ఆదివాసీల అభివృద్ధికి కృషి: అప్పలరాజు | Minister Appalaraju Said All Efforts Will Be Made For Welfare Of Tribals | Sakshi
Sakshi News home page

ఆదివాసీల అభివృద్ధికి కృషి: అప్పలరాజు

Published Sun, Aug 9 2020 3:04 PM | Last Updated on Sun, Aug 9 2020 3:11 PM

Minister Appalaraju Said All Efforts Will Be Made For Welfare Of Tribals - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: ఆదివాసీల సంక్షేమం కోసం అన్ని విధాల కృషి చేస్తామని పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని కాశీబుగ్గ జీఎంఈ కాలనీలోని తన కార్యాలయం వద్ద ఆదివాసీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మన రాష్ట్ర జనాభాలో 5.2 శాతం ఆదివాసీలు ఉన్నారని.. వారి సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుచేసుకునే విధంగా ఈ దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. (వైఎస్‌ జగన్‌ ఎప్పుడూ గుర్తు చేస్తుంటారు)

గిరిజనుల అభివృద్ధి కోసం నాటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ లక్షా ముప్పై వేల ఎకరాల భూ పట్టాలు ఇచ్చారని గుర్తుచేశారు. ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఆదివాసీల అభ్యున్నతికి పాటు పడుతున్నారని మంత్రి అప్పలరాజు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement