సాక్షి, హైదరాబాద్: ఈ నెల 4న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం కానుంది. బడ్జెట్ సమావేశాలపై కేబినెట్ చర్చించనుంది. 8 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
10న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 12వ తేదీ నుంచి 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండు హామీలను అమలు చేసిన ప్రభుత్వం.. ఆదివారం జరగనున్న సమావేశంలో మరో రెండు గ్యారెంటీలకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు తెలిసింది.
ఇదీ చదవండి: జన్మలో కేసీఆర్ మళ్లీ సీఎం కాలేరు: సీఎం రేవంత్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment