సభలో మాట్లాడుతున్న కోదండరాం
సాక్షి,బెల్లంపల్లి: రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ ఎం.కోదండరాం అన్నారు. శుక్రవారం బెల్లంపల్లి సింగరేణి తిలక్ స్టేడియంలో ప్రజాకూటమి ఆధ్వ ర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కు శాశ్వతంగా పరిమితం కానున్రని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం అంటే ప్రజలకు సేవ చేయాలే కానీ దుర్మార్గమైన పాలన సాగించడం కాదన్నారు. తెలంగాణ ఉద్యమ ద్రోహులే అధికారంలో ఉన్నారని తీవ్రంగా విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం వల్ల ప్రజాధనం రూ.40వేల కోట్లు దుర్వినియోగమయ్యాయని ఆరోపించారు. నిస్వార్థ పరుడు, ప్రజాసమస్యలపై పోరాటాలు నిర్వహిస్తున్న సీపీఐ అభ్యర్థి గుండా మల్లేష్‌ను అధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన కోరారు.
టీఆర్‌ఎస్ ఏ కూటమి వైపో ప్రకటించాలి..
టీఆర్‌ఎస్ రాజకీయ వైఖరిని ప్రజలకు స్పష్టంగా వివరించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రంలో ఉన్నా బీజేపీ పక్షం వైపా.. ఆ పక్షానికి వ్యతిరేకంగా పని చేస్తున్న కూటమి వైపా వెల్లడించాలన్నారు. నాలుగున్నర ఏళ్లలో కేవలం 25 వేల ఖాళీ పోస్టులనే భర్తీ చేశారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ సభలో కారుకూరి రాంచందర్, ఎండి అఫ్జల్, ఉదయ్‌కాంత్, బండి ప్రభాకర్, సీ.హెచ్ దుర్గాభవానీ, ఆర్ శారద, కె.శ్రీనివాస్, ఎం. మల్లయ్య (కాంగ్రెస్), శరత్‌బాబు, సుభద్ర, సంజీవరెడ్డి, మణిరాంసింగ్, అమానుల్లాఖాన్(టీడీపీ), కళవేణి శంకర్, సీహెచ్. నర్సయ్య మల్లేష్, ఎం.వెంకటస్వామి, మామిడాల రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment