కల్లూరు రూరల్, న్యూస్‌లైన్: తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితోనే సంక్షేమం సాధ్యమవుతుందని వైఎస్సార్సీపీ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. కర్నూలు నగరానికి చెందిన ఇలియాస్, సురేశ్, డక్కోడు, పాండు, సంజయ్, గోపాల్, అరుణ్, జయమ్మ, నాగమ్మ, సోన, అనారితో పాటు దాదాపు 200 మంది గురువారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
స్థానిక నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఎస్వీ సమక్షంలో వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వైఎస్‌ఆర్ హయాంలో పేదల సంక్షేమానికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రశేవ పెట్టారన్నారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందని తెలిపారు. గతంలో కర్నూలు ప్రజల ఓట్లతో గెలుపొందిన టి.జి.వెంకటేష్.. ప్రజల సమస్యలే మరచిపోయారన్నారు. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని, తిరిగి ప్రజల దగ్గరికి వచ్చి ఓట్లడుగుతున్నారని, అలాంటి అవకాశవాదులకు ప్రజలే బుద్ధి చెప్పాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఎ.నారాయణమ్మ పాల్గొన్నారు.