vip suneetha
-
మోటకొండూర్‌లో కలుపొద్దు
యాదగిరిగుట్ట : తమ గ్రామాలను నూతనంగా ఏర్పడనున్న మోటకొండూరు మండలంలో కలుపొద్దని ఆయా గ్రామాల ప్రజలు శుక్రవారం యాదగిరిగుట్టలోని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునిత ఇంటిని ముట్టడించి.. వంటావార్పు చేపట్టారు. ఆత్మకూర్(ఎం) మండల పరిధిలోని సింగారం, నాంచారిపేట, కొండాపూర్, కాల్వపల్లి, యాదగిరిగుట్ట మండలంలోని చిన్నకందుకూర్ గ్రామాలను మోటకొండూర్‌లో కలిపితే పాలనాపరంగా ఇబ్బందులు తలెత్తుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నకందుకూర్ అఖిల పక్షం నాయకులు స్థానిక తహసీల్దార్‌ను తన కార్యాలయంలోనే సుమారు రెండు గంటల పాటు దిగ్బంధించారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఇక్కడినుంచి కదలనిచ్చేదిలేదని చెప్పారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పడంతో గ్రామస్తులు తహసీల్దార్‌ను వదిలివేశారు. మోటకొండూరులో కలుపొద్దని జిల్లా కలెక్టర్, భువనగిరి ఆర్డీఓలతో పాటు తహసీల్దార్ కార్యాలయాల్లో గతంలోనే కలిసి వినతిపత్రం అందజేసినట్లు ఆయా గ్రామాల సర్పంచ్‌లు చెప్పారు. ఆత్మకూర్ నుంచి తమను విడదీసి మోటకొండూర్‌లో కలిపితే ఎంతటి ఉద్యమాలకైనా సిద్ధమని చెబుతున్నారు. ఇంటిని ముట్టడించిన సమయంలో ప్రభుత్వ విప్ ఇంట్లో లేకపోవడంతో గేట్‌కు ఫ్లకార్డులు పెట్టి నినాదాలు చేశారు. సీఐ చొరవతో... ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన విషయాన్ని యాదగిరిగుట్ట ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి సీఐ రఘువీరారెడ్డికి తెలిపారు. దీంతో సీఐ ఆందోళనకారులతో మాట్లాడారు. ఎమ్మెల్యేతో శనివారం(నేడు) మాట్లాడిస్తానని సముదాయించినా ఆందోళనకారులు వినలేదు. దీంతో సీఐ మరోసారి పలువురు మహిళలతో, అఖిలపక్షం నాయకులతో చర్చించి ఎమ్మెల్యేను ఉదయం కల్పిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం అఖిలపక్షం నాయకులంతా కలిసి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. తహసీల్దార్‌ను దిగ్బంధించంతో పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. -
పథకాల అమల్లో నిర్లక్ష్యం వద్దు
తుర్కపల్లి : ప్రభుత్వ పథకాల అమల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు శ్రద్ధ వహించాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో పాల్గొని ఆమె మాట్లాడారు. తెలంగాణను అన్ని రంగాలల్లో అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఆహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. వ్యవసాయాన్ని సుస్థిరం చేయాలనే ఉద్దేశంతోనే మిషన్ కాకతీయను ప్రభుత్వం చేపట్టినట్లు వివరించారు. నేడు కురుస్తున్న వర్షాలతో చెరువుల్లో జలకళ సంతరించిదన్నారు. నేడు ప్రాజెక్ట్‌లు, వాటర్ గ్రిడ్ వంటి పథకాలతో ప్రభుత్వం ముందుకు సాగుతుంటే ప్రతిపక్షనాయకులు లేనిపోని రాద్ధాంతం చేస్తుందని విమర్శించారు. మిషన్ కాకతీయ పథకంలో తూములు బిగించకుండా పనులు నిర్వహించిన చెరువుల కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని అధికారులకు సూచించారు. యాద్రాది జిల్లాలో పనిచేసే అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. కొత్త అంగన్వాడీ కేంద్రాలతో పాటుగా ఖాళీలను భర్తీ చేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బబ్బూరి రవీంద్రనాథ్, జెడ్పీటీసీ బోరెడ్డి జ్యోతి, వైస్‌ఎంపీపీ పలుగుల ఉమారాణి, డీసీసీబీ డైరక్టర్ పిన్నపురెడ్డి నరేందర్‌రెడ్డి, ఎంపీటీసీలు తలారి శ్రీనివాస్, బద్దూ నాయక్, రాజయ్య, రఘురాములు, అరుణభాస్కర్, లక్ష్మీ, హరినాయక్, చైతన్యమహేందర్‌రెడ్డి, ప్రకాశ్, తహసీల్దార్ నాగలక్ష్మీ, ఎంపీడీఓ జలంధర్‌రెడ్డి పాల్గొన్నారు. -
‘మల్లన్న సాగర్’ను నిర్మించి తీరుతాం
ఆత్మకూరు(ఎం) : ఏది ఏమైనా మల్లన్న సాగర్ ప్రాజెక్టును నిర్మించి తీరుతామని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ వస్తే కోటి ఎకరాలకు సాగునీరు అందుతుందనే ఆశతో ప్రజలు రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నారన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారని, దానిపై సలహాలు, సూచనలు ఇవ్వడానికి కాంగ్రెస్ నాయకులు పారి పోయినట్లు చెప్పారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో భువనగిరి డివిజన్ సస్యశ్యామలం కానుందన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ కాంబోజు భాగ్యశ్రీభానుప్రకాష్, టీఆర్ఎస్ మండల అద్యక్షుడు దూదిపాల రవీందర్‌రెడ్డి, ప్రదాన కార్యదర్శి గుర్రాల రవి, సర్పంచ్‌లు మల్లేల పర్వతాలు, గుండు పెంటయ్య గౌడ్, నాయకులు కాంబోజు భాను, ఏనుగు అంజిరెడ్డి, మేడి రామనర్సయ్య, కోరె భిక్షపతి, కర్రె అయిలయ్య, కోరె వెంకన్న, చిక్కిరి రవి ఉన్నారు. -
మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన విప్ సునీత
టంగుటూరు (ఆలేరు) : మండలంలోని టంగుటూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వండిన ఆహారాన్ని రుచిచూశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం వడ్డించాలని సూచించారు. ఆమె వెంట మార్కెట్ చైర్మెన్ కాలె సుమలత, ఎంపీపీ కాసగల్ల అనసూర్య, జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, హెచ్ఎం ప్రవీణ్‌కుమార్, ఉపాధ్యాయులు భూషపాక రాములు, సంధ్యారాణి, గుగ్గిళ్ల రవీంద్రచారి, కిష్టయ్య తదితరులు ఉన్నారు.