Published
Wed, Sep 21 2016 8:26 PM
| Last Updated on Mon, Sep 4 2017 2:24 PM
ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
హుజూర్‌నగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అల్లం ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని 9వ వార్డులో మామిడి రాములుకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ.35,500ల చెక్కును ఆయన పంపిణీ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ తేజావత్ రవినాయక్, సైదులునాయక్, మామిడి వసంత్, ములకలపల్లి రాంబాబు, వెంకటరెడ్డి, మహేష్, చంటి, ఉపేందర్, సైదులు, రాజు పాల్గొన్నారు.