తెలంగాణ ఉద్యోగులకు తీపి కబురు | Telangana cabinet meeting has started | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఉద్యోగులకు తీపి కబురు

Published Sun, Feb 7 2016 3:03 PM | Last Updated on Sun, Sep 3 2017 5:08 PM

తెలంగాణ ఉద్యోగులకు తీపి కబురు

తెలంగాణ ఉద్యోగులకు తీపి కబురు

బడ్జెట్‌ కేటాయింపులు, గవర్నర్‌ ప్రసంగంపై చర్చ
  ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది వేతనాల పెంపుపై నిర్ణయం
దుమ్ముగూడెం రీ డిజైన్‌ ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం
తెలంగాణ ఉద్యోగులకు 3.14 శాతం డీఏ పెంపుపై నిర్ణయం

హైదరాబాద్‌: తెలంగాణ కేబినెట్‌ భేటీ ఆదివారం ప్రారంభమైంది. ఈ కేబినెట్‌ సమావేశంలో ప్రధానంగా బడ్జెట్‌ కేటాయింపులు, గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగంపై చర్చ జరుగ నున్నట్టు తెలుస్తోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల బాధ్యతలను విజయవంతంగా నిర్వహించినందుకుగానూ తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ను ఈ సందర్భంగా కేబినెట్‌ అభినందించింది. తెలంగాణ ఉద్యోగులకు 3.14 శాతం డీఏ పెంపుపై నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రైగ్యులరైజ్‌ కోసం కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌ యాక్ట్‌ను తెలంగాణకు అన్వయించుకునే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.

దుమ్ముగూడెం రీ డిజైన్‌ ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఆర్థిక, ఆరోగ్య శాఖలతో పాటు వివిధ శాఖల్లో కొత్త పోస్టుల నియమకానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు మరొక స్లాబ్‌ను ఏర్పరిచే ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement