హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ను కలిశారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని సీఎం గవర్నర్ ను కోరినట్లు సమాచారం. కాగా మరికాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ ఆమోదం, ప్రాజెక్టుల రీ డిజైన్ సహా పలు కీలక అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.