మాట్లాడుతున్న గోవర్ధన్‌రెడ్డి
ఆదిలాబాద్‌టౌన్: అన్ని రంగాలకు 24 గంటల నిరంతర విద్యుత్ ఇచ్చిన ఘనత ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌దేనని టీఆర్‌ఎస్ ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేయడంతో పాటు కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి కేసీఆర్ కృషి చేశారని పేర్కొన్నారు. కుప్టి, సుద్దాల ప్రాజెక్టు, తదితర ప్రాజెక్టుల నిర్మాణానికి కృషి చేశారని అన్నారు. గడ్డెన్నవాగు, స్వర్ణ బ్యారేజీ, సదర్‌మాట్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కోసం నిధులను మంజూరు చేసినట్లు తెలిపారు. 29 రాష్ట్రాల్లో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేశారని వివరించారు. రూ.45వేల కోట్ల నిధులను సంక్షేమ పథకాల కోసం కేటాయించినట్లు తెలిపారు. బడ్జెట్‌లో 8.5 శాతం సంక్షేమం కోసం కేటాయించారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేవలం 5శాతం, మహా రాష్ట్ర 3.1 శాతం మాత్రం నిధులనే సంక్షేమ పథకాల కోసం కేటాయించారని వెల్లడించారు. ఆసరా పింఛన్లను రూ.వెయ్యి నుంచి రూ.2వేలకు పెంచేలా మేనిఫెస్టోలో పొందుపర్చినట్లు తెలిపారు.సమావేశంలో టీఆర్‌ఎస్ నాయకులు యూనుస్‌అక్బాని, అన్నారావు, సతీష్, సురేష్, రాజేశ్వర్, తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment