పథకాల అమల్లో నిర్లక్ష్యం వద్దు | do not neglect in govt schems Execution | Sakshi

పథకాల అమల్లో నిర్లక్ష్యం వద్దు

Sep 15 2016 11:22 PM | Updated on Sep 4 2017 1:37 PM

పథకాల అమల్లో నిర్లక్ష్యం వద్దు

పథకాల అమల్లో నిర్లక్ష్యం వద్దు

తుర్కపల్లి : ప్రభుత్వ పథకాల అమల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు శ్రద్ధ వహించాలని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత అన్నారు. గురువారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో పాల్గొని ఆమె మాట్లాడారు.

తుర్కపల్లి :  ప్రభుత్వ పథకాల అమల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు శ్రద్ధ వహించాలని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత అన్నారు. గురువారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో పాల్గొని ఆమె మాట్లాడారు. తెలంగాణను అన్ని రంగాలల్లో అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం ఆహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. వ్యవసాయాన్ని సుస్థిరం చేయాలనే ఉద్దేశంతోనే మిషన్‌ కాకతీయను ప్రభుత్వం చేపట్టినట్లు వివరించారు.  నేడు కురుస్తున్న వర్షాలతో చెరువుల్లో జలకళ సంతరించిదన్నారు. నేడు ప్రాజెక్ట్‌లు, వాటర్‌ గ్రిడ్‌ వంటి పథకాలతో ప్రభుత్వం ముందుకు సాగుతుంటే ప్రతిపక్షనాయకులు లేనిపోని రాద్ధాంతం చేస్తుందని విమర్శించారు. మిషన్‌ కాకతీయ పథకంలో తూములు బిగించకుండా పనులు నిర్వహించిన చెరువుల కాంట్రాక్టర్లను  బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాలని అధికారులకు సూచించారు. యాద్రాది జిల్లాలో పనిచేసే అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు.  కొత్త అంగన్‌వాడీ కేంద్రాలతో పాటుగా ఖాళీలను భర్తీ చేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బబ్బూరి రవీంద్రనాథ్, జెడ్పీటీసీ బోరెడ్డి జ్యోతి, వైస్‌ఎంపీపీ పలుగుల ఉమారాణి, డీసీసీబీ డైరక్టర్‌ పిన్నపురెడ్డి నరేందర్‌రెడ్డి, ఎంపీటీసీలు తలారి శ్రీనివాస్, బద్దూ నాయక్, రాజయ్య, రఘురాములు, అరుణభాస్కర్, లక్ష్మీ, హరినాయక్, చైతన్యమహేందర్‌రెడ్డి, ప్రకాశ్, తహసీల్దార్‌ నాగలక్ష్మీ, ఎంపీడీఓ జలంధర్‌రెడ్డి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement