మాట్లాడుతున్న మంత్రి తుమ్మల
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
కల్లూరు : రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోందని ఆర్‌అండ్‌బీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మండల పరిధిలోని నారాయణపురం లిఫ్ట్ ఇరిగేషన్ పునరుద్ధరణ పనులకు శంఖుస్థాపన చేసిన అనంతరం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. జిల్లాకు రూ. 40 కోట్లు మంజూరైతే సత్తుపల్లి నియోజకవర్గంలోని 17 ఎత్తి పోతల పథకాలకే రూ.27 కోట్లు కేటాయించామన్నారు. గోదావరి జలాలను జిల్లాకు తీసుకొచ్చి ఇక్కడ భూములను సస్యశ్యామలంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఆర్‌అండ్‌బీ నుంచి జిల్లాకు రూ. 1200 కోట్లు మంజూరైతే సత్తుపల్లికి రూ.200, పీఆర్ నుంచి రూ.50 కోట్లు కేటాయించామన్నారు. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 50 ఏళ్లలో జరగని అభివృద్ధిని కొద్ది రోజుల్లోనే చూస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ కవిత, ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ, ప్రజాప్రతినిధులు, నాయకులు జయలక్ష్మి, లీలావతి, దయానంద్ విజయ్‌కుమార్, కృష్ణ, రామూనాయక్, చందర్‌రావు, రామారావు, రఘు, మోహనరావు, వెంకటేశ్వరరెడ్డి, రాము, సత్తిరెడ్డి, లోకేష్, శ్రీనివాసరావు, శ్రీను, కిరణ్, శ్రీనాథ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.