sump
-
Twin Brothers: కలిసే తనువు చాలించి..
జీడిమెట్ల: ఇద్దరు అన్నదమ్ములు కవలలుగా జన్మించి తల్లిదండ్రులకు సంతోషాన్ని ఇచ్చారు. తల్లిదండ్రులు కవలలకు ముద్దుగా రాము, లక్ష్మణ్ అని పేర్లు పెట్టుకున్నారు. ఇద్దరు అన్నదమ్ములు ఎదిగి..బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కి వచ్చి దొరికిన పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అనుకోని ప్రమాదంలో అన్నను కాపాడేందుకు తమ్ముడు ప్రయతి్నంచి ఇద్దరూ ఒకేసారి మృత్యుఒడికి చేరారు. ఈ విషాదకర సంఘటన జీడిమెట్ల పారిశ్రామిక వాడలో జరిగింది. జీడిమెట్ల డీఐ కనకయ్య, ఎస్సై హరీష్ తెల్పన వివరాల ప్రకారం.. ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం దొంతికూరు గ్రామానికి చెందిన రాము(32), లక్ష్మణ్(32) కవలలు. వీరు ఉపాధి కోసం నగరానికి వచ్చి గుండ్లపోచంపల్లి, అన్నారం గ్రామంలో ఉంటూ వివిధ పనులు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా సాధు నారాయణరావు అనే ఫ్యాబ్రికేషన్ కాంట్రాక్టర్ వద్ద రోజువారీ పనులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే గత నాలుగు రోజులుగా వీరిద్దరూ జీడిమెట్ల ఏస్వీ కో ఆపరేటివ్ సొసైటీలో 3 సంవత్సరాలుగా మూతపడి ఉన్న సాబూరి ఫార్మా పరిశ్రమలో ఫ్యాబ్రికేషన్ పనులు నిర్వహిస్తున్నారు. బుధవారం రాము, లక్ష్మణ్‌తో పాటు పాండుబస్తీకి చెందిన సురేందర్‌రెడ్డి పరిశ్రమలో ఉన్న వ్యాక్యూమ్ ట్యాంక్ గోడపై నిలబడి ఫ్యాబ్రికేషన్ పనులు నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల సమయంలో వీరికి తాగేందుకు చాయ్ రావడంతో లక్ష్మణ్, సురేందర్‌రెడ్డి గోడపై నుండి కిందకు దిగారు. గోడ దిగే క్రమంలో రాము ప్రమాదవశాత్తు వ్యాక్యూమ్ ట్యాంకులో పడిపోయాడు. పరిశ్రమ మూడు సంవత్సరాలుగా మూసి ఉన్నకారణంగా ట్యాంకులో రసాయనాలతో కూడిన నీరు 6 ఫీట్ల మేర ఉంది. రాము ట్యాంకులో పడటాన్ని గమనించిన లక్ష్మణ్ వెంటనే ట్యాంకు గోడ ఎక్కి ఓ కర్ర సాయంతో వెతకగా రాము అసస్మారక స్థితిలో పడి ఉన్నాడు. దీంతో అన్నను బయటకు తీసేందుకు లక్ష్మణ్ సైతం ట్యాంకులోకి దిగి అతను కూడా అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. ఇద్దరూ బయటకు రాకపోవడంతో సురేందర్‌రెడ్డి ట్యాంకులోకి దిగి అపస్మారకస్థితిలో ఉన్న రాము, లక్ష్మణ్‌లను బయటకు తీశాడు. ఇద్దరిని వెంటనే షాపూర్‌నగర్‌లోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఇద్దరు మృతిచెందారని డ్యూటీ డాక్టర్ నిర్ధారించారు. సురేందర్‌రెడ్డి సైతం అస్వస్థతకు గురికావడంతో చికిత్స అందిస్తున్నారు. రాము, లక్ష్మణ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సంపు క్లీన్ చేస్తుండగా విద్యుత్ షాక్.. ముగ్గురు మృతి..
చిత్తూరు: చౌడేపల్లి మండలం పెద్ద కొండామారిలో విషాద ఘటన జరిగింది. విద్యుత్ షాక్‌కు గురై ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. సంపు క్లీన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు విడిచారు. మృతులను రమణ, మునిరాజా, రవిలుగా గుర్తించారు. మోటారు వైరు తెగి సంపులో పడిపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ముగ్గురిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారని కుటుంబసభ్యులు తెలిపారు. విగతజీవులుగా మారిన వారిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. చదవండి: ఘోర ప్రమాదం.. ముగ్గురు విద్యార్థులు దుర్మరణం.. -
‘జైద్ లే నాన్నా.. ఒక్కసారి ఇటు చూడు.. ఎంత పనిచేశావ్’
ఉరవకొండ(అనంతపురం జిల్లా): ‘నాన్నా జైద్ కన్నులు తెరు... ఒక్కసారి ఇటు చూడు... లే నాన్నా.. లే.. యా అల్లాహ్ ఎంత పనిచేశావయ్యా’ అంటూ ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఉన్న ఒక్క కొడుకూ చనిపోవడంతో వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. వివరాల్లోకెళితే... ఉరవకొండ పట్టణంలోని ఇందిరానగర్‌లో జైనుల్లా, యాస్మిన్ దంపతులు నివాసం ఉంటున్నారు. జైనుల్లా టెంకాయల వ్యాపారం చేస్తున్నాడు. చదవండి: అర్ధరాత్రి ఆలయానికి ఎలుగు బంటి.. తాళాలు వేసి ఉండటంతో ఏం చేసిందంటే? వీరికి ఒక్కగానొక్క కుమారుడు మహ్మద్ జైద్ (20 నెలలు) ఉన్నాడు. మహ్మద్ జైద్ గురువారం ఎదురింట్లో ఆడుకోవడానికి వెళ్లాడు. తెరిచి ఉన్న సంప్ వద్ద ఆడుతుండగా పొరపాటున సంప్‌లో పడిపోయాడు. ఇంటి పనుల్లో నిమగ్నమైన తల్లి కూడా గమనించలేదు. కొద్దిసేపటి తర్వాత ఎదురు ఇంట్లో ఉన్న వారు గమనించి వెంటనే సంప్‌లోని నుంచి బాబును బయటకు తీసి హుటాహుటినా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాబు చనిపోయాడని వైద్యులు ధ్రువీకరించడంతో బాబు తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
ఆడుకునేందుకు పార్కుకు వెళ్లి..
సాక్షి, కర్నూలు: కర్నూలు నగరంలో విషాదం చోటుచేసుకుంది. ఆడుకోవడానికి వెళ్లిన బాలుడు పార్కులోని సంపులో పడి మృతిచెందాడు. ఆడుకునేందుకు వీకర్ సెక్షన్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న నేతాజీ పార్కులోకి వరలక్ష్మి, శ్రీనివాసులు కుమారుడు తిరుమలేష్(10) వెళ్లాడు. అయితే అక్కడ నిర్మించిన సంపుపై మూత లేకపోవడంతో అటుగా వెళ్లిన బాలుడు అందులోపడి మృతిచెందాడు. కాగా, మునిసిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తమ పిల్లవాడు మృతిచెందాడని తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. బాలుడు 5వ తరగతి చదువుతున్నాడు. -
సంపులో పడి వ్యక్తి మృతి
ఘట్కేసర్(రంగారెడ్డి): సంపులో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. పట్టణంలోని బాలాజీ నగర్లో నివాసముండే ప్రసాద్(30) ఓ కంపెనీలో కూలీగా పనిచేస్తున్నాడు. అయితే ఈ రోజు తాను అద్దెకు ఉండే ఇంట్లోని సంపులో పడి మృతి చెందాడు. మృతుడి స్వస్థలం అనంతపురం జిల్లా తాడిపత్రిగా పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. -
నీటిగుంటలో పడి బాలుడు మృతి
కర్నూలు: ఆస్పరి మండలంలోని చాకిరేవు నీటిగుంటలో పడి ప్రమాదవశాత్తూ భరత్(16) అనే బాలుడు మృతిచెందాడు. ఆదివారం సెలవు కావడంతో భరత్ తోటి స్నేహితులతో కలిసి సరదాగా నీటిగుంటకు చేరుకున్నాడు. అందులోకి దిగిన భరత్ లోతు ఎక్కువగా ఉండటంతో ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయాడు. భరత్ మృతదేహాన్ని వెలికి తీయటానికి స్థానికులు ప్రయత్నిస్తున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
హుద్దాబేగం హత్యలో వీడుతున్న చిక్కుముళ్లు
-
సంపులో పడి చిన్నారి మృతి
హైదరాబాద్: తుకారంగేటు సమీపంలోని వడ్డెర బస్తీలో ఓ చిన్నారి ప్రమాదవశాత్తు సంపులో పడి మృతి చెందింది. ఈ ప్రమాదం మంగళవారం జరిగింది. వివరాలు... వడ్డెర బస్తీకి చెందిన రవి, లక్ష్మీల కుమార్తె ఇందూ(4) అంగన్ వాడీ సెంటర్ నుంచి మంగళవారం సాయంత్రం ఇంటికి వెళుతుండగా దారి పక్కన ఉన్న సంపులో పడింది. దీంతో ఊపిరాడక మృతి చెందింది. -
సంపులో పడి బాలుడి మృతి
కడప: అభంశుభం తెలియని పసి బాలుడు ఆడుకుంటూ.. ప్రమాదవశాత్తూ సంపులో పడి మృతిచెందాడు. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లాలోని స్థానిక రవీంద్రనగర్‌లో జరిగింది. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న బాబావలికి సయ్యద్ రిహాన్(3) ఏకైక సంతానం. గురువారం మధ్యాహ్నం బాబావలి భోజనానికని ఇంటికొచ్చేసరికి ఇంట్లో రిహాన్ కనపడలేదు. బాబు ఎక్కడా అని భార్యను ప్రశ్నించి చుట్టూ చూసేసరికి పక్కింట్లోని సంపులో మృతదేహం కనపడింది. దీంతో ఆ బాబు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. -
సంప్‌లో పడి బాలుడు దుర్మరణం
-
నిన్న స్కూల్లో చేరిన బాలుడు ఈరోజు సంప్‌లో దుర్మరణం
హైదరాబాద్: నిన్ననే స్కూల్లో చేరిన ఓ బాలుడు, స్కూలు యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఈరోజు అదే స్కూల్లోని సంపులో పడి దుర్మరణం చెందాడు. వనస్థలీపురంలోని అభిజ్ఞాన్ కిడ్స్ కేర్ స్కూల్లో ఈ విషాద ఘటన జరిగింది. వచన్ అనే రెండున్నరేళ్లబాలుడిని తల్లిదండ్రులు నిన్ననే స్కూల్లో చేర్చారు. ఈ రోజు వచన్ స్కూల్లోని సంపులో పడిపోయిన విషయాన్ని అక్కడి ఆయా గానీ, ఇతరులుగానీ గుర్తించలేదు. వారు గుర్తించేసరికి బాలుడు మృతి చెందాడు. సంపులో పడిన బాలుడిని బయటకు తీసి ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంపై తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. యాజమాన్యం స్కూల్‌కు తాళాలు వేసి పరారయ్యారు. -
ఆడబిడ్డగా పుట్టడమే తప్పా?
సంప్‌లో పడేసి ప్రాణం తీసింది మతి స్థిమితం లేక చేశాన న్న నిందితురాలు కేసు నమోదు చేసిన పోలీసులు అతిరుపతి రూరల్: సూర్యచంద్రుల కన్నా ఆకాశం కన్నా గొప్పది అమ్మ పర్వతాలను సముద్రాలను ప్రకృతి ప్రాణికోటినీ మోసే పుడమి కన్నా పుణ్యమూర్తి అమ్మ.. అంటూ అమ్మ గొప్పదనం గురించి ఓ కవి వర్ణిస్తాడు. నవమాసాలు మోసి, ఓ శిశువుకు జన్మనిచ్చాక, ఆ పసికందును చూసినప్పుడు తల్లి మోములో కనిపించే మాతృత్వపు మధురిమ తాలూకు భావోద్వేగాల గు రించి మాటలు చాలవనిపిస్తుంది. అయి తే, ఓ మాతృమూర్తి వీటన్నింటికీ అతీతురాలైంది. లాలించిన చేతులతోనే పసికందు ఉసురు తీసింది. కళ్లు మూసుకుని నిద్రలో తల్లిపొత్తిళ్ల వెచ్చదనం అనుభవి స్తున్న ఆ పసికందు నీళ్లలో మునిగి శాశ్వ తనిద్రలోకి జారుకుంది. ఇది తెలిసిన ఊరు అయ్యో..అయ్యో అంటూ కన్నీటి పర్యంతమైంది. మతిస్థిమితం లేని స్థితి లో తాను బిడ్డను ఏం చేశానో కూడా తెలి యదని ఆ కన్నతల్లి ఏడుపు ఎత్తుకున్నప్పటికీ, ఆడబిడ్డ పుట్టిందనే చంపివేసిం దంటూ గ్రామం విషాదసంద్రమైంది. తిరుపతి రూరల్ మండలం పెరుమాళ్లపల్లెలో సోమవారం చోటుచేసుకున్న సంఘటన పలువురిని కలచివేసిం ది. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న పీ.ఈశ్వర్‌రెడ్డి, మోహన దంపతులకు బిందులత అనే ఏడాదిన్నర వయసుగల ఆడబిడ్డ ఉంది. 12 రోజుల క్రితం వారికి మరో ఆడబిడ్డ పుట్టడమే విషాదానికి కారణమరుుంది. ఇద్దరూ ఆడపిల్లలేనని, మగబిడ్డ పుట్టలేదని తల్లి మనస్తాపానికి గురైంది. తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో మూడో కంటికి తెలియకుండా బిడ్డను ఇంటి వెనుక ఉన్న వాటర్ సంప్‌లో పడేసింది. పసికందును హతమార్చి ఏమీ ఎరుగనట్టు మరలా ఇంట్లోకొచ్చి పడుకుంది. ఉదయాన్నే అందరూ లేచేసరికి పసిబిడ్డ కనిపించలేదంటూ మోహన శోకాలు పెట్టడంతో అందరూ ఆందోళన చెందారు. పసికందు కోసం గాలించారు. వాటర్ సంప్‌లో శవమై ఉందంటూ ఆమే చెప్పడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. భర్త, అత్త, గ్రామస్తులు ఆమె ప్రవర్తిస్తున్న తీరులో మార్పు ఉండడంతో సందేహించారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేశారు. గంటలోపే నిగ్గు తేల్చారు. మోహన తొలుత పొంతనలేని సమాధానాలు చెప్పినప్పటికీ తన బిడ్డను తానే సంప్‌లో పడేసినట్టు పోలీసుల ముందు అంగీకరించింది. ‘నాకు మతి స్థిమితం లేదు.. బిడ్డ జారి నీళ్ల సంప్‌లో పడింది’ అంటూ మీడియా ముందు చెప్పుకొచ్చింది. తల్లడిల్లిన గ్రామం ఈశ్వర్‌రెడ్డికి మళ్లీ బంగారం లాంటి బిడ్డ పుట్టిందంటూ గ్రామస్తులంతా 11 రోజు ల క్రితం అభినందించారు. పసికందును ముద్దాడారు. ఆడబిడ్డలు లేనివారంతా మాకూ ఇలాంటి బిడ్డ పుడితే బాగుండనీ అన్నారు. ఇప్పుడు కన్నతల్లే ప్రాణం తీ సిందని తెలుసుకున్న మహిళలు, గ్రామస్తులు విచలితులయ్యారు. ఇంత దారుణానికి ఒడిగట్టడానికి చేతులెలా వచ్చా యో, ఆడ బిడ్డ పుట్టడం ఇష్టం లేకుంటే ఎవరికైనా ఇచ్చి ఉండవచ్చు కదా!? అని గ్రామం విషాదంలో మునిగింది.