
నవరత్నాలను వివరిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు
సాక్షి, దొడగట్ట(రొద్దం): మండల పరిధిలోని దొడగట్ట, గోనిమేకుపల్లి, రొద్దం పాత చెక్‌పోస్ట్ తదితర గ్రామాల్లోని ఎస్సీ కాలనీల్లో గురువారం వైఎస్సార్‌సీపీ నాయకులు నవరత్నాలపై ప్రచారం చేశారు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఎస్సీలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ దళితులను కించపరిచి మాట్లాడిన చంద్రబాబుకు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు.
వైఎస్సార్ సీపీతోనే ఎస్సీల అభివృద్ధి సాధ్యమని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు సినిమా నారాయణ, ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు గంగాధర్, జిల్లా కార్యదర్శి నారనాగేపల్లి రాజు, బైలాంజినేయులు, రొద్దం శ్రీరాములు, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు
వైఎస్సార్‌సీపీలో చేరిక
మండల పరిధిలోని నారనాగేపల్లి గ్రామానికి చెందిన పలువురు టీడీపీ, కాంగ్రెస్ నాయకులు వైఎస్సార్ సీపీలో చేరారు. గురువారం రాత్రి స్థానిక నాయకులు వై.రామన్న, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు తదితరుల ఆధ్వర్యంలో పెనుకొండ నియోజకవర్గ సమన్వయకర్త శంకరనారాయణ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి శంకర్‌నారాయణ పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు.
పార్టీలో చేరిన వారిలో బోయ నరసింహులు, బోయ సుబ్రమణ్యం తదితరలు ఉన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ బి.నారాయణరెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, సింగిల్ విండో డైరెక్టర్ మారుతిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు రాజారెడ్డి, వజీర్, లక్ష్మీనారాయణరెడ్డి, ఆర్‌ఏ రవిశేఖర్‌రెడ్డి, రాజ్‌గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment