హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ మంత్రివర్గం శుక్రవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సుమారు మూడు గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో కేబినెట్ పలు నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. తెలంగాణలో నీటి పారుదల ప్రాజెక్టుల రీడిజైన్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్యాకేజీల్లో మార్పు చేర్పులకు ఆమోదం వేసింది. అలాగే వరంగల్ జిల్లాలో వ్యవసాయ యూనివర్శిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదించింది.
వరంగల్ జిల్లా మామునూరులో వెటర్నరీ కళాశాల, మహబూబ్ నగర్ జిల్లాలో ఫిషరీస్ సైన్స్ కాలేజ్, మెదక్ జిల్లాలో నిమ్జ్, హైదరాబాద్ లో ఫార్మానిమ్జ్ కోసం టీఎస్ఐఐసీ రూ. 784 కోట్ల హడ్కో రుణం పొందడానికి గ్యారంటీ ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇక దేవాదాయ, ధర్మాదాయ, ధార్మిక సంస్థల్లో ట్రస్ట్ మెంబర్ల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. గోదావరిపై నిర్మించే ప్రాజెక్టులపై మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందాలకు ఆమోదం తెలిపింది. అసైన్డ్ భూములను నిగ్గు తేల్చేందుకు, కమతాల ఏకీకరణకు, భూముల క్రమబద్ధీకరణకు, నిరుపయోగంగా ఉన్న భూముల వినియోగానికి అవసరమైన విధానం రూపొందించాలని రెవెన్యూ శాఖను ఆదేశించింది.
ప్రాణహిత, చేవెళ్ల, దేవాదుల ప్రాజెక్టుల పునరాకృతికి మంత్రివర్గం ఆమోదించింది. కంతనపల్లి, సీతారామ, భక్తరామదాసు, రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్, ఎస్ఆర్ఎస్పీ వరద వరద కాలువ రీడిజైన్ పనులకు ఆమోదం తెలిపింది. మొత్తం 19 ప్యాకేజీల్లో మార్పులు చేర్పులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణం కోసం మహారాష్ట్రతో కుదుర్చుకున్న ఒప్పందాలను కేబినెట్ ఆమోదించింది.
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే...
Published Fri, Jun 3 2016 4:31 PM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM
Advertisement
Advertisement