అంగన్‌వాడీ పిల్లల పౌష్టికాహారంలో కోత
మిగులు కోసం ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయం
మండిపడుతున్న ప్రజాసంఘాలు
ఏవిధంగానైనా ఖర్చు మిగుల్చుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కక్కుర్తి నిర్ణయాలు తీసుకుంటోంది. చిన్నారుల ఆరోగ్యం, శారీరక బలం కోసం దశాబ్దాలుగా అమలులో ఉన్న పథకాలకు కోత వేస్తోంది. అరకొర సరుకులిస్తూ వారి కడుపులు మాడ్చుతోంది. దీనిపై ప్రజాసంఘాల నేతలు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. నిర్ణయం మార్చుకోకుంటే ఉద్యమాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
బి.కొత్తకోట : జిల్లాలో స్త్రీ, శిశు సంక్షేమశాఖ ద్వారా 21 ఐసీడీఎస్ ప్రాజెక్టులు పనిచేస్తున్నాయి. 3,640 ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు, 1,128 మినీ అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. 1,43, 621 మంది చిన్నారులు ఉన్నారు. వీరికి ప్రతినెలా పౌష్టికాహారం అందించాల్సిఉంది. ఇందులో భాగంగా బియ్యం, నూనె, కందిపప్పు, కోడిగుడ్లను నేరుగా పిల్లల ఇళ్లకే వెళ్లి పంపిణీ చేస్తారు. గతనెల వరకు సవ్యంగా సాగిపోతున్న పథకంలో కోత విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే చిన్నారులకు అందించే పౌష్టికాహారం పరిమాణం తగ్గిపోయింది. బియ్యం 300 గ్రాములు, కందిపప్పు అరకిలో తగ్గించారు. ఇక గుడ్లను నెలలో రెండుసార్లు అందిస్తున్నారు.
పిల్లలపై ప్రభావం..
పౌష్టికాహారం తగ్గించడం పిల్లల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. తగిన పౌష్టికాహారం అందించలేని దారిద్యరేఖకు దిగువున ఉన్న కుటుంబాల్లోని చిన్నారులకు ప్రభుత్వ నిర్ణయం అశనిపాతంగా మారుతుందని అంటున్నారు. ఇప్పటికే అన్ని వర్గాలకు చుక్కలు చూపిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం చిన్నారుల పోషణలోనూ కక్కూర్తికి దిగడం తగ దని సూచిస్తున్నారు. దీనిపై ప్రజా సంఘాల నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం మార్చుకోకుంటే ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు.
మాకు శక్తిలేదు
నా కొడుకు బాలాజీకి మూడేళ్లు నిండాయి. ఇన్నాళ్లూ పిల్లల కోసం బాలామృతం ప్యాకెట్లు ఇచ్చేవారు. వీటి స్థానంలో నెలకు మూడు కిలోల బియ్యం, కిలో కంది పప్పు, అర లీటర్ పామాయిల్, 8 గుడ్లు ఇచ్చేవారు. ఇందులో 300 గ్రాముల బియ్యం, అర కిలో కందిపప్పును తగ్గించేశారు. ఇలా అన్నీ తగ్గిస్తా ఇస్తావుంటే పిల్లలకు శక్తి, ఎదుగుదల ఎలా వస్తుంది.
-కే.లక్ష్మి, పెద్దతిప్పసముద్రం
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
బియ్యం, కందిపప్పును తగ్గించి పంపిణీ చేయాలన్న నిర్ణయం ప్రభుత్వానిది. గత డిసెంబర్ నుంచి కోత విధించి సరుకులు పంపిణీ చేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకే ఇలా చేస్తున్నాం. ఈ విషయాన్ని బిడ్డల తల్లిదండ్రులు గుర్తించాలి.
- సరళాదేవి, సీడీపీవో, మదనపల్లె
06టిబిపి70: లక్ష్మీ
06టిబిపి71: సరళాదేవి
జిల్లాలో 3 నెలల నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 1,43,621 మంది ఒక్కొక్కరికీ ప్రతినెలా ఇవ్వాల్సిన సరుకులు 3 కిలోల బియ్యం కిలో కందిప్పు అర లీటరు నూనె 8 కోడిగుడ్లు ఇప్పుడు ఇస్తోంది 2,700 గ్రాముల బియ్యం అరకిలో కందిపప్పు అర లీటరు నూనె8 కోడిగుడ్లు ప్రభుత్వానికి నెలకు మిగులు బియ్యం 43,086.3 క్వింటాళ్లు కందిపప్పు 71,810.5 క్వింటాళ్లు
మరీ ఇంత కక్కుర్తా?
Published Fri, Jan 8 2016 2:39 AM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM
Advertisement
Advertisement