పొట్ట కొడుతున్నారు | Dynamic welfare of others, said tribal students soon. | Sakshi
Sakshi News home page

పొట్ట కొడుతున్నారు

Published Sat, Nov 30 2013 4:29 AM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM

Dynamic welfare of others, said tribal students soon.

 పోలవరం, న్యూస్‌లైన్ : సంక్షేమ హాస్టళ్లలోని గిరిజన విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నా రు. పౌష్టికాహారం మాట దేవుడెరుగు.. కనీసం అన్నంలో కూరకూడా వేయడం లేదు. ఇదేమని అడిగితే.. ధరలు పెరిగిపోయూయని, కాంట్రాక్టర్ వాటిని సరఫరా చేయడం లేదని అధికారులు చేతులు దులిపేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే... కేఆర్‌పురం ఐటీడీఏ పరిధిలోని పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో మొత్తం 47 గిరిజన సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. దాదాపు 5,004 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీటిలో ఎక్కడా మెనూ అమలు కావడం లేదు. పౌష్టికాహారంగా అందించే పాలు, అరటిపండు సైతం ఇవ్వడం లేదు.
 
 గిరిజనసంక్షేమ వసతి గృహాలకు నిత్యావసర సరుకులను సరఫరా చేసేందుకు ఐటీడీఏ ఏటా కాంట్రాక్టర్‌ను నియమిస్తుంది. టెండర్‌లో పేర్కొన్న ధరల ప్రకారం జూన్ నుంచి ఏప్రిల్ వరకు సంబంధిత కాంట్రాక్టర్ నిత్యావసర సరుకులను సరఫరా చేయాల్సి ఉంది. సెప్టెంబర్ నెలాఖరు వరకు నిత్యావసర సరుకులను సరఫరా చేస్తూ వచ్చిన కాంట్రాక్టర్ అక్టోబర్ 1 నుంచి పాలు, కూరగాయలు, పుల్లలు, సరుకుల సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. అరటిపండు సరఫరా కూడా నిలిచిపోయింది. మండల ప్రధాన కేంద్రాల్లో ఉండే వసతి గృహాల్లోని విద్యార్థులకు అప్పుడప్పుడు అరటి పండ్లు సరఫరా చేస్తూ మూరుమూల ప్రాంతాల్లోని విద్యార్థులకు మొండిచేయి చూపిస్తున్నారు. నిబంధనల ప్రకారం వారానికి నాలుగుసార్లు విద్యార్థులకు అరటిపండ్లు ఇవ్వాలి.
 
 దాదాపుగా అమలు జరగడం లేదు. ఇదిలావుంటే టెండర్‌లో పేర్కొన్న ధరల ప్రకారం లీటరు పాలు రూ.26.50, కూరగాయలకు కిలో రూ.15 చొప్పున, పుల్లలు కిలో రూ.1.84 చొప్పున వాటిని సరఫరా చేసే కాంట్రాక్టర్‌కు ఐటీడీఏ చెల్లిస్తుంది. పాల ధర మార్కెట్‌లో లీటరు రూ.40 ఉంది. ఏజెన్సీ గ్రామాల్లో పాలు దొరకవు. అవి దొరకనిచోట కనీసం పాల ప్యాకెట్లను అయినా సరఫరా చేయాల్సి ఉండగా, పట్టించుకోవడం లేదు. విద్యార్థులకు ప్రతిరోజూ పాలు ఇవ్వాల్సి ఉండగా, ఎక్కడా ఇవ్వడం లేదు. మధ్యాహ్నం, సాయంత్రం భోజనాల్లో పల్చటి మజ్జిగ వాడుతున్నారు. ఏ కూరగాయ కొనాలన్నా మార్కెట్లో కిలో రూ.60కి తక్కువ లేవు. కాంట్రాక్టర్ వాటిని సరఫరా చేయకపోవడంతో కిలోకు రూ.15 చొప్పున వార్డెన్లకు చెల్లించి, కొనుగోలు చేయమంటున్నారు. వార్డెన్లు మెనూలో సగం కోత వేసి విద్యార్థులకు భోజనం పెడుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే విద్యార్థులకు కూరలు వడ్డించడమే మానేశారు. ఈ పరిస్థితికి కాంట్రాక్టరే కారణమని చెబుతున్న అధికారులు అతనిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. 
 
 వార్డెన్లను కొనమని చెప్పాం
 ఈ విషయమై గిరిజన సంక్షేమ శాఖ డెప్యూటీ డెరైక్టర్ పి.సావిత్రిని ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా, అక్టోబర్ నుంచి పాలు, కూరగాయలు తదితర సరుకులను కాంట్రాక్టర్ సరఫరా చేయటం లేదన్నారు. వాటిని వార్డెన్లే కొనుగోలు చేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాల్సిందిగా ఆదేశించామన్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో టెండర్‌లో పేర్కొన్న ధరలకు, బహిరంగ మార్కెట్‌లో ధరలకు వ్యత్యాసం ఎక్కువగా ఉందన్నారు. తాము మాత్రం టెండర్‌లో పేర్కొన్న ధరలను మాత్రమే వార్డెన్లకు చెల్లిస్తామన్నారు. నిత్యావసర సరుకుల ధరలను పెంచాల్సిందిగా కోరుతూ జారుుంట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడుకు నివేదిక పంపించామని చెప్పారు. కొత్త రేట్లకు అనుమతి వస్తే మెనూ సక్రమంగా అమలయ్యేలా చూస్తామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement