schems
-
Telangana: అడవే ఉండాలి.. ఆక్రమణ ఉండొద్దు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పోడు భూముల సమస్య పరిష్కారానికి ఈ నెల మూడో వారం నుంచి కార్యాచరణ చేపడతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. ‘భవిష్యత్తులో అంతా అడవే ఉండాలని, లోపల ఎవరూ ఉండటానికి వీల్లేదు (నన్ ఈజ్ ఇన్ సైడ్. ఇన్సైడ్ ఈజ్ ఓన్లీ ఫారెస్ట్)’ అని స్పష్టం చేశారు. అడవుల మధ్యలో పోడు చేస్తున్నవారిని గుర్తించి అంచులకు తరలిస్తామని.. అక్కడ భూమి ఇచ్చి, సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు. సాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని.. రైతుబంధు, రైతు బీమా కూడా వర్తింపజేస్తామని చెప్పారు. ఆ తర్వాత ఒక్క గజం అటవీ భూమి అన్యాక్రాంతం కావడానికి వీల్లేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ శనివారం పోడు భూముల అంశంపై ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అటవీ పరిరక్షణ కమిటీల నియామకానికి విధివిధానాలను రూపొందించాలని ఆదేశించారు. పోడు సమస్య పరిష్కారంపై అఖిలపక్ష భేటీ నిర్వహిస్తామని, అవసరమైతే ఇతర పార్టీల నేతలను హెలికాప్టర్లో తీసుకెళ్లి అన్యాక్రాంతమైన భూములను చూపిస్తామని చెప్పారు. సమావేశంలో సీఎం కేసీఆర్ చేసిన సూచనలు, ఇచ్చిన ఆదేశాలు ఆయన మాటల్లోనే.. నిర్లక్ష్యం వద్దు ‘‘మానవ మనుగడకు అడవుల సంరక్షణ ఎంతో కీలకం. నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు తరాలకు ఒక్క చెట్టూ మిగలదు. అడవుల సంరక్షణ, పచ్చదనం పెంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు గొప్ప ఫలితాలను ఇస్తున్నాయి. హరితహారంతో దేశానికే ఆదర్శంగా నిలిచాం. హరితనిధికి విశేష స్పందన వస్తోంది. అడవులను రక్షించుకునే విషయంలో అటవీశాఖ అధికారులు మరింతగా శ్రద్ధ కనబర్చాలి. సమర్థవంతమైన అధికారులను నియమించాలి. వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది. అసెంబ్లీలో ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం.. పోడు భూముల సమస్య పరిష్కారానికి అక్టోబర్ మూడో వారం నుంచి కార్యాచరణ ప్రారంభించాలి. బయటివారితోనే అసలు సమస్య గిరిజనుల సంస్కృతి అడవితో ముడిపడి ఉంటుంది. వారు అడవులకు హాని తలపెట్టరు. జీవనోపాధి కోసం అడవుల్లో దొరికే తేనె, బంక, కట్టెలు, ఇతర అటవీ ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించుకుంటారు. సమస్య అంతా బయటినుంచి వెళ్లి అటవీ భూములను ఆక్రమించి, చెట్లను నరికి, అటవీ సంపదను దుర్వినియోగం చేసేవారితోనే. వారి స్వార్థానికి అడవులను బలికానివ్వం. పోడు సమస్య పరిష్కారమైన మరుక్షణమే అటవీభూముల పరిరక్షణ కోసం పటిష్టమైన చర్యలను ప్రారంభిస్తాం. అక్రమ చొరబాట్లు లేకుండా చూసుకోవడం అటవీశాఖ అధికారుల బాధ్యతే. మూడో వారంలో దరఖాస్తులు రాష్ట్రవ్యాప్తంగా పోడు భూములకు సంబంధించి ఈ నెల మూడో వారంలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించాలి. ఆ దరఖాస్తుల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా.. వ్యవసాయ భూమి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్థారించాలి. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ చర్యలు చేపట్టాలి. అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించి తగిన ఆదేశాలు జారీ చేయాలి. ఈ విషయంగా ఎమ్మెల్యేల సలహాలు, సూచనలు తీసుకోవాలి. గిరిజన సంక్షేమశాఖతో సమన్వయం చేసుకుని అటవీ భూముల రక్షణకు చర్యలు చేపట్టాలి. నవంబర్ నుంచి సర్వే.. రాష్ట్రంలో అటవీ భూముల సర్వేను నవంబర్ నుంచి ప్రారంభించనున్నాం. అక్షాంశ, రేఖాంశాల కో–ఆర్డినేట్స్ ఆధారంగా.. ప్రభుత్వ, అటవీ భూముల సరిహద్దులను గుర్తించాలి. అవసరమైన చోట కందకాలు తవ్వడం, కంచె వేయడం వంటి చర్యలు చేపట్టాలి. ఇందుకు కావాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. పకడ్బందీ చర్యల కోసం అవసరమైతే పోలీస్ రక్షణ అందిస్తాం. అంతిమంగా అందరి లక్ష్యం ఆక్రమణలకు గురికాకుండా అడవులను పరిరక్షించుకునేదై ఉండాలి..’’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్‌కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, కార్యదర్శులు స్మితా సబర్వాల్ , భూపాల్‌రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, సీఎం ఓఎస్డీ ప్రియాంకా వర్గీస్, పీసీసీఎఫ్ శోభ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
KCR: రాష్ట్రాల హక్కులను హరిస్తున్నారు
ఇందిరాగాంధీ మొదలు మోదీ ప్రభుత్వం వరకు ఒకటే తీరు. ఇప్పటివరకు కేంద్రంలో పాలన సాగించిన పార్టీలన్నీ ఒకే తరహాలో పథకాలను అమలు చేశాయి. కాకుంటే పేర్లు మారుస్తారు. వైఖరి మారదు. ఈ ధోరణి విడనాడాలి. రాష్ట్రాలు సొంతంగా పనిచేసుకునే విధంగా మార్పు రావాలి. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను హరించడంలో కేంద్రంలో పాలన సాగించిన బీజేపీ, కాంగ్రెస్‌లు దొందూ దొందేనని సీఎం కేసీఆర్ విమర్శించారు. రాష్ట్రాల అధికారాలను కాలరాస్తూ, రాష్ట్రాల్లోని పాలనను కేంద్రం నియంత్రణలోకి తీసుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశా రు. ఇటీవల పొరుగున ఉన్న తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా తనతో ఫోనులో మాట్లాడి కేంద్రం వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. శాసనసభలో గురువారం పల్లెప్రగతిపై జరిగిన స్వల్పకాలిక చర్చలో సీఎం మాట్లాడారు. ఒక్కొక్కటిగా హక్కులను దెబ్బతీస్తోంది. ‘ఉపాధి హామీ డబ్బును లబ్ధిదారు ఖాతాలోకి వేయడమొక్కటే కాదు.. పెట్రోలు, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెస్తానంటోంది. ఈ నిర్ణయాన్ని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించాయి. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా భగ్గుమంటున్నా యి. యూపీ ఆర్థిక మంత్రి ఏకంగా గొడవకు దిగారు. ఇలా ఒక్కొక్కటిగా రాష్ట్రాల హక్కులను కేంద్రం దెబ్బతిస్తోంది. జీఎస్టీతో రాష్ట్రాలకు భారీగా నష్టం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి చాలా రాష్ట్రాలతో నేరుగా సంబంధాలుండవు. విద్యాసంస్థలు, వైద్యశాఖల నిర్వహణ తదితర అంశాల్లో కేంద్రానికి నేరుగా సంబంధం ఉండదు. కేంద్రం లోని విద్యాశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, పట్టణాభివృద్ధి శాఖలకు సంబంధించిన కార్యాలయాలు రాష్ట్రాల్లో ఉండవు. ఇదివరకు నేను కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంతో పనిచేసిన అనుభవంతో చెప్తున్నా. ఇవన్నీ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది..’అని కేసీఆర్ అన్నారు. స్థానిక సంస్థలకు ప్రతినెలా రూ.339.5 కోట్లు ‘స్థానిక సంస్థలను గాడిలో పెట్టిన ప్రభుత్వం మాదే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిస్థితి దారుణంగా ఉండేది. వాటిల్లో పనిచేసే కార్మికులకు నాలుగైదు నెలలకోసారి వేతనాలు వచ్చేవి. చాలాచోట్ల కారోబార్ దయతోనే జీతాలు అందుకునేవారు. ఇక పారిశుధ్య నిర్వహణ, అభివృద్ధి పనుల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుని అధికారం చేపట్టిన మా ప్రభుత్వం స్థానిక సంస్థల నిర్వహణలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపింది. ప్రతి స్థానిక సంస్థకు ప్రణాళికను తయారు చేయించాం. వాటి నిర్వహణకు నెలకు ఠంచనుగా రూ.339.5 కోట్లు విడుదల చేస్తున్నాం. ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చే నిధులు ఆలస్యం అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఈ నిధులు క్రమం తప్పకుండా ఇస్తున్నాం. దేశంలో ఇలా ఠంచనుగా నిధులిస్తున్న ప్రభుత్వం మరొకటి లేదు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీకి కార్యదర్శిని నియమించి పాలనను గాడిలో పెట్టాం. స్థానిక సంస్థల అభివృద్ధి కోసం గత కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లలో రూ.12,173 కోట్లు ఖర్చు చేస్తే, మా ప్రభుత్వం ఏడేళ్లలో రూ.58,303 కోట్లు ఖర్చు చేసింది. బిందెలతో ధర్నాలు ఇప్పుడు లేవు ఇదివరకు గ్రామాల్లో మంచి నీళ్లు లేక బిందెలతో ధర్నాలు చేసిన సంఘటనలు అనేకం ఉండేవి. ఇప్పుడు మిషన్ భగీరథతో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాం. గ్రామం, పట్టణం అనే తేడా లేకుండా అంతటా పచ్చదనాన్ని పెంచేందుకు హరితహారాన్ని పెద్ద ఎత్తున చేపట్టాం. ప్రతి పల్లెలో హరితవనాలు ఏర్పాటు చేశాం. వైకుంఠధామాలు, ప్రకృతి వనాలు.. ఇలా రకరకాలుగా పచ్చదనాన్ని పెంచుతున్నాం. ప్రతి మండలంలో 5 ఎకరాల విస్తీర్ణంలో బృహత్ వనాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించాం..’అని ముఖ్యమంత్రి చెప్పారు. పైసా ఇవ్వని కేంద్రం ‘తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలకు గాను.. పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు సంస్థలు అవార్డులతో సత్కరించాయి. మిషన్ భగీరథ, ఉపాధి హామీ పథకం అమలు తదితరాలపై నీతి అయోగ్ ప్రశంసలు కురిపించింది. మిషన్ భగీరథ ప్రాజెక్టుపై పలు రకాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించడమే కాకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రానికి సూచించింది. చివరకు కేంద్ర ప్రభుత్వం కూడా అవార్డులు ఇచ్చింది. అభినందనలు తెలిపింది. కానీ ఒక్క పైసా ఇవ్వలేదు. శుష్కప్రియాలు... శూన్య హస్తాలు అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పైగా కేంద్రం ఇవ్వాల్సిన వాటాల్లో 25 శాతాన్ని తగ్గించడం దారుణం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగికీ ఇవ్వనంతగా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఇస్తున్నాం. ఇటీవల 30 శాతం పెంచాం. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, సొసైటీ ఉద్యోగులకు కూడా వేతనాలు పెంచి అందిస్తున్నాం. స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులకూ గౌరవ వేతనాన్ని ఉత్తమంగా ఇస్తున్నాం, ఇక గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పనిచేసే పారిశుధ్య కార్మికుల వేతనాలు కూడా రెట్టింపు చేశాం..’అని ముఖ్యమంత్రి తెలిపారు. వక్ఫ్ ఆస్తుల ఆక్రమణపై సీబీసీఐడీ విచారణ ‘వక్ఫ్ బోర్డు ఆస్తుల ఆక్రమణలపై సీబీసీఐడీతో విచారణ జరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దేవాదాయ భూములు, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఎక్కడ ఆక్రమణలు జరిగినా ఉపేక్షించేది లేదు. సభ్యులు అక్బరుద్దీన్ కోరినట్లుగా సీబీసీఐడీతో విచారణ చేయించేందుకు మేము సిద్ధమే. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు తక్షణమే జారీ చేస్తాం. వైద్యం, ఆరోగ్యంపై ప్రత్యేక కార్యాచరణ వైద్య, ఆరోగ్యంపై మరింత శ్రద్ధ తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వ ఆస్పత్రులు నిర్మించాలని నిర్ణయించాం. గచ్చిబౌలిలో అత్యాధునిక సాంకేతికతతో టిమ్స్ ఏర్పాటు చేశాం. మరో మూడుచోట్ల కూడా వీటిని నిర్మించనున్నాం. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను తరలించి అక్కడ మరో ఆస్పత్రిని నిర్మిస్తాం. అల్వాల్ సమీపంలో, మంచిరేవులలో మరో రెండు ఆస్పత్రులు నిర్మిస్తాం. నగరానికి నాలుగు దిక్కులా ఈ ఆస్పత్రుల్ని అన్ని రకాల సదుపాయాలతో అందుబాటులోకి తీసుకొస్తాం..’అని సీఎం చెప్పారు. సలహా బాగుందన్నారు కానీ.. ‘హైదరాబాద్ చారిత్రక నగరం. ఈ నగరాన్ని ఎవరో ఒక్కరు నిర్మించడం సాధ్యం కాదు. కాలక్రమేణా అభివృద్ధి చెందుతూ, విస్తరిస్తూ వస్తోంది. దేశంలో ఇలాంటి చార్రితక నగరాలు ఐదు ఉన్నాయి. కొల్కతా, బెంగళూరు, చెన్నై, ముంబయి నగరాలను కూడా మరింత అభివృద్ధి చేయాలని ప్రధాని మోదీతో చాలాసార్లు చెప్పా. ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని అడగడంతో.. ప్రతి సంవత్సరం ఒక్కో నగరంలో రూ.10 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించా. ఈ సలహా బాగుందని కితాబిచ్చారు. కానీ ఇప్పటికీ పైసా ఇవ్వలేదు. నేను తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నెలరోజుల్లో హైదరాబాద్ స్థితిని చూశా. సీఎం ఇంటి ముందు చాలాచోట్ల నీళ్లు నిలవడం చూసి ఇదేందని జీహెచ్ఎంసీ అధికారులను అడిగితే వారంలో కొత్త ప్రణాళికతో వచ్చారు. రూ.15 వేల కోట్లు ఇస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. గత ప్రభుత్వాలు నగరాన్ని ఇంత దారుణంగా చేశాయని అప్పుడు తెలిసింది. కానీ ఈ నగరాన్ని మరింత బాగు చేసుకుందాం. విశ్వనగరంగా తీర్చిదిద్దుదాం. హైదరాబాద్‌ను ఇస్తాంబుల్ చేస్తానని చెప్పా. ప్రజల్లో పాజిటివ్ ఆలోచన పెంచే విధంగా చెప్పాను. కరీంనగర్‌ను డల్లాస్ చేస్తానని అనలేదు. అక్కడ గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మిస్తే లండన్ నగరంలా మారుతుందని చెప్పా. రూ.330 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుంది..’అని కేసీఆర్ తెలిపారు. గుండెమీద చెయ్యి వేసుకుని మాట్లాడాలి ‘ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు, తర్వాత పరిస్థితిని బేరీజు వేసుకుని సభ్యులు మాట్లాడాలి. సభ్యులు చేసే చర్చ, మాట్లాడే తీరు సభ ఔన్నత్యాన్ని, హుందాతనాన్ని పెంచేలా ఉండాలి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో చేసిన పనులు, ఇప్పుడు మా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను పోల్చి చూడండి. మంచి చేస్తే ప్రశంసించాల్సిన అవసరం కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి విమర్శలు చేయాలి. కానీ ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై గుండె మీద చెయ్యి వేసుకుని మాట్లాడాలి..’అని సీఎం హితవు పలికారు. క్షేత్రస్థాయిలో ప్రత్యేకించి ఏమైనా సమస్యలుంటే అధికారుల దృష్టికి, మంత్రుల దృష్టికి తేవాలని, వాటిని యుద్ధప్రాతిపదికన పరిష్కరిస్తామని కేసీఆర్ చెప్పారు. చదవండి: ఈటల స్వార్థం వల్లే ఉపఎన్నిక -
తల్లులకు పోషణ.. పిల్లలకు రక్షణ: సీఎం జగన్
సాక్షి, అమరావతి: నేటి బాలలే రేపటి పౌరులని.. చిన్నారులకు పౌష్టికాహారం అందించడం కోసమే సంపూర్ణ పోషణ పథకాలను ప్రారంభించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్, వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తానేటి వనిత, బొత్స సత్యనారాయణ, శంకర్ నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ హెల్దీ బాడీ, హెల్దీ మైండ్ చాలా అవసరమని తెలిపారు. (చదవండి: జగన్ పాలనపై వంద శాతం సంతృప్తి) ‘‘గర్భిణీల్లో 53 శాతం మందికి రక్తహీనత ఉంది. తక్కువ బరువున్న పిల్లలు సుమారు 32 శాతం మంది ఉన్నారు. రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న గర్భిణీలు, బాలింతలు, 6 నుంచి 72 నెలలలోపు పిల్లలకు పౌష్టికాహారం అందిస్తాం. చదువు, ఆలోచనల్లో బలహీనులుగా ఉండకూడదనే ఈ పథకాలు. అంగన్వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ కేంద్రాలుగా మార్చబోతున్నాం. 55,607 అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తాం. ప్రపంచంతో పోటీ పడే విధంగా ఇంగ్లీష్ మీడియాన్ని కూడా తీసుకొచ్చాం. తల్లులకు పోషణ, పిల్లలకు రక్షణగా వైఎస్ఆర్ పోషణ, వైఎస్ఆర్ పోషణ ప్లస్ పథకాలు ఉంటాయని’ సీఎం తెలిపారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం కింద 26.36లక్షల మంది గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల కోసం రూ.1,555.56 కోట్లు ఖర్చు చేయబోతున్నామని తెలిపారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం కింద 77 గిరిజన మండలాల్లో 3.80లక్షల మంది గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల కోసం రూ.307.55 కోట్లు కేటాయించామన్నారు. మొత్తంగా సుమారు రూ.1863 కోట్లు ఖర్చు చేయబోతున్నామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. సీఎం ప్రసంగంలో ముఖ్యాంశాలు.. ఇవాళ ప్రారంభిస్తున్న వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలు నిజంగా మంచి చేయడంలో సంతృప్తి ఇచ్చే కార్యక్రమాలు. ♦గతంలో పిల్లలు ఎలా ఉన్నారు? ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారా? లేదా? ఆరోగ్యంగా ఉన్నారా? వారి తల్లులు ఎలా ఉన్నారన్నది ఎవరూ ఆలోచన చేయలేదు. వారికి ఏం చేయాలన్నది కూడా ఆలోచించలేదు. హెల్తీ బాడీ. హెల్తీ మైండ్. అన్నది ఎవ్వరూ పట్టించుకోలేదు. ♦చాలీ చాలని విధంగా నిధులు ఇచ్చేవారు. ఏటా రూ.500 కోట్లు ఇస్తే ఎక్కువ అన్నట్లుగా ఉండేది. ♦మన పిల్లలు రేపటి పౌరులు, రేపటి ప్రపంచంతో వారు పోటీ పడే స్థితిలో ఉన్నారా? లేరా? అన్నది చూశాక వారిలో మార్పు తీసుకురావాలని అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం. ♦నేటి తరంలో చాలా మందికి మంచి ఆహారం లభించడం లేదు. పిల్లలు, తల్లిదండ్రులు ఆ పరిస్థితిలో ఉన్నారు. వారందరిలో మార్పు తీసుకురావడం కోసమే ఈ పథకాలు. ♦పేదల పిల్లలకు బలహీనత, రక్తహీనత వంటి అనేక అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ♦వాటికి సంబంధించి మన పిల్లలు ఎలా ఉన్నారన్నది చూస్తే, అలాగే తల్లుల పరిస్థితి చూస్తే.. గర్భవత్లులో దాదాపు 53 శాతం మంది రక్తహీనతతో బాధ పడుతున్నారు. ♦31.9 శాతం పిల్లలు తక్కువ బరువుతో జన్మించడం లేదా 5 ఏళ్ల వరకు అలాగే ఉంటున్నారు. ♦17.2 శాతం మంది పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు లేరు. మరో 31 శాతం మంది పిల్లలు బరువుకు తగ్గ ఎత్తులో లేరు. ♦ఇంత దుస్థితి ఉంది, ఇవి కొత్తగా వచ్చినవి కావు, కానీ గతంలో పాలకులు ఏ మాత్రం పట్టించుకోలేదు. ♦ఈ నెంబర్లు మారాలి, పరిస్థితి మారాలి. పిల్లల ఎదుగుదల లేక, వారు వెనకబడి పోతున్నారు. ♦ఇంట్లో తినడానికి తగిన ఆహారం లేకపోతే, అది పిల్లల మేధస్సు, ఎదుగుదలలో కనిపిస్తోంది. తల్లిదండ్రులకు తగ్గట్లుగా పిల్లలు కూడా తగిన ఎదుగుదల లేక ఉన్నారు. ఈ పరిస్థితి మారాలి ♦ఇవన్నీ తెలిసినా, గతంలో ఎవరూ పట్టించుకోలేదు. అందుకే ఈ ప్రభుత్వం ముందుకు అడుగు వేసింది. ఆ దిశలోనే పిల్లలు, గర్భిణీలు, బాలింతల బాగు కోసం ఈ పథకాలు. ♦55607 అంగన్వాడీల పరిధిలో పూర్తి మార్పులు చేస్తూ, పీపీ–1, పీపీ–2 ప్రారంభిస్తున్నాం. ♦బాగా డబ్బున్న వారి కుటుంబాల వారి పిల్లలు ప్రాథమిక స్థాయిలో రకరకాల చదువులు చదువుతున్నారు, పేద పిల్లలు కూడా అలాగే చదవాలన్న తపనతో ఈ మార్పులు చేస్తున్నాం. ♦పీపీ–1, పీపీ–2 ప్రారంభిస్తూ, ఇంగ్లిష్ మీడియంలో గట్టి పునాది వేసేలా అంగన్వాడీల్లో మార్పు చేస్తున్నాం. రూపు మార్చుకున్న అంటరానితనం: ♦ఇంగ్లిష్ మీడియాన్ని వ్యతిరేకిస్తున్న వారిలో రూపం మార్చుకున్న అంటరానితనం కనిపిస్తోంది, వారిలో మార్పు రావాలి. ♦వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం, వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం ప్లస్ పథకాల ద్వారా దాదాపు 30.16 లక్షల అక్క చెల్లెమ్మలు, చిన్నారులకు లబ్ధి. ♦47,248 అంగన్వాడీ కేంద్రాలు గిరిజనేతర ప్రాంతాల్లో ఉన్నాయి. ♦మొత్తంగా ఏటా రూ.1863.11 కోట్ల వ్యయంతో పౌష్టికాహారం సరఫరా. ♦గత ప్రభుత్వం ఏటా కనీసం రూ.500 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. ఖర్చుకు వెనకాడవద్దు: ♦రోజూ పెట్టే మెనూలో ఇంకా ఏమైనా మార్పులు తీసుకురండి. ఎక్కువ ఖర్చైయినా ఫరవాలేదు, తినడానికి ఆసక్తిగా ఉండాలి. ♦ప్రతి లబ్ధిదారునిపై గతంలో నెలకు కనీసం రూ.200 కూడా ఖర్చు చేయలేదు, కానీ ఈ ప్రభుత్వం రూ.1100 ఖర్చు చేస్తోంది. ♦కోవిడ్ సమయంలో ఆదాయాలు పడిపోయాయి. గత ప్రభుత్వం పెద్ద ఎత్తున బకాయిలు పెట్టి పోయింది. వాటన్నింటినీ తీరుస్తూ, అందరికీ మేలు చేయడం కోసం ఈ పథకాలు అమలు. ♦అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచాయి. అధికారం లోకి రాగానే తొలుత 77 మండలాల్లో ప్రయోగాత్మకంగా పథకం అమలు. దాని ఫలితాలు విశ్లేషించి ఇవాళ్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు. రాబోయే రోజుల్లో.. ♦రాబోయే రోజుల్లో అంగన్వాడీ కేంద్రాలలో ఇంకా అభివృద్ధి. ♦నాడు–నేడులో రూపురేఖలు మార్పు. ♦ఆ దిశలో కొత్తగా పీపీ–1, పీపీ–2లు ప్రారంభం, బాలలకు పౌష్టికాహారం. ♦పేదలు కూడా సగర్వంగా మంచి విద్యను పొందేలా ఈ కార్యక్రమం ద్వారా చేయగలుగుతామని నమ్మకం. -
వైఎస్ జగన్ పథకాలతో ప్రతిఇంటా ఆనందం
-
24 గంటల కరెంటు కేసీఆర్ చలవే
ఆదిలాబాద్‌టౌన్: అన్ని రంగాలకు 24 గంటల నిరంతర విద్యుత్ ఇచ్చిన ఘనత ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌దేనని టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేయడంతో పాటు కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి కేసీఆర్ కృషి చేశారని పేర్కొన్నారు. కుప్టి, సుద్దాల ప్రాజెక్టు, తదితర ప్రాజెక్టుల నిర్మాణానికి కృషి చేశారని అన్నారు. గడ్డెన్నవాగు, స్వర్ణ బ్యారేజీ, సదర్మాట్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కోసం నిధులను మంజూరు చేసినట్లు తెలిపారు. 29 రాష్ట్రాల్లో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేశారని వివరించారు. రూ.45వేల కోట్ల నిధులను సంక్షేమ పథకాల కోసం కేటాయించినట్లు తెలిపారు. బడ్జెట్లో 8.5 శాతం సంక్షేమం కోసం కేటాయించారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేవలం 5శాతం, మహా రాష్ట్ర 3.1 శాతం మాత్రం నిధులనే సంక్షేమ పథకాల కోసం కేటాయించారని వెల్లడించారు. ఆసరా పింఛన్లను రూ.వెయ్యి నుంచి రూ.2వేలకు పెంచేలా మేనిఫెస్టోలో పొందుపర్చినట్లు తెలిపారు.సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు యూనుస్‌అక్బాని, అన్నారావు, సతీష్, సురేష్, రాజేశ్వర్, తదితరులున్నారు. -
మైనారిటీల అభివృద్ధికి ప్రభుత్వ కృషి
బాన్సువాడ : రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని, సంక్షేమ రంగంలో రాష్ట్రం ముందంజలో ఉందని రాష్ట్ర డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. శనివారం సాయంత్రం బాన్సువాడలో ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడారు. సీఎం కేసీఆర్ లౌకికవాది అని, దేశం లో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో ముస్లింలకు రాష్ట్రవ్యాప్తంగా ఇఫ్తార్విందుతో పాటు నిరుపేదలకు దుస్తులు అందజేస్తున్నారన్నారు. ఇఫ్తార్ విందుల్లో పార్టీలకు, కులమతాలకు అతీతంగా వేల సంఖ్యలో ప్రజలు పాల్గొనడం తెలంగాణ సంస్కృతి కి నిదర్శనమన్నారు. మసీదుల్లో పని చేసే ఇమామ్, మౌజన్లకు రాష్ట్రప్రభుత్వం రూ.వెయ్యి చొప్పున భృతి చెల్లిస్తుందని, షాదీముబారక్‌తో పేద యువతుల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. రాష్ట్రంలో 206 మైనారిటీ గురుకులాలను ప్రారంభించామని, మైనారిటీ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు నాసా సదస్సులో తమ ప్రదర్శనలు చూ పారన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో ముస్లిం ల అభ్యున్నతికి మంత్రి కృషి చేస్తున్నారన్నారు. అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు.. అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందాలన్నది రాష్ట్రప్రభుత్వ ధ్యేయమని మంత్రి పోచారం శ్రీనివాస్‌రె డ్డి అన్నారు. ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం కోట్లాది నిధులు వెచ్చిస్తుంద న్నారు. అనంతరం తెలంగాణాలో వర్షాలు బాగా కు రవాలని, రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందా లని ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కలెక్టర్ సత్యనారాయణ, ఆర్డీఓ రాజేశ్వర్, రైతు స మన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, నార్ల సురేష్ , పార్టీ మండల అధ్యక్షుడు మోహన్ నాయక్, టీఆర్ఎస్ నేతలు మహ్మద్ ఎజాస్, ఎర్వల కృష్ణారెడ్డి, అలీముద్దీన్ బాబా,వహీద్, ఖవీ చావుస్,రిజ్వాన్, ఖయ్యూం నిషాత్, ముఖీద్, పాతబాలకృష్ణ, తన్‌జీముల్ మసాజిద్ అధ్యక్ష కార్యదర్శులు మునయిం, అబ్దుల్ వహాబ్, తహసీల్దార్ గోపి పాల్గొన్నారు. -
ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
హుజూర్నగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అల్లం ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని 9వ వార్డులో మామిడి రాములుకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ.35,500ల చెక్కును ఆయన పంపిణీ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ తేజావత్ రవినాయక్, సైదులునాయక్, మామిడి వసంత్, ములకలపల్లి రాంబాబు, వెంకటరెడ్డి, మహేష్, చంటి, ఉపేందర్, సైదులు, రాజు పాల్గొన్నారు. -
పథకాల అమల్లో నిర్లక్ష్యం వద్దు
తుర్కపల్లి : ప్రభుత్వ పథకాల అమల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు శ్రద్ధ వహించాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో పాల్గొని ఆమె మాట్లాడారు. తెలంగాణను అన్ని రంగాలల్లో అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఆహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. వ్యవసాయాన్ని సుస్థిరం చేయాలనే ఉద్దేశంతోనే మిషన్ కాకతీయను ప్రభుత్వం చేపట్టినట్లు వివరించారు. నేడు కురుస్తున్న వర్షాలతో చెరువుల్లో జలకళ సంతరించిదన్నారు. నేడు ప్రాజెక్ట్‌లు, వాటర్ గ్రిడ్ వంటి పథకాలతో ప్రభుత్వం ముందుకు సాగుతుంటే ప్రతిపక్షనాయకులు లేనిపోని రాద్ధాంతం చేస్తుందని విమర్శించారు. మిషన్ కాకతీయ పథకంలో తూములు బిగించకుండా పనులు నిర్వహించిన చెరువుల కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని అధికారులకు సూచించారు. యాద్రాది జిల్లాలో పనిచేసే అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. కొత్త అంగన్వాడీ కేంద్రాలతో పాటుగా ఖాళీలను భర్తీ చేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బబ్బూరి రవీంద్రనాథ్, జెడ్పీటీసీ బోరెడ్డి జ్యోతి, వైస్‌ఎంపీపీ పలుగుల ఉమారాణి, డీసీసీబీ డైరక్టర్ పిన్నపురెడ్డి నరేందర్‌రెడ్డి, ఎంపీటీసీలు తలారి శ్రీనివాస్, బద్దూ నాయక్, రాజయ్య, రఘురాములు, అరుణభాస్కర్, లక్ష్మీ, హరినాయక్, చైతన్యమహేందర్‌రెడ్డి, ప్రకాశ్, తహసీల్దార్ నాగలక్ష్మీ, ఎంపీడీఓ జలంధర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఈ పథకాల్లో పెట్టుబడి సురక్షితం
చింతలపూడి : ప్రస్తుతం బ్యాంక్ వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయి. చిన్నమొత్తాల్లో పెట్టుబడి పెట్టాలనుకునే చిరుజీవులకు కంపెనీ ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా చిన్న మొత్తాల సంస్థ పథకాలు ఉపయుక్తంగా ఉంటాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కంపెనీ ఫిక్స్డ్ డిపాజిట్లకు భద్రత తక్కువ. చిన్నమొత్తాల పొదుపు ప«థకాల్లో పెట్టుబడులు సురక్షితంగా ఉంటాయి. పైగా ప్రభుత్వ హామీని కలిగి ఉంటాయి. దీంతో అవే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఆ పథకాల గురించి ఓ సారి స్థూలంగా.. పీపీఎఫ్ పథకం వడ్డీ రేట్ల విషయంలో బ్యాంక్ డిపాజిట్లతో పోలిస్తే పీపీఎఫ్ ఉత్తమమైన పథకం. బ్యాంక్ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి పరిమితి దాటితే పన్ను కట్టాల్సి వస్తుంది. పీపీఎఫ్కైతే పన్ను మినహాయింపు ఉంటుంది. బ్యాంకులు కేవలం 7.5 శాతం వడ్డీ ఇస్తుండగా, పీపీఎఫ్‌లో మాత్రం 8.1 శాతం వడ్డీ వస్తోంది. ఆదాయపు పన్నుచట్టం 80సీ పన్ను మినహాయింపు ఉంది. పీపీఎఫ్ మెచ్యూరిటీ 15 ఏళ్లు. సుకన్య సమృద్ధి కంపెనీ ఫిక్స్డ్ డిపాజిట్ల పథకాలను పక్కన పెడితే ఏ ఇతర పెట్టుబడి పథకంలో కూడ 8.6 శాతం వడ్డీ రావడం లేదు. కాబట్టి మీకు అమ్మాయి ఉంటే ఈ పథకం గురించి ఆలోచించడం మంచిది. వచ్చే రాబడికి పన్ను ఉండదు. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంది. మీకు అమ్మాయి ఉంటే వెంటనే ఈ పథకంలో పెట్టుబడి పెట్టొచ్చు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు ఇతర పోస్టాఫీసు పథకాల్లాగే జాతీయ పొదుపు పత్రాలు బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీని అందిస్తున్నాయి. ప్రస్తుతం 8.1 శాతం వడ్డీ రేటు అంటే బ్యాంకుల కంటే 0.5 శాతం అదనంగా వడ్డీ లభిస్తోంది. సెక్షన్ 80సీ కింద ఆదాయపు పన్ను మినహాయింపు ఉంది. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్స్ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌లో భాగంగా 8.6 శాతం వడ్డీ వస్తోంది. ఇది మారుతూ ఉంటుంది. ఈ పథకంలోనూ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంది. ఇందులో పెట్టుబడి కాల పరిమితి ఐదేళ్లు. ఈ ఖాతాలను ఒక పోస్టాఫీసు నుంచి మరో చోటకు, ఓ బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు మార్చుకునే సదుపాయం ఉంది. వడ్డీ సంవత్సరానికి 10 వేలు మించితే టీడీఎస్ కట్ చేస్తారు. నెలవారీ ఆదాయ పథకాలు నెలవారీ ఆదాయ పథకాలు కూడా బ్యాంక్ డిపాజిట్లకంటే మంచి వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. నెలవారీ బ్యాంక్ డిపాజిట్లపై మీకు వచ్చే వడ్డీ 7–7.3 శాతం మధ్య ఉంటే , నెలవారీ ఆదాయ పథకాల్లో వచ్చే వడ్డీ 7.8 శాతం ఉంది. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకంలో డిపాజిట్లపై ఏప్రిల్ 1, 2016 నుంచి 7.4 శాతం వడ్డీ వస్తోంది. ఇది ప్రతి మూడు నెలలకు ఒకసారి కాంపౌండ్ అవుతుంది. డిపాజిట్ చేసిన ఏడాది తరువాత విత్‌డ్రాయల్స్‌కు అనుమతి ఇస్తారు. కనీసం రూ.10 నిల్వతో పోస్టాఫీస్ ఆర్డీని ప్రారంభిచవచ్చు. ఖాతాను చెక్కు, నగదు రూపంలో తెరిచేందుకు వీలుంది. ఖాతాను మైనర్ పేరిట కూడా తెరవచ్చు. నామినేషన్ ఎంచుకునే సౌకర్యం కూడా ఉంది. -
పథకాలన్నీ కాంగ్రెస్‌వే :భిక్షమయ్యగౌడ్
యాదగిరిగుట్ట : టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినవేనని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. సోమవారం యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకే కొత్తపేర్లతో ప్రారంభోత్సవాలు జరుపుకుంటున్నారని విమర్శించారు. తొలి సారిగా రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నిధులు ఏ మాత్రం ప్రకటించకున్నా తనపై సీబీఐ కేసులు బయటకి రాకుండా ఉండడానికే సీఎం ప్రధానిని పొగడ్తలతో ముంచెత్తారని విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ సాధించిన శక్తులే కేసీఆర్ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడుతున్నాయన్నారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్‌గౌడ్, గుండ్లపల్లి నర్సింహగౌడ్, గుడ్ల వరలక్ష్మీ, కలకుంట్ల బాలనర్సయ్య, పెలిమెల్లి శ్రీధర్‌గౌడ్, తంగళ్లపల్లి సుగుణాకర్, కానుగు బాలరాజు, షంషీర్‌పాషా, బొజ్జ సాంబేష్ ఉన్నారు. -
పాతపథకాలకు ప్రారంభోత్సవాలా?
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వీణవంక: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటనతో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమిలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. యూపీఏ హయాంలో చేపట్టిన పథకాలకే శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారని ధ్వజమెత్తారు. ఆదివారం వీణవంకలో జరిగిన ఓ కార్యక్రమానికి వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మంచినీటి పథకాలకు కొత్తగా మిషన్ భగరీథ పేరుతో ప్రారంభోత్సవాలు చేస్తున్నారని విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లో 1200ల మెగావాట్ల సింగరేణి విద్యుత్ కేంద్రం పనులు యూపీఏ హయాంలోనే 95 శాతం పూర్తయ్యాయని తెలిపారు. ఆ ప్లాంట్‌ను మోదీ ఇప్పుడు జాతీకి అంకితం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.10 వేల కోట్లు మంజూరు చేసిన సంగతి మర్చిపోయారని ప్రశ్నించారు. యూపీఏ ప్రభుత్వంలోనే మనోహరబాద్–కొత్తపల్లి రైల్వే లైన్‌కు గ్రీన్‌సిగ్నల్ వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ పాత పథకాలను కొత్తవి అంటూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. మోడీ పర్యటన అంటూ కోట్లు ఖర్చుచేశారే తప్ప.. తెలంగాణకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. మెదక్ జిల్లా రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్న సంఘటనపై ప్రధాని స్పందించకపోవడం దారుణమని అన్నారు. తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉన్నాయని.. వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఉద్యోగుల విభజనపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్న విషయం గుర్తించుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతామని స్పష్టం చేశారు. టీపీసీసీ చైర్మన్ వెంట మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయం, మాజీ ఎమ్మెల్యేలు ఆరపెల్లి మోహన్, అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు తుమ్మేటి సమ్మిరెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి
మునుగోడు: పేద ప్రజల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకంపై అవగాహన కలిగి ఉండాలని శ్రీ శాంతి గ్రామీణ, పట్టణాభివృద్ధి సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు బక్క యాదయ్యగౌడ్ కోరారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ ముద్రించినా పోస్టర్‌ను శనివారం మండల కేంద్రంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పథకాలపై గ్రామీణ ప్రజలకు అవగాహాన కల్పించేందుకు జానపద కళాకారులు ఈ నెల 25 నుంచి 31 వరకు వివిధ గ్రామాల్లో ప్రచారం చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పందుల నర్సింహా, పగడాల నాగయ్య, బండారి నర్సింహాæ, బక్క భాస్కర్, జీడిమడ్ల ముత్తయ్య పాల్గొన్నారు. -
బాబూ.. వినవా! వివక్ష మానవా!!
పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా పూర్వపు కడప జిల్లా దర్శనమిచ్చేది. ముఖ్యమంత్రులు రాజకీయ వివక్షతో అభివృద్ధిని విస్మరించారు. మరోమారు అలాంటి వివక్షత కన్పిస్తోంది. పెండింగ్ పథకాలు పూర్తి చేయాలనే సంకల్పం పాలకుల్లో కన్పించడం లేదు. 90 శాతం పూర్తయిన పనులు కూడా ఐదేళ్లుగా దిష్టిబొమ్మల్లా మిగిలాయి. చంద్రబాబు సర్కారు కూడా వీటి పూర్తికి ఆసక్తి చూపడంలేదు. వివక్ష విడనాడి అభివృద్ధిపై దృష్టి సారించాలని జిల్లా వాసుల వాంఛ. సాక్షి ప్రతినిధి, కడప: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జిల్లా సమగ్రాభివృద్ధి దిశగా పరుగులు తీసింది. విద్య, వైద్య, పారిశ్రామికంగా,మౌళిక సదుపాయాలు కల్పనలో ఆయన ప్రత్యేక చొరవ చూపారు. పథకాలు తుదిదశకు చేరుతున్నాయన్న తరుణంలో ఆయన అమరుడయ్యారు. ఆ వారసత్వంలోని ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఒక్కొక్కటిగా పథకాలు మరుగున పడ్డాయి. కొత్తగా వచ్చిన ప్రభుత్వం సైతం అదే వైఖరితో జిల్లా పట్ల వివక్ష చూపుతోంది. బోర్డులకే పరిమితమైన పారిశ్రామిక వాడ... పరిశ్రమల స్థాపన కోసం చేపట్టిన పారిశ్రామికవాడ బోర్డులకే పరిమితమైంది. కడప సమీపంలోని చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి, వల్లూరు మండలాల్లో 6,464.5 ఎకరాలను ఏపీఐఐసీ ద్వారా భూములు సేకరించారు. ఈ పారిశ్రామిక వాడకు సోమశిల బ్యాక్ వాటర్ ద్వారా నీటి పథకం ప్రభుత్వం ప్రణాళిక రచించింది. బీడీఎల్(భారత్ డైనమిక్ లిమిటెడ్), డిఫెన్స్ రీసెర్చ్ డెవెలప్మెంట్ ల్యాబ్ (డిఆర్డిఓ)లాంటి ప్రాజెక్టులు నెలకొల్పేందుకు ముందుకు వచ్చినా పాలకపక్షం ఆదరణ లేక తరలివెళ్లాయి. మరికొన్ని ఫార్మాకంపెనీలు పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందకొచ్చాయి. అయితే నీటి సౌకర్యం లేకపోవడంతో వెనకడుగు వేస్తున్నాయి. జిఓఎంకే పరిమితమైన ఉక్కు పరిశ్రమ... రాష్ట్ర విభజన బిల్లులో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ప్రకటనలకే పరిమితమైంది. రాయలసీమలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ఎంతో అవసరం. నిరుద్యోగ సమస్యను దృష్టిలో ఉంచుకుని ఉక్కు పరిశ్రమ స్థాపనకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సంకల్పించారు. జమ్మలమడుగు సమీపంలో ‘బ్రహ్మణీ స్టీల్స్’ను 20 వేల కోట్ల రూపాయల అంచానా వ్యయంతో చేపట్టారు. దాదాపు రూ. 1250 కోట్ల రూపాయల పనులు పూర్తయ్యాయి. అనంతర ఏర్పడ్డ రాజకీయ వివక్షత కారణంగా బ్రహ్మణీ స్టీల్స్‌ను ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దు చేసింది. దీనికి కేటాయించిన భూములతో పాటు నీటి కేటాయింపుల జీవోను కూడా రద్దు చేసింది. ఆస్థానంలో ఉక్కు పరిశ్రమ చేపట్టాలని పెద్ద ఎత్తున ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. బ్రహ్మణీ స్థానంలో సెయిల్ నేతృత్వంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలని జిల్లా వాసులు ఆశిస్తున్నారు. నిధుల కోసం ఎదురుచూపుల... జిల్లాకు ప్రాణప్రదమైన గాలేరి-నగరి సుజల స్రవంతి పథకంలో భాగంగా గండికోట ప్రాజెక్టును 28టీఎంసీలతో రూపలకల్పన చేశారు. వరద నీటిని అంచనా కట్టి, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 30 రోజుల్లో నీటిని డ్రా చేసుకునేందుకు వీలుగా వరద కాలువను పూర్తి చేశారు. అవుకు ప్రాజెక్టు నుంచి 20వేల క్యూసెక్కుల సామర్థ్యంతో రూపొందించిన ఈకాలువ ద్వారా గండికోట ప్రాజెక్టు వద్ద 5 కిలోమీటర్ల మేర సొరంగ మార్గం(టన్నెల్) సైతం పూర్తి చేశారు. తుదిదశకు చేరిన ఈ ప్రాజెక్టు నిధుల కోసం ఐదేళ్లుగా ఎదురుచూస్తోంది. ప్రాజెక్టు పూర్తి చేసినా ముంపు పునరావాసం పరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోంది. దాంతో ఇప్పటికీ ముంపువాసులు గ్రామాలు ఖాళీ చేయలేదు. ఈకారణంగా శ్రీశైలం నుంచి వరదనీటిని సద్వినియోగం చేసుకోలేని దుస్థితి. గండికోట, మైలవరం, వామికొండ, సర్వాయసాగర్, పైడిపాళెం, బ్రహ్మంసాగర్ ప్రాజెక్టుల్లో నీరు నిల్వచేసుకునే అవకాశం ఉన్నా ఫలితంలేకపోయింది. విమానాశ్రయం పెండింగ్.... కడప గడపలో 1953 నుంచి విమానాశ్రయం ఉన్నప్పటికీ విమానాల రాకపోకలు మాత్రం లేవు. దాంతో అన్ని సౌకర్యాలతో విమానాశ్రయాన్ని నిర్మించాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సంకల్పించారు. ఇందుకోసం 33 కోట్ల రూపాయల నిధులను ఒకే విడతగా విడుదల చేశారు. రెండు విడతల్లో ఏయిర్పోర్టు నిర్మాణ పనులను చేపట్టారు. 2009 డిసెంబర్ నాటికి మొదటి విడత పనులను పూర్తి చేశారు. రెండో విడత పనులను 2010 అక్టోబరు 10న చేపట్టారు. 13 కోట్ల రూపాయలతో మిగిలిన పనులు దాదాపు రెండు ఏళ్ల క్రితమే పూర్తి అయ్యాయి. అయినప్పటికీ ప్రారంభోత్సవానికి ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితే నూతన కలెక్టరేట్ కాంప్లెక్స్ బిల్డింగ్ సైతం ఎదుర్కోంటుంది. భవనాలు మూడేళ్ల క్రితమే పూర్తి అయినా అందుబాటులోకి తీసుకరాలేదు. -
పథకాలు గిరిజనులకు అందించేందుకు మరింత కృషి అవసరం: సీఎం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సంక్షేమ పథకాలను గిరిజనుల దరికి చేర్చేందుకు అధికారులు మరింత అంకిత భావంతో పనిచేయాల్సి ఉందని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ‘ప్రధానమంత్రి రూరల్ డెవలప్మెంట్ ఫెలోస్’ రూపొం దించిన ‘ఫ్రంది బాటమ్ అప్’ పుస్తకాన్ని బుధవారం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆవరణలో సీఎం ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల గిరిజనుల్లో ఒకసారి నమ్మకాన్ని కలిగిస్తే సంక్షేమ పథకాల అమలు మరింత సులభతరమవుతుందన్నారు. గతేడాది ఏప్రిల్ 7న ప్రారంభమైన ‘ప్రధానమంత్రి రూరల్ డెవలప్మెంట్ ఫెలోస్’ పథకం కింద రాష్ట్రంలో 8 నక్సల్ ప్రభావిత జిల్లాల్లో 15 మంది ‘ఫెలోస్’ను నియమించారు. ఏజెన్సీ గ్రామాల్లో ఏడాదిపాటు వివిధ అంశాలపై వీరి పరిశీ లనలను సీఎం అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్.సుబ్రమణ్యం, సెర్ప్ సీఈఓ రాజశేఖర్, మానవ వనరుల శాఖ డీజీ ప్రశాంత మహాపాత్ర, అడిషనల్ డీజీ ఆర్.వి.చంద్రవదన్ పాల్గొన్నారు.