ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో 60 శాతం మేర నెల రోజుల్లోనే అమల్లోకి తీసుకువచ్చి తన చిత్తశుద్ధిని, ఇచ్చిన మాటపై నిలబడటాన్ని చాటి చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి.. ఇప్పుడు ఆ హామీల్లోని పలు అంశాలకు 40 రోజుల్లోనే చట్టబద్ధత కల్పించేందుకు రంగం సిద్ధం చేశారు. గురువారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ సమావేశాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించారు.