
అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు(శనివారం) కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పర్యటించనున్నారు. శనివారం ఉదయం 9.30 గంటలకు కర్నూలు జిల్లా నందికొట్కూరులో పర్యటిస్తారు. పదకొండున్నరకు ఎమ్మిగనూరులో, మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు అనంతపురం జిల్లా మడకశిరలో ప్రచారం నిర్వహిస్తారు. అదే రోజు మూడున్నర గంటలకు పెనుగొండ నియోజకవర్గంలోని సోమందేపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటనలో తెలిపారు.