
సాక్షి, అమరావతి: 2021 ఏడాది బడ్జెట్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు రాష్ట్ర కేబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. మూడు నెలల కాలానికి గాను కేబినెట్ దీనిని ఆమోదించింది. త్వరలోనే ఏపీ ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపనుంది. స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు జరగలేదు. దాంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment