బీసీ సంక్షేమంపై సమీక్ష | Review in BC welfare | Sakshi
Sakshi News home page

బీసీ సంక్షేమంపై సమీక్ష

Published Tue, Jan 24 2017 11:40 PM | Last Updated on Tue, Sep 5 2017 2:01 AM

Review in BC welfare

శాసన సభా కమిటీ పర్యటన
 
బాపట్ల : బాపట్ల వ్యవసాయ కళాశాలలో మౌలిక సదుపాయాలపై బీసీ సంక్షేమ శాసనసభ కమిటీ మంగళవారం రాత్రి పరిశీలించింది. విశ్వవిద్యాలయం డీన్‌ డాక్టరు టి.రమేష్‌బాబు,   పీజీ స్టడీస్‌ డీన్‌ వీరరాఘవయ్య, రిజిస్ట్రార్‌ టి.వి.సత్యనారాయణ  విశ్వవిద్యాలయం నిర్వహణపై పలువిషయాలను కమిటీ దృష్టికి తీసుకువెళ్ళారు. బీసీ రిజర్వేషన్లు అమలుపై కమిటీ చైర్మన్‌ తిప్పేస్వామి అడిగితెలుసుకున్నారు. బీసీ విద్యార్థులకు అందాల్సిన స్కాలర్‌షిపులు, హాస్టల్‌ నిర్వహణపై ఆరా తీశారు. రామచంద్రపురంలో పర్యటించిన కమిటీ మండలంలోని రామచంద్రపురంలోని మత్స్యకారుల కాలనీలో కమిటీ పర్యటించింది. ఈసందర్భంగా మత్స్యకారులను ఎస్టీల జాబితాలో చేర్చాలని ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ప్రభాకర్‌ వినతి పత్రం అందించారు. మత్స్యకారులకు అందాల్సిన సబ్సిడీలు కూడా సక్రమంగా అందేలా చూడాలని కోరారు. పర్యటనలో కమిటీ సభ్యులు అశోక్‌బాబు,రమణమూర్తి, జాయింట్‌కలెక్టర్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement