Annapurnadevi
-
పీఎం కేర్.. చిల్డ్రన్ వెల్ఫేర్
కలెక్టర్ల నుంచి సేకరించి.. తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన పిల్లల వివరాలను రాష్ట్రాల వారీగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పీఎం కేర్ ఆన్లైన్ పోర్టల్‌లో నమోదు చేసినట్టు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి లోక్‌సభలో వెల్లడించారు. ఇప్పటివరకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పీఎం కేర్ పోర్టల్‌లో కోవిడ్–19 కారణంగా తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన పిల్లలు 4,532 మంది నమోదైనట్టు కేంద్ర మంత్రి తెలిపారు. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 855 మంది పిల్లలు తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయారు. పీఎం కేర్ పోర్టల్‌లో నమోదైన 4,532 మంది పిల్లలకు 18 సంవత్సరాలు నిండాక ప్రతి బిడ్డకు రూ.10 లక్షల చొప్పున పోస్టాఫీస్‌లో కార్పస్ ఫండ్ కింద జమ చేస్తున్నట్టు కేంద్ర మంత్రి వివరించారు.పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకంలో 10 లక్షల కార్పస్‌ను పెట్టుబడి పెట్టడం ద్వారా 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల మధ్య పిల్లలలకు నెలవారీ స్టైఫండ్‌ను ఇస్తారని, 23 సంవత్సరాల నిండిన తరువాత రూ.10 లక్షలు మంజూరు చేస్తారని వెల్లడించారు. బందువుల దగ్గర ఉంటున్న 18 ఏళ్లలోపు పిల్లలకు మిషన్ వాత్సల్య పథకం కింద నెలకు రూ.4,000 చొప్పున మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇస్తుందని మంత్రి పేర్కొన్నారు. పిల్లల సంరక్షణ, ఇన్స్టిట్యూట్లో ఉండే పిల్లలకు బోర్డింగ్, లాడ్జింగ్ సౌకర్యాలను ప్రభుత్వమే కలి్పస్తుందని మంత్రి తెలిపారు. ఈ పిల్లలు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకునేందుకు వీలుగా కేంద్రీయ విద్యాలయాల్లో ప్రత్యేకంగా అడ్మిషన్లు ఇచి్చనట్టు పేర్కొన్నారు. పూర్తి ఫీజు మినహాయింపుతో.. కోవిడ్ కారణంగా తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలను ఒక్కో కేంద్రీయ విద్యాలయంలో ప్రత్యేకంగా 10 మంది చొప్పున చేర్చు కుంటున్నారు. ఆ పిల్లలకు పూర్తిగా ఫీజు మినహాయింపు ఉంది. స్కూల్‌కు వెళ్లే పిల్లలందరికీ స్కాలర్íÙప్ కింద రూ.20 వేల చొప్పున ఇస్తారు. వీరంతా ఆయుష్మాన్ భారత్–ప్ర«దానమంత్రి జన ఆరోగ్య యోజన కింద రూ.5 లక్షల ఆరోగ్య బీమా కవరేజీతో నమోదయ్యారు. వారికి 23 సంవత్సరాలు వచ్చే వరకు ఆరోగ్య బీమా కవరేజి వర్తిస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. కోవిడ్ కారణంగా తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన పిల్లల వివరాలను బాలస్వరాజ్ పోర్టల్‌లో నమోదు చేశారు. ఈ కేటగిరీలో అన్ని రాష్ట్రాల్లో కలిపి 1,82,2671 మంది పిల్లలు నమోదయ్యారు. వీరి సంరక్షణ, విద్య, ఆరోగ్య బాధ్యతలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. మిషన్ వాత్సల్య పథకం కింద, పిల్లల సంరక్షణ సంస్థల ద్వారా వారి సంరక్షణ చర్యలను చేపడుతున్నారు. తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన పిల్లలు అత్యధికంగా ఒడిశాలో 34,160 మంది, మహారాష్ట్రలో 27,302 మంది, ఉత్తర ప్రదేశ్‌లో 19,437 మంది, తమిళనాడులో 15,395 మంది, గుజరాత్లో 13,802 మంది, మధ్యప్రదేశ్‌లో 11,413 మంది ఉన్నారు. -
వందేళ్ల తర్వాత కాశీ విశ్వనాథుడికి చెంతకు అన్నపూర్ణ
న్యూఢిల్లీ: దశాబ్దాల కిత్రం వారణాసి నుంచి దొంగిలించబడిన అన్నపూర్ణ దేవి చారిత్రాత్మక విగ్రహాన్ని కెనడా నుంచి భారత ప్రభుత్వం స్వదేహానికి తీసుకొచ్చింది. వందేళ్ల క్రితం చోరికి గురైన ఈ విగ్రహాన్ని కెనడాలో గుర్తించారు. కెనడా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన కేంద్రం.. చివరకు అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని తిరిగి వెనక్కి రప్పింది. 18వ శతాబ్దానికి చెందిన ఈ అన్నపూర్ణ దేవి విగ్రహం గురువారం భారత్ చేరుకుంది. ఈ విగ్రహానికి ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీఆఫ్ మోడరన్ ఆర్ట్‌లో కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, పలువురు అధికారులు పాల్గొన్నారు. అనంతరం అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. భారత సంస్కృతికి చెందిన విగ్రహాలు వివిధ దేశాల్లో ఉన్నాయని, వాటిని భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. అన్నపూర్ణ దేవి మూర్తి విగ్రహం ఇప్పుడు సరైన చోటులో ప్రతిష్ఠించనున్నట్లు తెలిపారు. అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని ఊరేగింపుగా యూపీలోని కాశీ విశ్వనాథ ఆలయానికి తీసుకువెళ్లి అక్కడ పున:ప్రతిష్ట నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కాశీ విశ్వనాథుని ఆలయంలో భక్తులు ఇకనుంచి అన్నపూర్ణ దేవి కృపను, ఆశీర్వచనాన్ని కూడా పొందవచ్చని కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీకి చేరుకున్న అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని అలీగఢ్ తీసుకెళ్లి, అక్కడి నుంచి నవంబర్ 12న కనౌజ్ తీసుకెళ్లనున్నారు. అనంతరం నవంబర్ 14న అయోధ్య.. అటు నుంచి వారణాసికి తీసుకెళ్లి చివరగా నవంబర్ 15న కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రతిష్టించనున్నారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ చేతుల మీదుగా ఈ విగ్రహ అవిష్కరణ చేయనున్నారు. ఈ విగ్రహం 17 మీటర్లు ఎత్తు, 9 సెంటీమీటర్లు వెడల్పు, 4 సెంటీమీటర్ల మందం కలిగి ఉంది. -
అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ దర్శనం
సాక్షి, ఇంద్రకీలాద్రి: దసరా నవరాత్రులలో నాలుగవ రోజైన చవితి నాడు బెజవాడ కనకదుర్గమ్మ అన్నపూర్ణ మాతగా దర్శనమిస్తుంది, సృష్టిలోని ప్రతీజీవికి కావలసిన చైతన్యం కలిగించే మహాశక్తి అన్నపూర్ణ. ఒక చేతిలో అక్షయ పాత్రతో, మరియొక చేతిలో గరిటెతో దర్శనమిస్తుంది. సాక్షాత్తూ పరమేశ్వరునికే భిక్షనొసంగిన అన్నపూర్ణ అక్షయ శుభాలను కలిగిస్తుంది. ఈ రోజు అన్నపూర్ణాష్టక పారాయణ శుభదాయకం. అన్నపూర్ణాష్టకమ్ నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ!! అన్నంపరబ్రహ్మ స్వరూపం. అదే సర్వజీవులకు జీవనాధారం. అటువంటి అన్నాన్ని ప్రసాదించేది సాక్షాత్తూ అన్నపూర్ణమ్మ తల్లే. అమ్మవారి దివ్య రూపాల్లో అన్నపూర్ణాదేవి అలంకారం ఒకటి. అన్నపూర్ణాదేవి అలంకారంలో పరమార్ధం.. సాక్షాత్ తన భర్త పరమేశ్వరుడే ఆది భిక్షువుగా యాచనికి వస్తే ఆ తల్లి అన్నపూర్ణాదేవిగా మారి ఆయనకు భిక్షని ప్రసాదిస్తుంది. అలాగే దుర్గమ్మ అన్నార్తుల పాలిట అన్నపూర్ణగా మారి వారి ఆకలిని తీరుస్తుంది. అటువంటి అన్నపూర్ణమ్మ రూపంలో ఇవాళ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ భక్తులకు కనువిందు చేయనున్నారు. ఈ విధంగా సాగే అన్నపూర్ణాష్టకం చదివితే సకల మనోభీష్టాలు నెరవేరుతాయి. శ్రీశైలంలోని భ్రమరాంబ కూష్మాండ రూపంలో దర్శనమిస్తుంది. తేజోమయ రూపంతో ఎనిమిది భుజాలతో కనిపించే రూపం కూష్మాండ. అలంకారం, నివేదన: ఈ రోజు పులిహోర, పెసరపప్పు పాయసం నివేదన చేయాలి. ఎరుపురంగు వస్త్రాలను ధరింపచేసి కూరగాయలతో చేసిన కదంబం నివేదన చేయాలి. శ్రీసూక్త పారాయణ శ్రేష్టం.కూష్మాండ శ్లోకంసురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవచ ! దధానా హస్త పద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తుమే !! ఈ చిత్రంలో దుర్గాదేవి వేషధారణలో ఆధ్యాత్మిక ప్రకాశంతో కనిపిస్తున్నది అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో సిన్సినాటి నగరంలో ఉంటున్న శ్రీమతి మద్దూరి సుహాసిని మధుర లాలస! ప్రసిద్ధ నాట్యాచారిణి ‘పద్మశ్రీ’ శోభానాయుడు చేత గజ్జె కట్టించుకుని, ఆమె శిష్యురాలిగా కూచిపూడి నాట్య వైభవాన్ని ప్రచారం చేసే మార్గంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని నెలల క్రితం తన ప్రదర్శనలో భాగంగా శోభానాయుడు తన శిష్యురాలైన మధుర లాలసకు దుర్గాదేవి వేషాన్ని ధరింపజేసి, ముమ్మూర్తులా అమ్మవారిలా ఉన్నావంటూ నమస్కరిస్తూ ఆశీర్వదించారు. తన గురువైన శోభానాయుడు కూచిపూడి నాట్యకళకు చేసిన సేవ అనితరసాధ్యమనీ, ఆమె తనను అమితంగా ప్రేమించేవారనీ మధుర లాలస కన్నీళ్లతో గుర్తుచేసుకున్నారు. -
నాలుగో రోజు అలంకారం శ్రీ అన్నపూర్ణాదేవి
ఈ రోజు అమ్మవారిని కాశీపురాధీశ్వరి అయిన అన్నపూర్ణాదేవిగా గోధుమరంగు చీరతో అలంకరిస్తారు. సకల దానాలలో ఉత్కృష్టమైనది అన్నదానం. లోకాలకు క్షుధార్తి తీర్చేది అమ్మ స్వరూపం. ఎందరున్నా అమ్మకాదు, ఎన్ని తిన్నా అన్నం కాదు. ఎడమ చేతిలో రసాన్న పాత్ర ధరించి ఆదిభిక్షువుగా యాచించ వచ్చిన లయకారుడ యిన విశ్వేశ్వరుడికి కుడిచేతితో అన్నప్రదానం చేస్తూ దయతో మనపై కరుణామృతాన్ని కురిపిస్తూ తనకు ఆయురారోగ్యాలను ప్రసాదిస్తూ అమ్మ అన్నపూర్ణగా దర్శనమిస్తుంది. అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మను దర్శిస్తే కాశీవాస పుణ్యం లభిస్తుందని ఆర్యోక్తి. శ్లోకం: అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధర్థం భిక్షాం దేహిచ పార్వతి భావం: ఓ అన్నపూర్ణాదేవీ, సాక్షాత్తూ శంకరుని ప్రాణేశ్వరివైన నీవు మాకు జ్ఞానాన్ని, వైరాగ్యాన్నీ భిక్షగా ప్రసాదించు తల్లీ! నివేదన: అప్పాలు, షడ్రసోపేత మహానైవేద్యం (ఓపిక లేనివారు స్నానం చేసి శుచిగా వండిన అన్నం, పప్పు, కూరలను కూడా నివేదించవచ్చు) ఫలమ్: పాడిపంటలు, ధనధాన్యాభివృద్ధి, నూతన గృహ యోగం కలుగుతాయి. ఉపాసకులకు జ్ఞానం, వైరాగ్యం ప్రాప్తిస్తాయి. -దేశపతి అనంత శర్మ