హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రగతి భవన్‌లో ముగిసింది. ఈ భేటీలో ముస్లిం, గిరిజన రిజర్వేషన్ల పెంపు శాతాన్ని ఖరారు చేసే అంశంపై చర్చించారు. రాష్ట్ర రిజర్వేషన్ల బిల్లు సహా మరో 40 అంశాలకు ఈ భేటీలో ఆమోదం తెలపినట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు, మత్స్యకారులకు పరిహారం పెంపు, కాళేశ్వరం, మధ్య మానేరు ప్రాజెక్టుల టెండర్ల అంశంపై సమావేశంలో చర్చించారు.
పురపాలకశాఖలో కొత్త ఉద్యోగాల భర్తీపైనా చర్చించనున్నట్టు తెలుస్తోంది. కాగా, రిజర్వేషన్ల అంశంపై చర్చించేందుకు రేపు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం కానున్న నేపథ్యంలో ఈ సాయంత్రం జరిగే బీఏసీ సమావేశానికి సీఎం కేసీఆర్ సైతం హాజరుకానున్నారు.