కోవిడ్ కారణంగా దేశవ్యాప్తంగా తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లల సంఖ్య 4,532
అత్యధికంగా మహారాష్ట్రలో 855 మంది పిల్లలు తల్లిదండ్రుల్ని కోల్పోయారు
వారందరికీ కేంద్రీయ విద్యాలయాల్లో ప్రత్యేక సీట్లతో ఉచిత చదువులు
పీఎం కేర్ కింద ప్రతి బిడ్డకు పోస్టాఫీసులో రూ.10 లక్షల డిపాజిట్
18–23 సంవత్సరాల మధ్య వయసులో నెలవారీ స్టైఫండ్
బంధువుల వద్ద ఆశ్రయం పొందుతున్న పిల్లలకు నెలకు రూ.4,000
తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన పిల్లల సంఖ్య 1,82,671
23 సంవత్సరాలు నిండిన తరువాత రూ.10 లక్షలు మంజూరు
మిషన్ వాత్సల్య కింద పిల్లల విద్య, ఆరోగ్య సంరక్షణ బాధ్యతలు
లోక్‌సభలో వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
కలెక్టర్ల నుంచి సేకరించి..
తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన పిల్లల వివరాలను రాష్ట్రాల వారీగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పీఎం కేర్ ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేసినట్టు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి లోక్‌సభలో వెల్లడించారు. ఇప్పటివరకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పీఎం కేర్ పోర్టల్‌లో కోవిడ్–19 కారణంగా తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన పిల్లలు 4,532 మంది నమోదైనట్టు కేంద్ర మంత్రి తెలిపారు. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 855 మంది పిల్లలు తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయారు. పీఎం కేర్ పోర్టల్‌లో నమోదైన 4,532 మంది పిల్లలకు 18 సంవత్సరాలు నిండాక ప్రతి బిడ్డకు రూ.10 లక్షల చొప్పున పోస్టాఫీస్‌లో కార్పస్ ఫండ్ కింద జమ చేస్తున్నట్టు కేంద్ర మంత్రి వివరించారు.
పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకంలో 10 లక్షల కార్పస్‌ను పెట్టుబడి పెట్టడం ద్వారా 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల మధ్య పిల్లలలకు నెలవారీ స్టైఫండ్‌ను ఇస్తారని, 23 సంవత్సరాల నిండిన తరువాత రూ.10 లక్షలు మంజూరు చేస్తారని వెల్లడించారు. బందువుల దగ్గర ఉంటున్న 18 ఏళ్లలోపు పిల్లలకు మిషన్ వాత్సల్య పథకం కింద నెలకు రూ.4,000 చొప్పున మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇస్తుందని మంత్రి పేర్కొన్నారు. పిల్లల సంరక్షణ, ఇన్‌స్టిట్యూట్‌లో ఉండే పిల్లలకు బోర్డింగ్, లాడ్జింగ్ సౌకర్యాలను ప్రభుత్వమే కలి్పస్తుందని మంత్రి తెలిపారు. ఈ పిల్లలు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకునేందుకు వీలుగా కేంద్రీయ విద్యాలయాల్లో ప్రత్యేకంగా అడ్మిషన్లు ఇచి్చనట్టు పేర్కొన్నారు.
పూర్తి ఫీజు మినహాయింపుతో..
కోవిడ్ కారణంగా తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలను ఒక్కో కేంద్రీయ విద్యాలయంలో ప్రత్యేకంగా 10 మంది చొప్పున చేర్చు కుంటున్నారు. ఆ పిల్లలకు పూర్తిగా ఫీజు మినహాయింపు ఉంది. స్కూల్‌కు వెళ్లే పిల్లలందరికీ స్కాలర్íÙప్ కింద రూ.20 వేల చొప్పున ఇస్తారు. వీరంతా ఆయుష్మాన్ భారత్–ప్ర«దానమంత్రి జన ఆరోగ్య యోజన కింద రూ.5 లక్షల ఆరోగ్య బీమా కవరేజీతో నమోదయ్యారు. వారికి 23 సంవత్సరాలు వచ్చే వరకు ఆరోగ్య బీమా కవరేజి వర్తిస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. కోవిడ్ కారణంగా తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన పిల్లల వివరాలను బాలస్వరాజ్ పోర్టల్‌లో నమోదు చేశారు.
ఈ కేటగిరీలో అన్ని రాష్ట్రాల్లో కలిపి 1,82,2671 మంది పిల్లలు నమోదయ్యారు. వీరి సంరక్షణ, విద్య, ఆరోగ్య బాధ్యతలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. మిషన్ వాత్సల్య పథకం కింద, పిల్లల సంరక్షణ సంస్థల ద్వారా వారి సంరక్షణ చర్యలను చేపడుతున్నారు. తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన పిల్లలు అత్యధికంగా ఒడిశాలో 34,160 మంది, మహారాష్ట్రలో 27,302 మంది, ఉత్తర ప్రదేశ్‌లో 19,437 మంది, తమిళనాడులో 15,395 మంది, గుజరాత్‌లో 13,802 మంది, మధ్యప్రదేశ్‌లో 11,413 మంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment