
గల్ఫ్ ఎన్‌ఆర్‌ఐల సంక్షేమంపై త్వరలో ప్రకటన
గల్ఫ్‌లోని తెలంగాణ ఎన్‌ఆర్‌ఐల కష్టాలను ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని, ఎన్‌ఆర్‌ఐల సంక్షేమంపై త్వరలో ఓ ప్రకటన..
రాష్ట్ర ఎన్‌ఆర్‌ఐ విభాగం మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: గల్ఫ్‌లోని తెలంగాణ ఎన్‌ఆర్‌ఐల కష్టాలను ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని, ఎన్‌ఆర్‌ఐల సంక్షేమంపై త్వరలో ఓ ప్రకటన చేస్తామని రాష్ట్ర ఎన్‌ఆర్‌ఐ విభాగం మంత్రి కె.తారకరామారావు తెలిపారు. ప్రవాస భారతీయులకు ఎన్నిక ల్లో ఇచ్చిన హమీలను అమలు చేస్తామన్నారు.
ఇందు కోసం తాను త్వరలో గల్ఫ్‌లో పర్యటిస్తానని, అక్కడి ఎన్‌ఆర్‌ఐ సంఘాలు, ఎన్నారైలకు సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. ఎన్‌ఆర్‌ఐలు ఏ సమస్య ఉన్నా తన కార్యాలయ సిబ్బందికి తెలియజేయాలని కోరారు. ఎమిరెట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ సంఘం ప్రతినిధులు మంగళవారం మంత్రి కేటీఆర్‌ను కలిసి గల్ఫ్‌లో తెలంగాణ వాసుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నారైల సమస్యలపై ప్రభుత్వం స్పందిస్తున్న తీరుపట్ల కృతజ్ఞతలు తెలిపారు.