
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 20న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. సచివాలయంలో సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ భేటీ జరగనుంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేబినెట్ చర్చించనుంది.
వరద నష్టం గురించి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. వ్యవసాయ కమిషన్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఆర్‌వోఆర్ చట్టం రద్దు చేయనున్నట్లు సమాచారం. పేదలందరికీ ఆరోగ్య బీమా, భూమాత పోర్టల్, కొత్త రేషన్ కార్డు మార్గదర్శకాలు, విద్యా కమిషన్, 200 కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనున్నట్లు తెలిసింది.
ఇదీ చదవండి: మాజీ సీఎస్ సోమేష్‌కుమార్‌కు సీఐడీ నోటీసులు
Comments
Please login to add a commentAdd a comment