కర్నూలు: ఆస్పరి మండలంలోని చాకిరేవు నీటిగుంటలో పడి ప్రమాదవశాత్తూ భరత్(16) అనే బాలుడు మృతిచెందాడు. ఆదివారం సెలవు కావడంతో భరత్ తోటి స్నేహితులతో కలిసి సరదాగా నీటిగుంటకు చేరుకున్నాడు. అందులోకి దిగిన భరత్ లోతు ఎక్కువగా ఉండటంతో ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయాడు.
భరత్ మృతదేహాన్ని వెలికి తీయటానికి స్థానికులు ప్రయత్నిస్తున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.