- సంప్‌లో పడేసి ప్రాణం తీసింది
- మతి స్థిమితం లేక చేశాన న్న నిందితురాలు
- కేసు నమోదు చేసిన పోలీసులు
అతిరుపతి రూరల్: సూర్యచంద్రుల కన్నా
ఆకాశం కన్నా
గొప్పది అమ్మ
పర్వతాలను
సముద్రాలను
ప్రకృతి ప్రాణికోటినీ మోసే పుడమి కన్నా
పుణ్యమూర్తి అమ్మ.. అంటూ అమ్మ గొప్పదనం గురించి ఓ కవి వర్ణిస్తాడు. నవమాసాలు మోసి, ఓ శిశువుకు జన్మనిచ్చాక, ఆ పసికందును చూసినప్పుడు తల్లి మోములో కనిపించే మాతృత్వపు మధురిమ తాలూకు భావోద్వేగాల గు రించి మాటలు చాలవనిపిస్తుంది. అయి తే, ఓ మాతృమూర్తి వీటన్నింటికీ అతీతురాలైంది. లాలించిన చేతులతోనే పసికందు ఉసురు తీసింది. కళ్లు మూసుకుని నిద్రలో తల్లిపొత్తిళ్ల వెచ్చదనం అనుభవి స్తున్న ఆ పసికందు నీళ్లలో మునిగి శాశ్వ తనిద్రలోకి జారుకుంది. ఇది తెలిసిన ఊరు అయ్యో..అయ్యో అంటూ కన్నీటి పర్యంతమైంది. మతిస్థిమితం లేని స్థితి లో తాను బిడ్డను ఏం చేశానో కూడా తెలి యదని ఆ కన్నతల్లి ఏడుపు ఎత్తుకున్నప్పటికీ, ఆడబిడ్డ పుట్టిందనే చంపివేసిం దంటూ గ్రామం విషాదసంద్రమైంది.
తిరుపతి రూరల్ మండలం పెరుమాళ్లపల్లెలో సోమవారం చోటుచేసుకున్న సంఘటన పలువురిని కలచివేసిం ది. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న పీ.ఈశ్వర్‌రెడ్డి, మోహన దంపతులకు బిందులత అనే ఏడాదిన్నర వయసుగల ఆడబిడ్డ ఉంది. 12 రోజుల క్రితం వారికి మరో ఆడబిడ్డ పుట్టడమే విషాదానికి కారణమరుుంది. ఇద్దరూ ఆడపిల్లలేనని, మగబిడ్డ పుట్టలేదని తల్లి మనస్తాపానికి గురైంది. తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో మూడో కంటికి తెలియకుండా బిడ్డను ఇంటి వెనుక ఉన్న వాటర్ సంప్‌లో పడేసింది. పసికందును హతమార్చి ఏమీ ఎరుగనట్టు మరలా ఇంట్లోకొచ్చి పడుకుంది.
ఉదయాన్నే అందరూ లేచేసరికి పసిబిడ్డ కనిపించలేదంటూ మోహన శోకాలు పెట్టడంతో అందరూ ఆందోళన చెందారు. పసికందు కోసం గాలించారు. వాటర్ సంప్‌లో శవమై ఉందంటూ ఆమే చెప్పడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. భర్త, అత్త, గ్రామస్తులు ఆమె ప్రవర్తిస్తున్న తీరులో మార్పు ఉండడంతో సందేహించారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేశారు. గంటలోపే నిగ్గు తేల్చారు. మోహన తొలుత పొంతనలేని సమాధానాలు చెప్పినప్పటికీ తన బిడ్డను తానే సంప్‌లో పడేసినట్టు పోలీసుల ముందు అంగీకరించింది. ‘నాకు మతి స్థిమితం లేదు.. బిడ్డ జారి నీళ్ల సంప్‌లో పడింది’ అంటూ మీడియా ముందు చెప్పుకొచ్చింది.
తల్లడిల్లిన గ్రామం
ఈశ్వర్‌రెడ్డికి మళ్లీ బంగారం లాంటి బిడ్డ పుట్టిందంటూ గ్రామస్తులంతా 11 రోజు ల క్రితం అభినందించారు. పసికందును ముద్దాడారు. ఆడబిడ్డలు లేనివారంతా మాకూ ఇలాంటి బిడ్డ పుడితే బాగుండనీ అన్నారు. ఇప్పుడు కన్నతల్లే ప్రాణం తీ సిందని తెలుసుకున్న మహిళలు, గ్రామస్తులు విచలితులయ్యారు. ఇంత దారుణానికి ఒడిగట్టడానికి చేతులెలా వచ్చా యో, ఆడ బిడ్డ పుట్టడం ఇష్టం లేకుంటే ఎవరికైనా ఇచ్చి ఉండవచ్చు కదా!? అని గ్రామం విషాదంలో మునిగింది.