Evaluating Two Year Of Y.S. Jagan Mohan Reddy’s Rule In AP: Women Empowerment Reality In A.P - Sakshi
Sakshi News home page

2 years YSJagan ane nenu: అక్కాచెల్లెమ్మలకు అండగా

Published Fri, May 28 2021 7:58 PM | Last Updated on Sun, May 30 2021 11:32 AM

Two Years Of YS Jagan Rule In AP: Women Empowerment - Sakshi

వెబ్‌డెస్క్‌: రాష్ట్రంలో ఉన్న మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారతే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం గత రెండేళ్లలో ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తోంది. రెండేళ్లలో మహిళ స్వాలంబన, సంక్షేమం మీద రూ.  రూ.88,040.29 కోట్ల ధనం వెచ్చించింది. రికార్డు స్థాయిలో 4.36 కోట్ల మంది మహిళాలకు మేలు జరిగింది. 

వైఎస్సార్ ఆసరా 
వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా తొలి విడతగా గతేడాది రూ. 6,310 కోట్లను ప్రభుత్వం అందచేసింది. ఈ సొమ్ము 77,75,681 మంది డ్వాక్రా మహిళల ఖాతాల్లో పడ్డాయి. ప్రభుత్వం చెల్లించిన డబ్బులు ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దాని మీద ఎటువంటి షరతులు విధించలేదు.ప్రభుత్వం అందించిన సొమ్మును ఇష్టం వచ్చిన అవసరాలకు లేదా వ్యాపారాలకు ఉపయోగించుకోవచ్చని సీఎం జగన్‌ సూచించారు. అక్కచెల్లెమ్మలు వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేందుకు, వ్యాపారవేత్తలుగా మారి స్వావలంబన సాధించడం కోసం ఇప్పటికే ప్రభుత్వం P&G, ఐటీసీ, హెచ్‌యూఎల్‌, అమూల్‌, అల్లన లాంటి దిగ్గజ సంస్థలతో, వివిధ బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుంది. 

వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం (మహిళలు)
బ్యాంకుల నుంచి రుణం తీసుకుని సకాలంలో వాయిదాలు చెల్లించిన పొదుపు సంఘాలను ప్రోత్సహించాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. సకాలంలో రుణం చెల్లించిన సంఘాలకు  ఆ రుణంపై వడ్డీ మొత్తాన్ని వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం ద్వారా ప్రభుత్వమే చెల్లిస్తోంది. దీంతోపాటు 2019 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి వరకు  90,37,255 మంది స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంకులకు చెల్లించాల్సిన రూ.1,400 కోట్ల వడ్డీ బకాయిలు కూడా వారి తరపున ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లించింది. ఈ ప్రభుత్వంపై నమ్మకం బలపడటంతో స్వయం సహాయక సంఘాల సంఖ్య 8.71 లక్షల నుంచి 9.34 లక్షలకు పెరిగింది. ప్రస్తుతం ఈ సంఖ్య 1.11 కోట్లకు చేరింది. ఇప్పటివరకు  ఈ పథకం క్రింద 98,00,626 మంది మహిళా పొదుపు సంఘాల సభ్యులకు మొత్తం రూ.2,354.22 కోట్లు లబ్ది చేకూరింది.

వైఎస్సార్ చేయూత
మహిళల ఆర్థిక స్వావలంబనకు, వారి పిల్లల చదువులు మరియు వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడానికి వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 45 నుండి 60 ఏళ్ల మధ్య వయస్సు గల ఎస్సీ, ఎస్టీ,. బీసీ, మైనారిటీ మహిళలకు ఏటా రూ.18,750 ల చొప్పున ఆర్థిక సాయం ఏపీ ప్రభుత్వం అందిస్తోంది. చేయూత సాయంతో ఇప్పటికే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 69,000 షాపులు కొత్తగా ఏర్పాటయ్యాయి. 2021 ఏప్రిల్ నాటికి వైఎస్సార్ చేయూత పథకం క్రింద 24,55,534 మంది మహిళల ఖాతాల్లో రూ.4,604.13 కోట్లు ప్రభుత్వం జమ చేసింది.

వైఎస్సార్ కాపు నేస్తం
45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయస్సు ఉన్న పేద కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాల పేద అక్కచెల్లెమ్మలు వారి కాళ్ల మీద వారు నిలబడేలా వైఎస్సార్ కాపు నేస్తం పథకం ద్వారా ఏటా రూ.15,000 ఆర్థిక సాయం ప్రభుత్వం అందజేస్తోంది. ఇప్పటివరకు 3,27,862 మంది మహిళలకు రూ.491.79 కోట్ల ఆర్థిక సాయం అందించడం జరిగింది.

వైఎస్సార్ సంపూర్ణ పోషణ
గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకాన్ని సీఎం జగన్‌ అమల్లోకి తెచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఇదే పనికి సగటున ఏడాదికి రూ.500 కోట్లు మాత్రమే కేటాయిస్తే.. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం ద్వారా నాలుగు రెట్లు ఎక్కువగా రూ.1,863.13 కోట్లు ప్రస్తుత ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. తద్వారా 30,16,000 మంది అక్కచెల్లెమ్మలు, చిన్నపిల్లలు లబ్ది పొందుతున్నారు.

వైఎస్సార్ ఈబీసీ నేస్తం
45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు వయసున్న ఆర్థికంగా వెనుకబడి ఉన్న బ్రాహ్మణ, వెలమ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, ముస్లిం ఇతర అగ్రవర్ణ పేద మహిళలందరికీ వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకానికి శ్రీకారం చుట్టారు. దీని ద్వారా అర్హులైన మహిళకు ఏడాదికి రూ. 15,000 ప్రభుత్వం సాయం అందిస్తుంది. ఈ పథకం ద్వారా 4 లక్షల మంది లబ్ది పొందనున్నారు.

జగనన్న జీవ క్రాంతి
జగనన్న అమూల్ పాలవెల్లువ పథకం క్రింద ఆవులు, గేదెలకు సంబంధించి 1.12.008యూనిట్లను కొనుగో చేయించింది. మేకలు /గొర్రెలకు సంబంధించి ప్రభుత్వం 72,179 యూనిట్లు కొనుగోలు చేయించి మహిళలకు ఆదాయం పెరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 

మహిళా సంక్షేమం విషయంలో మైలు రాళ్లు
- గతాన్ని భిన్నంగా రాష్ట్ర కేబినేట్‌లో  ఒక మహిళకు ఉప ముఖ్యమంత్రిగా, మరో మహిళకు హోంశాఖ మంత్రిగా అవకాశం కల్పించారు. 
- స్థానిక సంస్థలలో మహిళలకు 61 శాతం పదవులు కేటాయించి అత్యధిక ప్రాధాన్యత సీఎం జగన్‌ కల్పించారు. 
- మహిళా రిజర్వేషన్ చట్టం తీసుకొచ్చి నామినేటెడ్ పదవుల్లో, నామినేషన్ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు.
- గ్రామ/వార్డు సచివాలయాల్లో మహిళా కానిస్టేబుళ్ల నియామకం చేపట్టారు.
- కుటుంబాల్లో సుఖశాంతులు నింపేందుకు మద్య నియంత్రణ అమలు
- రూ. 27,000 వేల కోట్ల ఖర్చుతో 30,76,000 ఇళ్ల పట్టాల పంపిణీ. మహిళల పేరు మీదే ఇళ్ల రిజిస్ట్రేషన్లు
- వైఎస్సార్ లా నేస్తం ద్వారా 721 మందికి రూ.3.21 కోట్లు ఖర్చు చేశారు
- జగనన్న విద్యా దీవెన కింద 10,88,439 మంది తల్లుల ఖతాల్లో రూ.2,477.89 కోట్లు జమ
- జగనన్న వసతి దీవెన ద్వారా 15,56,956 మంది తల్లులకు రూ.2,269.93 కోట్లు అందచేత
- జగనన్న చేదోడు కింద 1,36,340 మంది అక్కచెల్లెమ్మలకు రూ.136.64 కోట్లు అందించిన ప్రభుత్వం 
- జగనన్న గోరుముద్ద పథకం ద్వారా 18,20,196 మంది బాలికలకు రూ.789.54 అందచేత
- జగనన్న విద్యాకానుక పథకం ద్వారా 21,86,972 మంది బాలికలకు రూ. 334.61 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement