ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి
ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి
Published Sat, Jul 23 2016 5:59 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
మునుగోడు: పేద ప్రజల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకంపై అవగాహన కలిగి ఉండాలని శ్రీ శాంతి గ్రామీణ, పట్టణాభివృద్ధి సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు బక్క యాదయ్యగౌడ్ కోరారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ ముద్రించినా పోస్టర్‌ను శనివారం మండల కేంద్రంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పథకాలపై గ్రామీణ ప్రజలకు అవగాహాన కల్పించేందుకు జానపద కళాకారులు ఈ నెల 25 నుంచి 31 వరకు వివిధ గ్రామాల్లో ప్రచారం చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పందుల నర్సింహా, పగడాల నాగయ్య, బండారి నర్సింహాæ, బక్క భాస్కర్, జీడిమడ్ల ముత్తయ్య పాల్గొన్నారు.
Advertisement
Advertisement