మంత్రులుగా ప్రమాణ స్వీకారం | Telangana New Ministers To Take Oath At Raj Bhavan | Sakshi
Sakshi News home page

మంత్రులుగా ప్రమాణ స్వీకారం

Published Tue, Feb 19 2019 12:26 PM | Last Updated on Fri, Mar 22 2024 11:14 AM

తెలంగాణ కేబినెట్‌ విస్తరణలో భాగంగా పది మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు రాజ్‌ భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ వారితో ప్రమాణం చేయించారు. జాతీయ గీతాలాపన అనంతరం మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కేశవరావు, మాజీ మంత్రులు కడియం శ్రీహరి, హరీశ్‌రావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఒక్కొక్కరిని సభా వేదికపైకి పిలిచారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement