
చిత్తూరు: చౌడేపల్లి మండలం పెద్ద కొండామారిలో విషాద ఘటన జరిగింది. విద్యుత్ షాక్‌కు గురై ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. సంపు క్లీన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు విడిచారు. మృతులను రమణ, మునిరాజా, రవిలుగా గుర్తించారు.
మోటారు వైరు తెగి సంపులో పడిపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ముగ్గురిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారని కుటుంబసభ్యులు తెలిపారు. విగతజీవులుగా మారిన వారిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.