
మాజీ ఎంపీ అనంత వెంకట్రామి రెడ్డి
అనంతపురం: ప్రత్యేక హోదా సాధించటంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమయ్యారని మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ అనంతపురం ఎమ్మెల్యే అభ్యర్థి అనంత వెంకట్రామి రెడ్డి తీవ్రంగా విమర్శించారు. అనంతపురంలో విలేకరులతో మాట్లాడుతూ..ఏపీలో 25 ఎంపీ సీట్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపిస్తే వైఎస్ జగన్ ప్రత్యేక హోదా కచ్చితంగా తెస్తారన్న నమ్మకం ఉందన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే కేంద్రంలో మా మద్ధతు ఉంటుందన్నారు.
వైఎస్ జగన్ ప్రకటించిన మేనిఫెస్టో వల్ల అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరీ, మేయర్ స్వరూప అవినీతి వల్ల అనంతపురం అభివృద్ధి కుంటుపడిందని వ్యాక్యానించారు. హామీలు ఇచ్చి మోసం చేసిన టీడీపీ నేతలకు ఓట్లు అడిగే హక్కే లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment