాలయ అధికారులు వాటిని అవినీతి, అక్రమాలకు నెలవుగా మార్చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా రాష్ట్రం చిన్నదైపోయినందున ఆర్డీ కార్యాలయాలను ఎందుకు కొనసాగించాలన్న ఆలోచన కూడా సర్కారు దృష్టిలో ఉంది. ఇదిలా ఉంటే ఆర్డీ వ్యవస్థను తొలగించి... ఆరోగ్య ఉప జిల్లాలను ఏర్పాటు చేయడం వల్ల జిల్లాల ద్వారానే పని వికేంద్రీకరణ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఒక్కో జిల్లాను రెండు.. మూడు ఆరోగ్య ఉప జిల్లాలుగా ఏర్పాటు చేసి వాటికి ప్రత్యేకంగా ఒక వైద్యాధికారిని నియమించడం ద్వారా మరింత వికేంద్రీకరణ చేయాలన్న ఆలోచనలో సర్కారు ఉంది. దీంతో పరిపాలనా పరమైన జిల్లాను యూనిట్‌గా కాకుండా ఆరోగ్య ఉప జిల్లానే యూనిట్‌గా తీసుకొని వైద్య సేవలను విస్తరించాలని సర్కారు భావిస్తోంది. తద్వారా కిందిస్థాయిలో రోగులకు వైద్య సేవలు మెరుగ్గా అందుతాయని అంటున్నారు. -
మా అధికారాలు మాకివ్వండి: జెడ్పీటీసీలు
నల్లగొండ : జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యుల హక్కులు, అధికారాలు తిరిగి కల్పించాలని తెలంగాణ జెడ్పీటీసీల ఫోరం డిమాండ్ చేసింది. నిధులు, విధులకు సంబంధించి గతంలో ఉన్న విధంగా అన్ని రకాల అధికారాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సోమవారం నల్లగొండలో జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీటీసీల ఫోరం సమావేశం నిర్వహించింది. ఫోరం అధ్యక్షుడు మందడి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు కోయ హేమా జీ, ప్రధానకార్యదర్శి ప్రభాకర్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 14వ ఆర్థిక సంఘం నిధులు జిల్లా పరిషత్‌కు కేటాయించి జెడ్పీలు ఆర్థిక పరిపుష్టిసాధించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఆర్ఆర్ఎం నిధులకు పేరు మార్చి ఎమ్మెల్యేలకు, మంత్రులకు కేటాయించిన ఏఆర్ఆర్ నిధులను తిరిగి జెడ్పీటీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రత్యేక గది, ప్రొటోకాల్‌లో ప్రాధాన్యత, ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు గెజిటెడ్ హోదా, మండల స్థాయిలో ఉండే ఆహార సలహా సంఘం కమిటీ, వైద్య కమిటీల్లో జెడ్పీటీసీలకు ఉపాధ్యక్ష హోదా కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. 73,74 రాజ్యాంగ సవరణ ప్రకారం స్థానిక సంస్థలకు 23 అధికారాలు కల్పించాల్సి ఉండగా ప్రస్తుతం 11 అధికారాలు మాత్రమే బదలాయించారని, మిగిలిన అధికారులను కూడా స్థానిక సంస్థలకు బదలాయించాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 7న చలోహైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు హేమాజీ తెలిపారు. ఇందిరా పార్కు వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని జెడ్పీటీసీలు తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. -
ఎగవేత కంపెనీలపై బ్యాంకులకు మరిన్ని అధికారాలు
న్యూఢిల్లీ: రుణాలు ఎగ్గొట్టిన సంస్థల విషయంలో కఠినంగా వ్యవహరించేలా బ్యాంకులకు మరిన్ని అధికారాలు కట్టబెట్టింది రిజర్వ్ బ్యాంక్. ఒకవేళ రుణ పునర్వ్యవస్థీకరణ చేసినప్పటికీ నిర్దిష్ట కాలంలో సదరు కంపెనీ గట్టెక్కని పక్షంలో దానికి ఇచ్చిన అప్పును ఈక్విటీ కింద మార్చుకునేందుకు బ్యాంకులకు అనుమతినిచ్చింది. తద్వారా రుణ భారం గల కంపెనీలను బ్యాంకులు తమ అజమాయిషీలోకి తెచ్చుకునేందుకు వీలు కల్పిస్తూ ఆర్బీఐ నోటిఫికేషన్ జారీ చేసింది. బ్యాంకులు రుణ పునర్వ్యవస్థీకరణ చేసినా కూడా నిర్వహణపరమైన అసమర్థత వల్ల పలు కంపెనీలు నిలదొక్కుకోవడం లేదన్న సంగతి తమ దృష్టికి వచ్చినట్లు ఆర్బీఐ పేర్కొంది. ఇలాంటి సందర్భాల్లో యాజమాన్యాన్ని మారుస్తూ వ్యూహా త్మక రుణ పునర్వ్యవస్థీకరణకు (ఎస్డీఆర్) ప్రాధాన్యమివ్వొచ్చని తెలిపింది. సదరు సంస్థకు రుణమిచ్చిన బ్యాంకుల ఫోరం (జేఎల్ఎఫ్) దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. ఇందుకోసం ప్రాథమిక స్థాయిలో రీస్ట్రక్చరింగ్ చేసేటప్పుడే .. నిర్దిష్ట లక్ష్యాలను సాధించని పక్షంలో బాకీ మొత్తాన్ని కంపెనీలో వాటాల కింద మార్చుకునేలా నిబంధనను బ్యాం కులు పొందుపర్చాలని ఆర్బీఐ తెలిపింది. దీనికి సదరు కంపెనీ షేర్ హోల్డర్ల నుంచి అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుందని సూచించింది. ఇలాంటి ఎస్‌డీఆర్‌కు అనుమతులు లేకపోతే రుణ పునర్వ్యవస్థీకరణకు గ్రీన్ సిగ్నల్ ఉండబోదని పేర్కొంది. -
నేడు ఏపీ కేబినెట్ సమావేశం
-
కమిషనర్‌కే సర్వాధికారాలు
సీఆర్డీఏ కమిషనర్‌కు విశేషాధికారాలు కల్పించిన ఏపీ ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: నూతన రాజధాని ప్రాంతం లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ కమిషనర్‌కు విశేష అధికారాలను కల్పించారు. ఈ మేరకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ బిల్లులో తగిన సెక్షన్లను పొందుపరిచారు. కమిషనర్ తీసుకునే నిర్ణయాలు, జారీ చేసే ఉత్తర్వులపై ఎవరూ కూడా ఏ న్యాయస్థానంలోను అప్పీల్ చేయరాదని బిల్లులో పేర్కొన్నారు. కమిషనర్‌పై ఏదైనా దావా, అప్పీలు, దరఖాస్తు లేదా నిషేధాజ్ఞ లేదా ఏదేని సహాయమునకై ఏ న్యాయస్థానం స్వీకరించరాదని బిల్లులో పేర్కొన్నారు. ప్రాధికార సంస్థ కమిషనర్ అనుమతి లేనిదే రాజధాని ప్రాంతంలో ఏదీ చేయరాదు. సొంత గృహాల్లోగానీ, భవనాల్లో గానీ ఎటువంటి మార్పులు చేయరాదు. సొంత భూమిలో సైతం ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టరాదు. రాజధాని ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి పనులకు అనుమతించే అధికారం స్థానిక సంస్థలు గానీ ఇతర ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీలకు ఉండదని స్పష్టం చేశారు. కమిషనర్ అనుమతికి విరుద్ధంగా ఎవరైనా అభివృద్ధి పనులను చేపడితే మూడేళ్లపాటు జైలు శిక్షతో పాటు ఆ భూమి విలువలో 20 శాతం జరిమానా విధించనున్నట్లు బిల్లులో పేర్కొన్నారు. అయితే ఏదైనా భవనం, భూమిలో మార్పు లేకుండా నిర్వహణ పనులను కమిషనర్‌కు రాతపూర్వకంగా తెలియజేసి చేసుకోవచ్చు. అలాగే వ్యవసాయ అవసరాలకు బావులు, బోర్లు, అలాగే మెటల్ లేని రోడ్లు నిర్మాణాలను కమిషనర్‌కు రాతపూర్వకంగా తెలియజేసి చేసుకోవచ్చు. చట్టం ప్రకారం నిర్ధారించిన వ్యక్తిని భూమి, భవనాల్లోకి అనుమతించకుండా అడ్డంకులు సృష్టిస్తే అలాంటి వారికి ఆరు నెలల పాటు జైలు శిక్షతో పాటు పది వేల రూపాయలు జరిమానా విధించనున్నారు. అనధికారిక నిర్మాణాల పనులను నిలుపుదల లేదా సీల్ చేసే అధికారం కమిషనర్‌కు అప్పగించారు. ఏదైనా నిర్మాణం తొలగించినా సంబంధిత వ్యక్తి ఎటువంటి పరిహారం కోరరాదు. కమిషనర్ ఆదేశాలిచ్చిన పక్షం రోజుల్లోగా ఏర్పాటు చేసే ట్రిబ్యునల్‌కు మాత్రమే అప్పీల్ చేసుకోవాలి. కమిషనర్ ఇచ్చిన ఆదేశాలపై కోర్టులు ఎటువంటి సూట్, అప్పీల్స్‌ను పరిగణనలోకి తీసుకోరాదు. కమిషనర్ ఆదేశాలే సుప్రీంగా ఉండేందుకే కోర్టుల జోక్యం లేకుండా చట్టంలో సెక్షన్లను పొందుపరిచారు. ట్రిబ్యునల్ చైర్మన్‌గా జిల్లా జడ్జి లేదా సిటీ సివిల్ కోర్టు జడ్జిగా ఉన్న లేక పదవీ విరమణ చేసిన వ్యక్తిని నియమిస్తారు. మరో ఇద్దరిని సభ్యులుగా నియమిస్తారు. -
‘ఎర్ర’ స్మగ్లర్లపై ‘టాస్క్‘ఫోర్స్’
ఎర్రచందనం అక్రమ రవాణాకు పూర్తిగా అడ్డుకట్ట వేసే యత్నం స్మగ్లర్లపై కేసు నమోదు, దర్యాప్తు అధికారాలు కూడా టాస్క్‌ఫోర్స్‌కే వారం రోజుల్లో వెలువడనున్న జీవో అటవీ చట్టం సవరణ.. అవసరమైతే ఆర్డినెన్స్ జారీకి యత్నాలు సాక్షి, హైదరాబాద్: ఎర్రచందనం అక్రమ రవాణాకు పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర పోలీసు, అటవీ శాఖలు ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌కు కేసుల నమోదు అధికారాన్ని కూడా ఇవ్వనున్నారు. ఎర్ర చందనం అక్రమ రవాణా కేసుల్లో ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) జారీ చేసి దర్యాప్తు చేపట్టి, కోర్టులో అభియోగపత్రాలు సైతం దాఖలు చేసే బాధ్యతలు కూడా ఈ టాస్క్‌ఫోర్స్‌కే అప్పజెప్పనున్నారు. ప్రత్యేక విధుల కోసం ఏర్పాటు చేసే టాస్క్‌ఫోర్స్‌కు కేసుల నమోదు అధికారం ఇవ్వడం ఇదే తొలిసారి. హైదరాబాద్, సైబరాబాద్, విజయవాడ, విశాఖపట్నం కమిషనరేట్లలో టాస్క్‌ఫోర్స్‌లు ఉన్నాయి. వీటికి కేసులు నమోదు చేసే అధికారం లేదు. కేవలం అసాంఘిక శక్తులు, నేరగాళ్లపై నిఘావేయడం, వారి కార్యకలాపాలను నిరోధించడం వీటి ప్రధాన విధి. అవసరమైతే దాడులు చేసి నేరస్తులను అదుపులోకి తీసుకోవడం వీటి బాధ్యత. అదుపులోకి తీసుకున్న నిందితులను సంబంధిత పోలీసులకు అప్పజెప్పడంతో వీటి విధులు ముగుస్తాయి. నిందితుపై కేసుల నమోదు, అరెస్టు, దర్యాప్తు, ఇతరత్రా వ్యవహారాలన్నీ పోలీసులే చేపడతారు. దీనివల్ల నేరగాళ్లపై ఆరోపణలు రుజువుకావడంలేదు. దీంతో ఎర్రచందనం స్మగ్లర్ల ఆటకట్టించడానికి ఏర్పాటు చేస్తున్న టాస్క్‌ఫోర్స్‌కు అక్రమ రవాణా నిరోధమే కాకుండా, స్మగ్లర్లను పట్టుకోవడం, కేసుల నమోదు, దర్యాప్తు అధికారాలనూ ఇస్తున్నారు. ఆధారాలను సేకరించి, న్యాయస్థానాల్లో అభియోగపత్రాలను సైతం టాస్క్‌ఫోర్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల స్మగ్లర్ల కట్టడితో పాటు వారిపై నేరాల్ని నిరూపించవచ్చని ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఈ మేరకు పలు కీలకాంశాలతో కూడిన ప్రతిపాదనల్ని రాష్ట్ర పోలీసు విభాగం ప్రభుత్వానికి పంపింది. దీనిపై సర్కారు వారం రోజుల్లో జీవో జారీ చేసే అవకాశం ఉందని ఉన్నతాధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించిన బిల్లును పోలీసు విభాగం న్యాయ శాఖకు పంపింది. టాస్క్‌ఫోర్స్‌కు కేసుల నమోదు అధికారం ఇవ్వడానికి అటవీ చట్టం సవరణ అంశాన్ని కూడా పోలీసు ఉన్నతాధికారులు న్యాయశాఖకు పంపిన బిల్లులో పొందుపరిచారు. శీతాకాల సమావేశంలో ఇది చట్టంగా మారే అవకాశం ఉంది. ఈ బిల్లు చట్టంగా మారడానికి ఎక్కువ సమయం పట్టే పక్షంలో ఆర్డినెన్స్ జారీ చేయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. తిరుపతి కేంద్రంగా ఏర్పాటు చేయనున్న ఈ టాస్క్‌ఫోర్స్‌కు డీఐజీ స్థాయి అధికారి నేతృత్వం వహించనున్నారు. పోలీసు, అటవీ శాఖలకు చెందిన దాదాపు రెండు వేల మంది సిబ్బందిని దీనికి కేటాయించనున్నారు. పెద్ద మొత్తంలో సిబ్బంది ఉండటం వల్ల కేసుల దర్యాప్తు పెద్ద కష్టం కాబోదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
పరిహారం పంపిణీ పర్యవేక్షణాధికారం జన్మభూమి కమిటీలకు పై చర్చ
-
పరిహారం పంపిణీ పర్యవేక్షణాధికారం జన్మభూమి కమిటీలకు
-
ఉత్సవ విగ్రహాలు
అధికారాలు, విధులు లేవు ఎంపీపీ, జెడ్పీ చైర్మన్లను ఎన్నుకోవడానికే సమావేశాల కోసమే ఎంపీటీసీ, జెడ్పీటీసీలు గ్రామీణాభివృద్ధిలో వీరి పాత్ర నామమాత్రం. చేతికి ఆరోవేలు వంటివారు. అధికారాలు, బాధ్యతలు, విధులు లేని పదవులు ఇవి. కేవలం ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్లను ఎన్నుకోవడం, మండల, జెడ్పీ సమావేశాలకు హాజరు కావడం మినహా అధికారికంగా నిర్వహించే విధులేమిటో చట్టంలో పేర్కొనలేదు. మండల, జిల్లా పరిషత్ విధుల్లోనూ వీరికి కనీసం పర్యవేక్షణ అవకాశం కూడా లేదు. కార్యాలయాల్లో కూర్చోవడానికి కనీసం కుర్చీ కూడా లేదు. కోటి ఆశలతో కోట్లు వెచ్చించి గెలిచిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ప్రస్తుతం ఉత్సవ విగ్రహాల్లా మారారు. విశాఖ రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏవేవో వాగ్ధానాలు చేశారు. ఎన్నికల్లో కోట్లు ఖర్చు చేసి గెలిచారు. రెట్టింపు సంపాదించవచ్చని భావించారు. గెలిచాక చేతిలో చిల్లిగవ్వ లేదు. జిల్లా పరిషత్‌లో ఉన్న నిధుల గురించి తెలిశాక వారికి కంటిమీద కునుకులేదు. హామీల మేరకు మండలాల్లో ఏ పనులు చేపట్టాలో తెలియక జిల్లాలోని 39 జెడ్పీటీసీ, 656 ఎంపీటీసీ సభ్యుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిం ది. వీరి కంటే సర్పంచ్ల పరిస్థితే నయం. పంచాయతీ కార్యాలయం,నిధులు, అధికారాలు ఇలా అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. కానీ జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు అవేవి లేక ఉత్సవ విగ్రహాల్లా మారారు. జెడ్పీలో కోట్లకు కోట్లు బడ్జెట్ ఉంటుందని ఆశించిన జెడ్పీటీసీలు అభివృద్ధి కార్యక్రమాలకే సరిపడని నిధులున్నట్లు తెలుసుకొని విస్తుపోతున్నారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను ఏ విధంగా నెరవేర్చాలో తెలి యక, ప్రజల మధ్యకు వెళ్లలేక కిందామీదా పడుతున్నారు. అధికారదాహంతో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎంపీటీసీల పరిస్థి తి మరింత దయనీయంగా మారింది. అటువంటి వారిపై అనర్హత వేటుపడడం ఉన్న పదవీ పోయి.. ఎన్నికల్లో చేసిన ఖర్చు తిరిగి సంపాదించుకునే అవకాశం లేక.. దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అధికార పార్టీ సభ్యులుసైతం వారిని పట్టించుకోకపోవడంతో రెంటికీ చెడ్డ రేవడిలా మారారు. జెడ్పీలో రూ.12 కోట్లు నిధులు జిల్లా పరిషత్‌లో ప్రస్తుతం రూ.12 కోట్లు నిధులున్నాయి. 13వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.4.5 కోట్లు, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రూ.1.5 కోట్లు, సాధారణ నిధులు రూ.5 కోట్లు ఇటీవలే విడుదలయ్యాయి. వీటితో పాటు తలసరి నిధుల కింద మరో రూ.కోటి వరకు వ చ్చింది. ఇంతకు మించి జిల్లా పరిషత్‌కు ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు వచ్చే అవకాశాలు లేవు. వీటిలో రూ.కోటి వరకు గ్రామీణప్రాంతాల్లో తాగునీటి సరఫరా కోసం వినియోగిస్తున్నారు. ఆందోళనలో సభ్యులు జెడ్పీటీసీ సభ్యుడు నిర్వహించే విధులు, బాధ్యతలు స్పష్టం చేయలేదు. మండల పరిషత్‌లలో వీరికి స్థానమే లేదు. ఎంపీపీకి ఓ కార్యాలయం ఉంటుంది. ప్రజల ఓట్లతో నేరుగా ఎన్నికయ్యే జెడ్పీటీసీలకు ఎటువంటి కార్యాలయం ఉండదు. ఎంపీపీ, జెడ్పీటీసీలు వేర్వేరు పార్టీలకు చెందిన వారైనప్పుడు ప్రొటోకాల్ వివాదాలు ఉంటాయి. ఒకప్పుడు జిల్లా ప్రణాళిక కమిటీలు ఉండేవి. వాటిల్లో జెడ్పీటీసీలు సభ్యులుగా ఉండేవారు. నిధుల వ్యయం, తదితర అంశాలపై కొంత అజమాయిషీ సాగేది. ఇప్పుడు ఈ కమిటీలను పూర్తిగా నిర్వీర్యం చేసి జిల్లాఅభివృద్ధి సమీక్ష మండలి(డీడీఆర్సీ)తో పెత్తనం కొనసాగిస్తున్నారు. మండల స్థాయిలోనూ ఎమ్మెల్యేల హవా ఎక్కువగా ఉంటోంది. ఇటు అధికారాలు లేక.. సంపాదించుకొనే మార్గాలు కానరాక జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు బొమ్మలుగా మారిపోయారు. -
కేంద్రం నిర్ణయం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం
గవర్నర్‌కు అధికారాలపై నిరసనల వెల్లువ అసెంబ్లీ ఎదుట నేతల దిష్టిబొమ్మలు దహనం చేసిన లాయర్ల జేఎసీ హైదరాబాద్: సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం హైదరాబాద్‌పై గవర్నర్‌కు విశేష అధికారాలు కట్టబెడుతోందని తెలంగాణ అడ్వొకేట్స్ జేఏసీ విమర్శించింది. కేంద్రం తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం నాంపల్లిలోని అసెంబ్లీ ఎదురుగా ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు దిష్టిబొమ్మలను దగ్ధం చేసింది. ఈ సందర్భంగా జేఏసీ కో కన్వీనర్ గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో తెలంగాణకూడా అంతర్భాగమని ప్రధాని గుర్తించాలన్నారు. ఆ పాలన వెనక్కి తీసుకోవాలి: సీపీఎం కేంద్రం అప్రజాస్వామిక పద్ధతుల్లో తీసుకున్న గవర్నర్ పాలన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు సలహాలతో తెలంగాణపై కేంద్రం నిర్ణయాలు చేయడం అత్యంత అప్రజాస్వామికమని ఆ పార్టీ తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. హక్కులను హరించడమే..: సీపీఐ గవర్నర్‌కు అధికారాలు అప్పగిస్తూ జారీచేసిన మార్గదర్శకాలు తెలంగాణ ప్రభుత్వ హక్కులను హరించేలా, అభ్యంతరకరంగా ఉందని సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ఇది ప్రభుత్వం చేతులు,కాళ్లు కట్టివేయడమేనన్నారు. ‘నాయుడుల’ కుట్రే: కోదండరాం మెదక్: గవర్నర్‌కు హైదరాబాద్ శాంతిభద్రతల అధికారాల అప్పగింత వెనక చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడుల కుట్ర ఉందని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. శనివారం మెదక్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. బాబుది నీచ మనస్తత్వం: హరీశ్ సంగారెడ్డి (మెదక్): గవర్నర్‌కు హైదరాబాద్ శాంతిభద్రతల అధికారాల అప్పగింత వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కుట్ర దాగి ఉందని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. పక్కవారు చెడిపోవాలనే నీచ మనస్తత్వం చంద్రబాబుదని ఆరోపించారు. మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. లోపాలను కప్పిపుచ్చుతున్న సీఎం: పొన్నం శాంతి,భద్రతల విషయంలో గవర్నర్‌కు అధికారాలను అప్పగించారన్న ముసుగులో.. సీఎం కేసీఆర్ తన లోపాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గవర్నర్‌కు అధికారాల నెపంతో సీఎం తన బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చిన్నచిన్న అంశాలపై గిల్లికజ్జాలు సరికాదన్నారు. గవర్నర్ జోక్యంతో గందరగోళం : వీహెచ్ రోజువారీ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం చేసుకుంటే.. ప్రజల్లో గందరగోళం ఏర్పడి, ప్రశాంత వాతావరణం దె బ్బతింటుందని కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి సీఎం ఉండగా మళ్లీ శాంతిభద్రతల అంశం గవర్నర్‌కు కట్టబెడితే, సీఎం, హోంమంత్రి ఏం చేయాలని ప్రశ్నించారు. ఉద్యమిస్తాం: వేణుగోపాలాచారి బెల్లంపల్లి (అదిలాబాద్): గవర్నర్‌కు కేంద్రం అధికారాలను కట్టబెడితే ఉద్యమం చేపడతామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి ఎస్.వేణుగోపాలాచారి హెచ్చరిం చారు. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో విలేకరులతో మాట్లాడారు. బాబు చేతిలో మోడీ కీలుబొమ్మ: ఈటెల జమ్మికుంట (కరీంనగర్): ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ కీలుబొమ్మగా మారారని, కేంద్రం ఆధిపత్య ధోరణి కొనసాగిస్తే మరో ఉద్యమం తప్పదని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇది సరికాదు: జోగు రామన్న గోదావరిఖని (కరీంనగర్): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపీసీఎం చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలా మారిందని, అందుకే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల శాంతిభద్రతలను గవర్నర్‌కు అప్పగించిందని రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణపై కేంద్రం వివక్ష: ఎంపీ కడియం వరంగల్: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఎంపీ కడియం శ్రీహరి విమర్శించారు. శనివారం ఆయన హన్మకొండలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి కేంద్రం అడ్డంకులు సష్టిస్తోందని మండిపడ్డారు. రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందన్నారు. కీలుబొమ్మగా మోడీ!: దేశపతి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుల చేతిలో కీలుబొమ్మగా మారారని, వారిద్దరు ఏం చెబితే మోడీ అదే చేస్తున్నారని తెలంగాణ వికాస సమితి అధ్యక్షుడు దేశపతి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. గవర్నర్‌కు అధికారాలు కట్టబెట్టడం ఇందులో భాగమేనని ఆరోపించారు. శనివారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం మోడీ పేరు నరేంద్రనాయుడుగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. రేపు ధర్నాలు, ర్యాలీలు.. హైదరాబాద్‌పై ఆంక్షలకు వ్యతిరేకంగా జిల్లా కేంద్రాల్లో సోమవారం (ఈ నెల 11న) నిరసన ధర్నాలను, ర్యాలీలను నిర్వహించాలని టీయూడబ్యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అల్లం నారాయణ, క్రాంతి ఒక ప్రకటనలో కోరారు. హైదరాబాద్‌పై ఆంక్షలను పెడుతూ, గవర్నర్‌కు అధికారాలను అప్పగించడం ప్రజాస్వామిక హక్కులకు భంగమన్నారు. కేంద్రం పెత్తనాన్ని సహించం చందంపేట(నల్లగొండ): గవర్నర్‌కు విశేష అధికారాలను కట్టబెట్టడాన్ని హోంమంత్రినాయిని నర్సింహారెడ్డి ఖండిం చారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర సాగుతోందని, కేంద్రం పెత్తనాన్ని సహించమన్నారు. నల్లగొండ జిల్లా చందంపేటలో విలేకరులతో మాట్లాడారు. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా ఇతర రాష్ట్రాల సీఎంలను ఏకం చేసేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. -
లోక్‌సభలోకి సెబీ చట్ట సవరణ బిల్లు
న్యూఢిల్లీ: సెబీకి మరిన్ని అధికారాలను కల్పించే సెక్యూరిటీ చట్టాల(సవరణ) బిల్లు-2014ను కేంద్ర ప్రభుత్వం సోమవారం ఎట్టకేలకు లోక్‌సభలో ప్రవేశపెట్టింది. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో దీనికి సంబంధించి ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చినప్పటికీ.. పార్లమెంటులో ఆమోదముద్ర పడలేదు. ఆర్థిక శాఖ సహాయ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును లోక్‌సభకు సమర్పించారు. ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్యం కారణంగా సభకు హాజరుకాకపోవడంతో ఆయన బదులు తాను బిల్లును ప్రవేశపెట్టినట్లు సీతారామన్ పేర్కొన్నారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే.. మోసపూరిత పెట్టుబడి పథకాల(పోంజీ స్కీమ్‌లు)కు పూర్తిస్థాయిలో అడ్డుకట్టవేయడంతోపాటు దర్యాప్తులో భాగంగా ఏ ఇతర సంస్థల నుంచైనా సమాచారాన్ని కోరడానికి.. విచారణను వేగంగా పూర్తిచేసేందుకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు అధికారం కూడా సెబీకి లభిస్తాయి. అంతేకాకుండా కాల్ డేటా రికార్డులను సైతం తీసుకునే పవర్ దక్కుతుంది. స్టాక్ మార్కెట్‌తో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న వ్యక్తులు, సంస్థలనే కాకుండా.. ఎవరినైనా సమాచారం కోసం పిలిపించే అవకాశం సెబీకి లభిస్తుంది. ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు, స్టాక్ మార్కెట్లో మార్పులకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవడానికి వీలుగా సెబీ అధికారాలు పెంచడమే ఈ బిల్లు ప్రధానోద్దేశమని నిర్మల చెప్పారు. కాగా, సెక్యూరిటీస్ కాంట్రాక్టుల(నియంత్రణ) బిల్లు-1956, డిపాజిటరీస్ చట్టం-1996లో సవరణలకు సంబంధించిన బిల్లులను కూడా ఆమె సభలో ప్రవేశపెట్టారు. స్వల్ప మార్పులు..: ప్రభుత్వం ప్రవేశపెట్టిన సవరణ బిల్లులో ఆర్డినెన్స్ చేర్చిన కొన్ని అధికారాలకు సంబంధించి మార్పులు చేశారు. దీనిప్రకారం సెబీ ఏదైనా కేసులకు సంబంధించి సోదాలు, స్వాధీనాలు(సీజ్) చేపట్టాలంటే ముందుగా ప్రత్యేక కోర్టుల నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. కేసుల స్వభావాన్నిబట్టి కనీస స్థాయిలో రూ.లక్ష-రూ.10 లక్షల వరకూ జరిమానాలు విధించే కొత్త నిబంధనలను కూడా బిల్లులో చేర్చారు. -
ఆపరేషన్ ‘సెర్చ్’
నేరగాళ్ల కోసం సైబరాబాద్ పోలీసుల సెర్చ్ ఆపరేషన్ అర్ధరాత్రి సూరారంలో ప్రయోగాత్మకంగా ప్రారంభం పాల్గొన్న 250 మంది పోలీసులు ఐదు గంటల్లో 500 ఇళ్లు సోదా అదుపులో 21 మంది అనుమానితులు, 30 వాహనాల స్వాధీనం దాదాపు 200 మంది పోలీసులు ఉన్నట్టుండి ఓ బస్తీని రౌండప్ చేశారు. అక్కడి నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా, లోపలకు రాకుండా కట్టుదిట్టం చేశారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారి 5 గంటల వరకు ఏకబిగిన సోదాలు.. ప్రతి ఇల్లు.. ప్రతి అంగుళం తనిఖీలు..అనుమానితుల విచారణ... నేరాలను నిరోధించే లక్ష్యంతో సైబరాబాద్ పోలీసులు బుధవారం నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్ ఇది. ప్రయోగాత్మకంగా సూరారం గ్రామంలో దీన్ని అమలు చేశారు. సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఇక అసాంఘిక శక్తులు మకాం వేయలేవు. ఒక వేళ దొంగలు, దోపిడీ గ్యాంగ్‌లు, హంతక ముఠాలు ధైర్యం చేసి మకాం వేసినా రాత్రికి రాత్రే పోలీసు దండు వారుండే బస్తీపై విరుచుకుపడుతుంది. దుండగులు ఏ మూల నక్కినా ఇట్టే పట్టేస్తుంది. ప్రపంచంలోనే హైదరాబాద్‌ను ఉత్తమ నగరంతో పాటు నేరరహితంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఇచ్చిన పిలుపుకు సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పందించారు. ఇందులో భాగంగా క్రైమ్ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఆయన నేరగాళ్ల ఆగడాలకు ఫుల్స్టాప్ పెట్టేందుకు సరికొత్త పంథాలు అనుసరించాలని నిర్ణయించారు. పాత, కొత్తనేరస్తులు నివాసముండే బస్తీలు, కాలనీలపై డేగ కన్ను పెట్టాలని సూచించారు. దీంతో పాటు ఆయా బస్తీలపై ఆకస్మిక దాడులు చేసి, విస్తృతంగా సోదాలు నిర్వహించి నేరరహిత ప్రాంతంగా మార్చాలని ఆదేశించారు. నేరం జరిగాక నేరస్తుల కోసం గాలించడం కంటే... ముందుగానే గాలింపు చేపడితే నేరం జరగకుండా నిరోధించేందుకు అవకాశం ఉంటుందని కమిషనర్ అధికారులకు సూచించారు. సెర్చ్ ఆపరేషన్... కమిషనర్ ఆదేశాల మేరకు ప్రయోగాత్మకంగా మొదటిసారి దుండిగల్ పోలీసుస్టేషన్ పరిధిలోని సూరారం గ్రామాన్ని సెర్చ్ ఆపరేషన్‌కు ఎంచుకున్నారు. ఇక్కడ ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, బెంగాల్, జార్ఖండ్‌లకు చెందిన వారు ఎక్కువగా నివాసం ఉంటుంటారు. బైక్ దొంగలు, ఇళ్లు దోచుకునేవారు, దృష్టిని మరల్చి నేరం చేసేవారు, కేడీలు, అక్రమ ఆయుధాలు కల్గినవారు, స్నాచర్లు, నేర చరిత్ర ఉన్నవారు ఎక్కువగా ఇక్కడే ఉన్నారు. దీంతో సూరారం భౌగోళిక స్థితిని మరియు రహదారులను గుర్తించిన పోలీసులు సెర్చ్ ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టారు. ఇలా జల్లెడ పట్టారు... బుధవారం అర్ధరాత్రి దాటాక క్రైమ్ అదనపు డీసీపీ జి.జానకీషర్మిల ఆధ్వర్యంలో ముగ్గురు ఏసీపీలు శ్రీనివాసరావు, నంద్యాల నర్సింహారెడ్డి, ఎం.రజనితో పాటు 20 మంది ఇన్స్పెక్టర్లు, 50 మంది సబ్ఇన్స్పెక్టర్లు, 150 మంది కానిస్టేబుళ్లు సూరారం బస్తీపై విరుచుకుపడ్డారు. సోదాలు చేస్తున్నంత సేపు బస్తీలోకి, బయటకు ఎవ్వరినీ అనుమతించలేదు. బస్తీలోని ప్రతీ ఇల్లు.. ముఖ్యంగా నేరగాళ్ల నివాసాల్లో సోదాలు చేశారు. గురువారం ఉదయం 5 గంటల వరకు జరిగిన ఈ సోదాల్లో మొత్తం 500 ఇళ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 10 మంది పాతనేరస్తులు, 11 మంది అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు 20 బైక్‌లు, 10 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. తాము ఎలాంటి ఫిర్యాదు ఇవ్వకపోయినా నేరగాళ్ల కోసం పోలీసులు ఇలా ఆకస్మిక తనిఖీలు చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. నేరస్తులపై డేగకన్ను ఇలాంటి ఆపరేషన్లు ఇక నుంచి రోజూ కొనసాగుతాయి. ఇప్పటికే నేరస్తులపై డేగకన్ను పెట్టాం. అనుమానం ఉన్న ప్రతీ బస్తీ, కాలనీని ఏ క్షణంలోనైనా రౌండప్ చేసి సోదాలు చేస్తాం. సోదాల సమయంలో సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రజల ధన, మాన, ప్రాణాలు కాపాడడమే పోలీసుల విధి. ఇందుకోసం బస్తీ పెద్దల సహకారం కూడా తీసుకుంటున్నాం. నేరస్తులు సైబరాబాద్‌లో అడుగుపెట్టాలంటేనే దడ పుట్టేలా చేస్తాం. అంతర్రాష్ట్ర ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టాం. వారి కదలికలపై వాసన వస్తే చాలు ఇట్టే పట్టేస్తాం. ఇందు కోసం యాంటీ క్రైమ్ బృందాలను సైతం పటిష్టం చేశాం. -సీవీ ఆనంద్. సైబరాబాద్ పోలీసు కమిషనర్ ( ఫైల్) -
గవర్నర్కా...సీఎస్కా?
-
చెక్‌పవర్ రాలే...
వరంగల్, న్యూస్‌లైన్ : కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు ప్రభుత్వం ఇంకా అధికారాలు ఇవ్వలేదు. పంచాయతీల్లో పలు పనులు, పారిశుద్ధ్య నిర్వహణకు కూడా రూపాయి ఖర్చు పెట్టేందుకు అధికారం రాలేదు. ఇప్పటివరకు స్పెషల్ ఆఫీసర్ల చేతిలో ఉన్న చెక్ పవర్ కూడా ఇంకా కేటాయించలేదు. గతంలో సర్పంచ్‌లకు చెక్ పవర్ ఉండేది. టీడీపీ హయాంలో సర్పంచ్‌లకు ఉన్న విశిష్ట అధికారానికి ఆంక్షలు విధించారు. సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులలో ఒకరికి జాయిం ట్ చెక్ పవర్ అధికారాన్ని కల్పించారు. అయితే ప్రస్తుతం కొత్త సర్పంచ్‌లకు చెక్ పవర్ అధికారాన్ని ఎలా కల్పిస్తారనే విషయంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో వారు గ్రామ పంచాయతీలోని విశిష్ట అధికారానికి ఇంకా దూరంగానే ఉన్నారు. జిల్లాలోని పంచాయతీ ఎన్నికలు ముగియగా ఈ నెల రెండో తేదీన సర్పంచ్‌లు అధికారికంగా బాధ్యతలను స్వీకరించారు. ఆ వెంటనే ప్రత్యేకాధికారులు తమ బాధ్యతల నుంచి వైదొలిగారు. గ్రామ పంచాయతీల నిధులకు సంబంధించి ఇప్పటి వరకు ప్రత్యేకాధికారులే చెక్ పవర్‌ను కలిగి ఉన్నారు. వారే అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. వారు తమ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో చెక్ పవర్ రద్దు అయింది. సర్పంచ్‌లుగా బాధ్యతలను స్వీకరించిన వారికి చెక్ పవర్ కల్పించాల్సి ఉండగా ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో గ్రామ పంచాయతీల్లో పని చేసే పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇచ్చేవారు కరువయ్యారు. ప్రతి నెల మొదటి వారంలోనే పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలనే చెల్లించాల్సి ఉంది. గ్రామ పంచాయతీలకు ఇంటి పన్నుల ద్వారా వసూలైన ఆదాయాన్ని బ్యాంకుల్లో నిలువ చేస్తారు. ఏ పనికైనా చెల్లింపులు చెక్ రూపంలోనే ఉంటుంది. నూతనంగా ఎన్నికయిన సర్పంచ్‌లకు ఇంకా చెక్ పవర్ లేకపోవడంతో నిధులు డ్రా చేసే ఆవకాశం లేదు. దీంతో మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం, నీటి సరఫరా ఇబ్బందిగా మారింది. వేతనాలు లేకపోవడంతో కార్మికులు విధులకు గైర్హాజరవుతున్నారు. అంతేకాకుండా పన్నుల వసూళ్లు కూడా నిలిచిపోతున్నాయి. కాగా, సర్పంచ్‌లకు ఇంకా చెక్ పవర్ అధికారాలు రాలేదని, ఈ విషయం ప్రభుత్వ పరిధిలో ఉందని డీపీఓ ఈఎస్ నాయక్ పేర్కొన్నారు. చెక్ పవర్ లేకపోవడంతో కార్మికులకు వేతనాలు ఆగిపోయాయన్నారు.