సంక్షేమ శాఖలపై సమీక్ష
Published Thu, Sep 1 2016 1:01 AM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM
హన్మకొండ అర్బన్ : జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు కొత్త జిల్లాల ఏర్పా టు తర్వాత ఏ విధంగా ఉండాలనే విషయంపై ఏజేసీ తరుపతిరావు, పీఓ అమయ్‌కుమార్ సమీక్షించారు. కలెక్టరేట్‌లోని ఏజేసీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్షలో జిల్లాలోని అధికారులు, జిల్లాలకు కేటాయింపులు, సిబ్బంది కొరత, తదితర అంశాలపై చర్చిం చారు. అనంతరం కలెక్టర్‌కు తుది నివేదిక అందజేశారు. సమావేశంలో ఈడీలు నర్సింహా స్వామి, సురేష్, డీడీలు శంకర్, చందన, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాల ఏర్పాటుపై 2,428 అప్పీళ్లు
హన్మకొండ అర్బన్ : కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు సంబంధించి బుధ వా రం రాత్రి వరకు ఆన్‌లైన్ ద్వారా మొత్తం 2428 అప్పీళ్లు అందాయి. ఈ మేరకు అధికారులు అభ్యంతరాల వివరాలను తెలిపారు. హన్మకొండ జిల్లాపై 1145, జయశంకర్ జిల్లాపై 570, మహబూబాబాద్ జిల్లాపై 40, వరంగల్ జిల్లాపై 253 అప్పీళ్లు అందినట్లు చెప్పారు. అలాగే రెవెన్యూ డివిజన్లు, మండలాలపై మెుత్తం 420 అభ్యంతరాలు వచ్చినట్లు వారు పేర్కొన్నారు.
Advertisement
Advertisement